మరలా పవిత్ర రమజాన్ మాసము వచ్చేసింది

శుక్ర, 04/17/2020 - 14:50

పవిత్ర రమజాను మాసము మరలా తన కారుణ్యం మరియు ఆశీర్వాదాలతో మన ముందుకు వచ్చింది.ఎన్నో ప్రత్యేకతలున్న ఈ అల్లాహ్ యొక్క మాసాన్ని తగిన విధంగా ఆదరించి ఆ దేవుని సామిప్యాన్ని మరియు ప్రాయశ్చితాన్ని పొందగలిగితే ఆ అల్లాహ్ ఆజ్ఞను శిరసావహించినవారమవుతాము.

రంజాన్,దైవప్రవక్త,ప్రాముఖ్యత.

ముస్లిములు ఎప్పుడా అని ఎదురు చూసే పవిత్ర రమజాను మాసము మరలా తన వరాలు కురిపించటానికి మన ముందుకు వచ్చేసింది.ఒక వేళ మనము ఈ రమజానును ఆ దేవుని కారుణ్యాన్ని మరియు అతని కృపను పొండటానికి వినియోగించుకోకపోతే మనము కూడా అహంకారులలో లెక్కింపబడతాము.అనేక ప్రత్యేకతలు కలిగి ఉన్న ఈ మాసము గురించి దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “ప్రజలారా! అల్లాహ్ యొక్క మాసము,కారుణ్యం,ఆశీర్వాదం మరియు పాపాల క్షమాపణతో మీ ముందుకు వచ్చింది.ఈ మాసము ఇతర మాసాల కన్నా చాలా విలువైన మరియు ప్రాముఖ్యత కలిగిన మాసము,ఈ మాసము యొక్క రోజులు ఇతర రోజుల కన్నా విలువైనవి,రాత్రులు ఇతర రాత్రుల కన్నా మిక్కిలి శ్రేష్టమైనవి. మీరు ఆ దేవుని ఆతిధ్యానికి ఆహ్వానింపబడిన మాసమిది. ఆ భగవంతుడు ఈ మాసంలో మిమ్మల్ని ఆదరిస్తున్నాడు. ఈ పవిత్ర రమజాన్ మాసంలో మీరు తీసుకునే శ్వాస కూడా ఆ భగవంతుని ఆరాధనగా పరిగణింపబడుతుంది. ఈ మాసంలో మీ నిద్ర కూడా ప్రార్ధనగా లెక్కింపబడుతుంది. మీ కార్యాలు ఆ దేవుని సన్నిధిలో స్వీకరింపబడతాయి”. ఇలాంటి అనేక ప్రత్యేకతలున్న ఈ మాసంలో ఆ దేవుని కారుణ్యాన్ని,అతని సామిప్యాన్ని మరియు ఆ పరమేశ్వరుని ప్రాయశ్చితాన్ని పొందగలిగితే ఆ దేవుని యొక్క నిజమైన దాసులలో మన పేరు కూడా తప్పక లిఖించబడుతుంది.

రెఫరెన్స్: బిహారుల్ అన్వార్,96వ భాగం,పేజీ నం:157.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11