రమజాన్ నెలలో ప్రతీరాత్రి చదవవలసిన దుఆ

గురు, 05/17/2018 - 14:57

రమజన్ మాసంలో ప్రతీరోజు వేరు వేరు దుఆలు ఉన్నట్లే కొన్ని దుఆలూ రోజు చదవవలసినవి కూడా ఉన్నాయి. వాటి నుండి ఒక దుఆ ఈ దుఆ. దాని ఉచ్చారణ మరియు అనువాదం.

రమజాన్ నెలలో ప్రతీరాత్రి చదవవలసిన దుఆ

اللَّهُمَّ رَبَّ شَهْرِ رَمَضَانَ الَّذِي أَنْزَلْتَ فِيهِ الْقُرآنَ وَ افْتَرَضْتَ عَلَى عِبَادِكَ فِيهِ الصِّيَامَ‏، ارْزُقْنِي حَجَّ بَيْتِكَ الْحَرَامِ فِي هَذَا الْعَامِ وَ فِي كُلِّ عَامٍ‏، وَ اغْفِرْ لِيَ الذُّنُوبَ الْعِظَامَ فَإِنَّهُ لاَ يَغْفِرُهَا غَيْرُكَ يَا ذَا الْجَلاَلِ وَ الْإِكْرَامِ‏
దుఆ: అల్లాహుమ్మ రబ్బ షహ్రి రమజాన్ లజీ అన్ జల్ త ఫీహిల్ ఖురఆన్, వఫ్ తరజ్ త అలా ఇబాదిక ఫీహిస్సియామ్, స్వల్లి అలా ముహమ్మదివ్ వ ఆలి ముహమ్మద్, వర్ జుఖ్ని హజ్జ బైతికల్ హరామ్, ఫీ ఆమి హాజా వ ఫీ కుల్లి ఆమ్, వగ్ ఫిర్లీ తిల్కజ్ జునూబల్ ఇజామ్, ఫ ఇన్నహు లా యగ్ఫిరుహ గైరుక యా రహ్మాను యా అల్లాం.
అనువాదం: ఓ అల్లాహ్! నీవు ఖుర్ఆనును అవతరించినటువంటి రమజాన్ మాసం యొక్క స్వామి. అందులో నీవు ఉపవాస దీక్షను విధిగా నిర్ధారించావు. ముహమ్మద్ మరియు ఆలె ముహమ్మద్ పై కరుణను కురిపించు. మమ్మల్ని నీ గృహదర్శనం, హజ్ చేసే భాగ్యాన్ని ప్రసాదించు, ఈ సంవత్సరం మరియు అలాగే ప్రతీ సంవత్సరం కూడానూ. మా అతి పెద్ద పాపములను క్షమించు, వాటిని నీవు తప్ప మరెవ్వరూ క్షమించలేరు. కరుణామయుడవు నీవే. అన్ని స్థితిగతులు తెలిసినవాడవు కూడా నీవే.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 17 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16