రమజాన్ మాసాన్ని ఆ అల్లాహ్ యొక్క మాసమని ఎందుకంటారు?

శని, 04/18/2020 - 18:07

పవిత్ర రంజాన్ మాసాన్ని ఆ దేవుని మాసమనటానికి కొన్ని కారణాలను ఈ క్రింది వ్యాసంలో పేర్కొనటం జరిగింది.

రంజాన్,అల్లాహ్ మాసం,కారణం.

పవిత్ర రమజాన్ మాసానికి అన్ని మాసాలలో కెల్లా ఒక ప్రత్యేక్త స్థానముంది.కానీ ఈ మాసాన్ని అల్లాహ్ తనతో ఎందుకు ప్రత్యేకించాడు?ఈ మాసాన్ని ఆ అల్లాహ్ యొక్క మాసమని ఎందుకంటారు? అంటే సంవత్సరంలో కొన్ని నెలలు మరియు కొన్ని రోజులు ఆ అల్లాహ్ తో ప్రత్యేకించబడ్డాయి.అలాంటి వాటిలో పవిత్ర రమజాన్ మాసము కూడా ఒకటి.ఆ భగవంతుడు ఈ నెలలో తన కారుణ్యాన్ని,ఆశీర్వాదాన్ని తన దాసులపై కురిపించటం,పాపాలు క్షమించబడటం, సమస్త మానవాళికి మార్గదర్శనం చేసే దివ్యఖురాను అవతరణ ఈ మాసము అల్లాహ్ యొక్క మాసమనటానికి కారణమని చెప్పవచ్చు. అంతే కాకుండా ఈ పవిత్ర రంజాన్ మాసము మానవునిని మార్గదర్శనం చేసే మాసమని,మనిషి యొక్క విధి కూడా ఈ మాసం యొక్క షబె ఖద్ర్ నందు రాయబడునని మరియు ఈ మాసంలో ఉపవాసం ద్వారా మనిషిలో ఆ దేవుని కొరకు భయభక్తులు పెంపొందే అవకాశం కూడా ఉందని దివ్యఖురాను చెబుతుంది [అల్ బఖర/183,185,అల్ ఖద్ర్/4]. ఇన్ని ప్రత్యేకతల వలన ఈ మాసాన్ని ఆ దేవుడు తనతో ప్రత్యేకించాడని చెప్పవచ్చు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15