రమజాన్ మాసంలో ముస్తహబ్ పనుల ప్రాముఖ్యత

ఆది, 05/10/2020 - 14:46

రమజాన్ మాసంలొ చేయవలసిన కొన్ని ముస్తహబ్ పనుల ప్రాముఖ్యతను ఇచట ప్రస్థావించటం జరిగింది.

రమజాన్,ముస్తహబ్,ప్రాముఖ్యత.

1.దు ఆ మరియు ప్రాయశ్చితం: ఇమాం అలి[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: ఈ మాసంలో ఉపవాసములుండే వారు ఎక్కువుగా దూఅ మరియు ప్రాయశ్చితము చేయవలెను.ఎందుకంటే మీరు చేసే దు ఆల వలన మీ నుండి ఆపదలు దూరమవుతాయి.మరియు ప్రాయశ్చితం మీ నుండి పాపాలను దూరం చేస్తుంది [ఆమాలియె షైఖ్ సదూఖ్,పేజీ నం:61].

2.దివ్యఖురాను యొక్క పఠనం: దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఈ విధంగా ఉల్లేఖించారు: ఎవరైతే ఈ మాసంలో ఖురాను యొక్క ఒక ఆయతును పఠిస్తారో,దాని ప్రతిఫలం ఎవరైతే ఇతర రోజులలో ఒక ఖురానును పఠిస్తారో వారికి లభించే ప్రతిఫలానికి సమానం [ఆమలియె షైఖ్ సదూఖ్,పేజీ నం:93].

3.ఇఫ్తారి మరియు దానధర్మాలు చేయటం: ఇమాం సాదిఖ్[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: ఎవరైతే రమజాన్ మాసంలో దానధర్మాలు చేస్తారో అల్లాహ్ వారి నుండి 70 రకాల విపత్తులను దూరం చేస్తాడు [బిహారుల్ అన్వార్,96వ భాగము,పేజీ నం;179]. 

4.ఏతెకాఫ్: దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఏతెకాఫ్ ప్రాముఖ్యతను వివరిస్తూ ఈ విధంగా సెలవిచ్చారు: పవిత్ర రమజాన్ యొక్క పది రోజుల ఏతెకాఫ్ రెండు హజ్జ్  మరియు రెండు ఉమ్రాల యొక్క ప్రతిఫలానికి సమానం [వసాయెలుష్ షీయ,7వ భాగము,పేజీ నం:218]. 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
14 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 39