ఓర్పు యొక్క మాసము

ఆది, 04/19/2020 - 11:50

పవిత్ర రమజాన్ మాసాన్ని ఓర్పు మరియు సహనం యొక్క మాసమనటానికి కారణం మాసూముల హదీసులలో.

రమజాన్,ఓర్పు,దైవప్రవక్త.

పవిత్ర మాసూములు రమజాన్ మాసాన్ని ఓర్పు యొక్క మాసమని కూడా పిలివటం జరిగింది.ఒక హదీసులో దైవప్రవక్త[స.అ.వ] ల వారు "రమజాన్ మాసం ఓర్పు యొక్క మాసము,మరియు సహనానికి ప్రతిఫలం స్వర్గము" అని సెలవిచ్చారు. మరొక హదీసులో ఇమాం అలి[అ.స] ల వారు ఈ విధంగా ఉల్లేఖించారు: ఓర్పు యొక్క మాసము[రమజాన్ మాసము] మరియు ప్రతీ నెల యొక్క మూడు ఉపవాసాలు హృదయం యొక్క తుప్పు,దుఖ్ఖం మరియు దురాలోచనలను తొలగిస్తాయి.దైవప్రవక్త[స.అ.వ] ల వారి వ్యాఖ్యానం ప్రకారం అల్లాహ్ హదీసె ఖుద్సీలో ఈ విధంగా సెలవిస్తున్నాడు: మానవుని అన్ని కార్యాలు యొక్క ప్రతిఫలం పది నుండి ఏడువందల రెట్లు వరకు ఉంటుంది ఒక్క ఓర్పు యొక్క ప్రతిఫలం తప్ప.దాని ప్రతిఫలం నా వద్ద ఉంది.తిరిగి దైవప్రవక్త[స.అ.వ] ల వారు "ఆ ఓర్పు యొక్క ప్రతిఫలమేంటో కేవలం ఆ భగవంతునికి తెలుసు" అన్నారు.చివరగా "ఆ ఓర్పు అంటే ఉపవాసమని అర్ధం" అని సెలవిచ్చారు.

  రెఫరెన్స్: వసయెలుష్ షీయా,7వ భాగం,పేజీ నం:222,బిహారుల్ అన్వార్,96వ భాగం,పేజీ నం:254,341.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20