ఇఫ్తార్ చేయించటానికి గల ప్రాముఖ్యత

ఆది, 05/10/2020 - 15:19

ఇఫ్తార్ చేయించటానికి గల ప్రాముఖ్యతను మరియు దాని ప్రతిఫలాన్ని వివరించే ఇమాం బాఖిర్[అ.స] ల వారి హదీసు.

ఇఫ్తార్,ఇమాం బాఖిర్,ప్రాముఖ్యత.

ఇమాం బాఖిర్[అ.స్] ల వారు తన అనుచరుడైన సుదైర్ ను సంభోదిస్తూ ఈ విధంగా సెలవిచ్చారు: ఓ సుదైర్! నీకు ఈ రాత్రులు ఎలాంటి రాత్రులో తెలుసా? అని ప్రశ్నించారు.దానికి సుదైర్: నేను మీపై ఫిదా అవ్వుగాక,అవును నాకు తెలుసు,ఈ రాత్రులు రమజాన్ యొక్క రాత్రులు,కానీ ఈ రాత్రులు ఎలాంటి రాత్రులు?అని ప్రశ్నించాడు.దానికి ఇమాం బాఖిర్[అ.స్] ల వారు: నీకు ఈ మాసంలో ప్రతీ రాత్రి ఇస్మాయీల్[అ.స] ల వారి సంతతికి చెందిన పది మంది బానిసలకు విముక్తిని ప్రసాదించే స్థొమత ఉన్నదా? అని ప్రశ్నించారు.దానికి సుదైర్ ''నా సంపద దానికి సరిపోదూ' అన్నాడు.ఇమాం ల వారు ఆ సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ ఒక్క బానిసను అయినా విముక్తి ప్రసాదించగలవా? అన్నారు.దానికి మరల సుదైర్ నాకు ఆ స్థోమత కూడా లేదు అన్నాడు.ఇమాం బాఖిర్[అ.స్] ల వారు: నీకు ప్రతీ రోజు ఒక ఉపవాసపరునికి ఇఫ్తార్ ఇచ్చే స్థోమత ఉన్నదా?అని ప్రశ్నించారు.దానికి సుదైర్: అవును పది మంది వరకైనా నేను వారికి ఇఫ్తారు ఇవ్వగలను అన్నాడు.అప్పుడు ఇమాం[అ.స్] ల వారు: ఓ సుదైర్! నువ్వు అనుకున్నట్లే పది మంది ఉపవాసపరులకు ఇఫ్తార్ ఇవ్వటం ద్వారా నీవు హజ్రత్ ఇస్మాయీల్[అ.స] ల వారి సంతతికి చెందిన పది మంది బానిసలను విముక్తి కలిగించే ప్రతిఫలాన్ని పొందుతావు.

రెఫరెన్స్: మన్లా యహ్జరుహుల్ ఫఖీహ్,2వ భాగం,పేజీ నం: 132.            

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19