అనాధుల పట్ల బాధ్యత

గురు, 05/14/2020 - 18:49

ఇమామ్ అలీ[అ.స] దృష్టిలో అనాధుల పట్ల బాధ్యతను వివరిస్తున్న సంఘటన...

అనాధుల పట్ల బాధ్యత

ఇమామ్ అలీ[అ.స] యొక్క బిరుదులలో ఒకటి “అబుల్ యతామా” అనగా అనాథుల నిర్వాహకుడు. వారు తనను అనాధుల సంరక్షకుడు అని చెప్పకోవటంలో గర్వపడేవారు, ఇమామ్ అలీ[అ.స] ఖిలాఫత్ కాలంలో, ఒక ఇరాన్ దేశానికి చెందిన “హమెదాన్ వ హలవాన్” పట్టనవాసి తేనే మరియు అత్తిపండ్లు తీసుకొని అమీరుల్ మొమినీన్[అ.స] కోసం కూఫా పట్టణానికి వచ్చాడు. వారు ముందుగా అనాధ పిల్లలను హాజరు పరచమని ఆదేశించారు, ఇమామ్ తేను పాత్రను ఆ అనాధులకు ఇచ్చారు, అందులో నుండి తినమని ఆదేశించారు, ఆ అనాధ పిల్లలు తిన్న తరువాత వారు ఆ తేనెను ఒక పళ్లెంలో వేసి ప్రజలలో పంచబెట్టారు, ఇమామ్ అనాధులకు నేరుగా ఆ తేనె పాత్ర నుండి తినడానికి ఎందుక అనుమతి ఇచ్చారు అని ప్రజల వారు చేసిన ఈ పని పై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇమామ్ వారికి ఇలా సమాధానమిచ్చారు: “ఇమామ్ అనాధుల తండ్రిలాంటివాడు, ఒక తండ్రి స్థానంలో ఉన్నప్పుడు తన పిల్లలను ఇలానే తినిపిస్తాడు, వారికి అనాధులు అనే భావం కలగకూడదని”[బిహారుల్ అన్వార్, భాగం41,పేజీ123]

రిఫరెన్స్
మజ్లిసీ, బిహారుల్ అన్వార్, నాషిర్ మొఅస్ససతుల్ వఫా, బీరూత్, లెబ్నాన్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8