ఈదుల్ ఫిత్ర్ పాపాలు క్షమించబడే రోజు

ఆది, 05/17/2020 - 18:34

ఈ నెల ముగిసిన తరువాత మన కార్యాల యొక్క చిట్టాలో మంచి పనులకు తప్ప,చెడు పనులకు చోటివ్వకపోతే మంచిది.ఒక నెల కష్టపడి తమ హృదయాలను పవిత్రం చేసుకున్న వారు తమ హృదయం యొక్క ఈ భూమిలో చెడు విత్తనాన్ని నాటకుండా దానిలో కేవలం మంచి విత్తనాన్ని నాటితేనే దానికి ఫలితం ఉంటుంది

ఈదుల్ ఫిత్ర్,ఇమాం అలి,ప్రతిఫలం.

ఒక నెల ఉపవాసముండి ఆ దేవుని ప్రార్ధనల కొరకు తమ సమయన్ని కేటాయించిన దాసులు తమ కృషికి ప్రతిఫలాన్ని అందుకునే రోజే ఈదుల్ ఫిత్ర్.వారి పాపాలు క్షమించ బడి ఆ దేవుని సామిప్యాన్ని పొందటమే వారి ఈ కృషికి ప్రతిఫలమని  చెప్పవచ్చు.కాబట్టి ఈ నెల ముగిసిన తరువాత మన కార్యాల యొక్క చిట్టాలో మంచి పనులకు తప్ప,చెడు పనులకు చోటివ్వకపోతే మంచిది.ఒక నెల కష్టపడి తమ హృదయాలను పవిత్రం చేసుకున్న వారు తమ హృదయం యొక్క ఈ భూమిలో చెడు విత్తనాన్ని నాటకుండా దానిలో కేవలం మంచి విత్తనాన్ని నాటితేనే దానికి ఫలితం ఉంటుంది.ఇమాం అలి[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: ఉపవాసపరులకు లభించే కనీస ఉపకారమేమిటంటే,రమజాన్ మాసపు చివరి రోజున ఒక దైవదూత “ ఓ దేవుని యొక్క దాసులారా! మీ గత పాపాలను ఆ దేవుడు క్షమించెను,తదుపరి మీరు ఏమి చేయబోతున్నారో దాని పట్ల జాగ్రత్త వహించండి” అని అంటాడు.కాబట్టి కేవలం పాపాలు క్షమించబడితే సరిపోదు,మనము కూడా ఆ తరువాత పాపాలకు దూరంగా ఉంటున్నామా లేదా? ఆ దేవుని పట్ల ఏమన్నా అవిధేయత చూపుతున్నామా? అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే మంచిది.

రెఫరెన్స్: ఆమాలియె షైఖ్ సదూఖ్,పేజీ నం: 10.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16