ఈదుల్ ఫిత్ర్ రోజు యొక్క ఆమాల్

బుధ, 06/13/2018 - 09:29

రమజాన్ పవిత్ర మాసం యొక్క ఉపవాసాలు పూర్తయిన తరువాత షవ్వాల్ నెల మొదటి తారీఖు జరుపుకునే పండగను ఈదుల్ ఫిత్ర్ అంటారు. ఆ రోజు అమలుపరచవసిన చర్యల వివరణ.

ఈదుల్ ఫిత్ర్ రోజు యొక్క ఆమాల్

1. పజ్ర్ నమాజ్ మరియు ఈద్ నమాజ్ సమయంలో ఈ “తక్బీరాత్” “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హంద్, అల్ హందు లిల్లాహ్ అలా మా హదానా, వ లహుష్షుక్రు అలా మా ఔలానా” ను చదవడం.
2. ఈద్ యొక్క నమాజ్ కన్నా ముందే ..జకాతె ఫిత్రా..ను చెల్లించడం.
3. గుస్లె ఈదుల్ ఫిత్ర్ చేస్తున్నాను అల్లాహ్ సామిప్యం కొరకు” అని చెప్పి లేదా మనసులో అనుకుని గుస్ల్ స్నానాన్ని చేయాలి.
4. ఈద్ నమాజ్ కన్నా ముందు ఏదైనా తినడం.
5. నమాజే ఈదుల్ ఫిత్ర్ చదువున్నాను అల్లాహ్ సామిప్యం కొరకు” అని చెప్పి లేదా మనసులో అనుకొని రెండు రక్అత్ల నమాజ్ ను చదవాలి. మొదటి రక్అత్ లో అల్ హంద్ సూరహ్ తరువాత “సబ్బిహిస్మ రబ్బికల్ అ’లా”(సూరహ్:87) ను, రెండవ రక్అత్ లో అల్ హంద్ సూరహ్ తరువాత “వష్షంస్ సూరహ్”(సూరహ్:91)ను చదివడం మంచిది. అయితే ఈ నమాజ్ యొక్క మొదటి రక్అత్ లో 5 ఖునూత్లు మరియు  రెండవ రక్అత్ లో 4 ఖునూత్లు ఉన్నాయి ఆ ఖునూత్ లో చదివేందుకు ప్రత్యేకమైన దుఆ లేదు కానీ ఈ దుఆ చదివితే చాలా మంచిది; https://www.te.welayatnet.com/node/486
6. దుఆయే నుద్బా” చదవడం.
7. ఇమామె హుసైన్[అ.స] జియారత్ ను పఠించడం. ఎందుకంటే వారి ప్రాణత్యాగం వలనే ఇస్లాం ఇప్పటికీ మిగిలి ఉంది.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by zaheer on

wa alaikum assalam. Shukriya. Aap ko bhi bahot bahot mubarak ho

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17