జాతి వివక్షత ఎప్పటివరకు?

ఆది, 05/31/2020 - 17:38

ప్రపంచానికి మానవహక్కుల పాఠాలు చెప్పే అమెరికా స్వయాన తన దేశ పౌరులతో ఈ విధంగా ప్రవర్తించడం,ఇరాన్ మరియు ఇతర ఇస్లామిక్ దేశాలలో మానవ హక్కులు గురించి విమర్శించే అమెరికా ముందు తన దేశపౌరుల పట్ల వివక్షతను మరియు అసమానతల వైఖరిని మార్చుకుంటే మంచిది.

జాతి వివక్షత ఎప్పటివరకు?

ఈ రోజుల్లో అమెరికా మొత్తం నిరసనలతో అట్టుడుకుతుంది.మిన్యాపొలీస్ లో మొదలైన ఈ నిరసనలు అమెరికాలోని అన్ని పెద్ద నగరాలకు పాకాయి.ప్రజలు తమ ఇళ్ళకే పరిమితమవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.అయినా ఈ నిరసనలు తగ్గుముఖం పట్టడం లేదు.ఈ నిరసనలకు కారణం ఆ ప్రభుత్వం నల్లజాతిపరుల పట్ల చూపుతున్న జాతివివక్షతే కారణం.బ్రియన్నా టైలర్ అనే వ్యక్తి ఇంట్లో మత్తుపదార్ధాలున్నాయని అతనిని చంపిన పోలీసులకు అతని ఇంట్లో మాత్రం మత్తు పదార్ధాలు దొరకలేదు.ఈ విధంగా ఏదో ఒక వంకతో నల్లజాతీయులపై అమెరికా ప్రభుత్వం దాడులు చేస్తోదని వారు చెబుతునారు.సోమవారం నాడు జార్జ్ ఫ్లాయిడ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని మెడపై గట్టిగా నొక్కి పట్టుకోవడంతో అతను ఊపిరాడక చనిపోయాడు.అమెరికాలో కొన్ని వందల సంవత్సరాలు బానిసత్వంలో జీవించిన నల్లజాతీయులు ఇప్పటికీ ఈ జాతి విద్వేషాన్ని ఎదుర్కొంటూనే ఉన్నారు.ప్రపంచానికి మానవహక్కుల పాఠాలు చెప్పే అమెరికా స్వయాన తన దేశ పౌరులతో ఈ విధంగా ప్రవర్తించడం,ఇరాన్ మరియు ఇతర ఇస్లామిక్ దేశాలలో మానవ హక్కులు గురించి విమర్శించే అమెరికా ముందు తన దేశపౌరుల పట్ల వివక్షతను మరియు అసమానతల వైఖరిని మార్చుకుంటే మంచిది.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13