ఎవరినైనా పూర్తిగా వర్ణించడానికి, అతని గురించి తెలిసుండడం అవసరం. అందుకనే అల్లాహ్ వర్ణన మానవుడికి సాధ్యం కాదు.
అల్లాహ్ వర్ణన ఎవ్వరికి సాధ్యం కాదు ఒక్క అల్లాహ్
కు తప్ప.
హజ్రత్ ఇమామ్ అలీ[అ.స] ప్రస్తావనం: “అల్లాహ్
ను మంచి మంచి గ్రహణ శక్తులు కూడా అందుకోలేవు, మంచి మంచి మేధాశక్తితో మునిగి కూడా అల్లాహ్ యొక్క యదార్ధాన్ని అన్వేషించలేరు, అల్లాహ్ యొక్క వర్ణన అన్ని విధాలుగా అసాధ్యం, అల్లాహ్ కొరకు సమయాన్ని కూడడం అసాధ్యం, ఆయన యొక్క కాలాన్ని బంధించడం మరియు పరిగణించడం అసాధ్యం”.[నెహ్జుల్ బలాగా, మొదటి ఉపన్యాసం]
ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] “ముషబ్బహ” అనే వర్గానికి ఖండిస్తూ ఇలా ప్రవచించారు: “మేము మా బుద్ధి జ్ఞానములతో ఎంత సూక్ష్మంగా(అల్లాహ్
ను) వర్ణించినా సరే అది మా వలే ఒక సృష్టి అవుతుంది అది మన వైపే తిరిగి వస్తుంది”.[కాఫీ, కితాబుత్తౌహీద్]
రిఫ్రెన్స్
నెహ్జుల్ బలాగా, సయ్యద్ రజీ, మొదటి ఉపన్యాసం.
కాఫీ, మర్హూమ్ కులైనీ, కితాబుతౌహీద్.
వ్యాఖ్యలు
mashallah mashallah
Shukriya. Jazakallah.
వ్యాఖ్యానించండి