షహీద్ సాలిస్

బుధ, 06/24/2020 - 17:50

ప్రముఖ షియా ఉలమాల నుండి ఒకరైన షహీద్ సాలిస్ గురించి సంక్షిప్త వివరణ...

షహీద్ సాలిస్

షహీద్ సాలిస్ పూర్తి పేరు ..సయ్యద్ నూరుల్లాహ్ హుసైనీ మరఅషీ షూష్తరీ. వారు “షహీదె సాలిస్”, “ఖాజీ”, “ఫఖీహ్”, “ముతకల్లిమ్” మరియు “రిజాల్ నైపుణ్యులు” అని ప్రఖ్యాతి చెందారు. వారు భారతదేశంలో ఉండేవారు. వారు “షూష్‌తర్” పట్టణంలో విధ్యావంతుల కుటుంబంలో జన్మించారు. వారి తండ్రి అయిన సయ్యద్ షరీఫ్ “షూష్‌తర్” పట్టణానికి చెందిన ప్రముఖ ముజ్తహిదీన్ లలో ఒకరు. షహీదె సాలిస్ ఇస్లామీయ జ్ఞానాన్ని తన తండ్రి వద్ద మరియు వైధ్యాన్ని మౌలానా ఇమాదుద్దీన్ నుండి నేర్చుకున్నారు. మీర్ సఫీయుద్దీన్ మొహమ్మద్ మరియు మీర్ జలాలుద్దీన్ మొహమ్మద్ సద్ర్ కూడా వారికి విధ్యను నేర్పారు. వారు హిజ్రీ యొక్క 979వ సంవత్సరంలో హజ్రత్ ఇమామ్ రిజా[అ.స] సమాధి దర్శనం మరియు పైచదువుల కోసం తమ జన్మస్థలం అయిన “షూష్‌తర్”ను విడిచారు. వారు మష్ హద్ లో విధ్యాభ్యాసం మరియు ఆధ్యాత్మిక శిక్షణను మొదలు పెట్టారు. మష్ హద్ లో వారి ప్రముఖ ఉపాధ్యాయులలో వీరు “అబ్దుల్ వాహిద్ ఇబ్నె” సుల్తాన్ హైదర్ మీర్జా ఉన్నారు.
మష్ హద్ లో వారు క్రమంగా పీడనకు గురి అవ్వడంతో హిజ్రీ యొక్క 992వ సంవత్సరంలో మష్ హద్ నుండి భారతదేశానికి వెళ్ళిపోయారు. .[అఅయాన్ అల్ షియా, భాగం1, పేజీ177]

రిఫరెన్స్
అమీన్, సయ్యద్ మొహ్సిన్, అఅయాన్ అల్ షియా, దారుత్తఆరుఫ్ లిల్ మత్బూఆత్, 1406ఖ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 23