షీయా ఇస్లాము యొక్క ప్రశిద్ధ పండితులలో ఒకరైన షైఖ్ సదూఖ్ ల వారి గురించి సంక్షిప్తంగా.
పేరు: ముహమ్మద్ బిన్ అలి బిన్ హుసైన్ బిన్ మూసా బిన్ బాబ్వైహ్
జననం: షైఖ్ సదూఖ్ పుట్టిన సంవత్సరం కచ్చితంగా తెలియదు కానీ షైఖ్ తూసి మరియు నజాషి ల ప్రకారం ఇమాం మెహ్ది[అ.తా.ఫ] ల వారి రెండవ రాయబారి అయిన మొహమ్మద్ బిన్ ఉస్మాన్ ఉమ్రి ల వారి తరువాత మరియు మూడవ రాయబారి అయిన హుసైన్ బిన్ రూహ్ ల వారి కార్యాలయం యొక్క ఆరంభంలో అంటే 305 వ హిజ్రిలో జన్మించారు. వారి తండ్రి అలి ఇబ్నుల్ హుసైన్ తన కాలపు మతపెద్ద మరియు ఖుమ్మ్ పట్టణపు ప్రజలు విశ్వసించిన వారు.
జీవితం: షైఖ్ సదూఖ్ ఖుమ్మ్ పట్టణంలోనే పుట్టి పెరగటం జరిగింది.దాదాపు 20 సంవత్సరాలు తన తండ్రి గారితోనే గడిపారు.ఆ తరువాత రెయ్ పట్టణ ప్రజల కోరిక మెరకు రెయ్ వెళ్ళారు. ఖుమ్మ్ కాకుండా మష్హద్,సమర్ఖంద్,ఈలాస్,బలఖ్,హమదాన్,బగ్దాద్,మక్కా మరియు మదీనా మొదలైన పట్టణాల ప్రయాణం చేశారు.
ఉపాధ్యాయులు: అహ్మద్ ఇబ్నె అలి ఇబ్నె ఇబ్రాహీం ఇబ్నె హాషిం ఖుమ్మి,అహ్మద్ ఇబ్నె ముహమ్మద్ ఇబ్నె ఈసా,అలి ఇబ్నె హుసైన్ ఇబ్నె మూసా ఇబ్నె బాబ్వైహ్,ముహమ్మద్ ఇబ్నె హసన్ ఇబ్నె అహ్మద్ ఇబ్నె వలీద్ ఖుమ్మి మొదలైన వారు షైఖ్ సదూఖ్[అ.ర] ల వారి ఉపాధ్యాయులలో ముఖ్యమైన వారు.
షీయా ఇస్లాముకు అందించిన సేవలు: షియా ఇస్లాం యొక్క జీవన మార్గపు అత్యంత ముఖ్యమైన పరికరాలైన హదీసు మరియు ఫిఖ్ వంటి రంగాలలో షైఖ్ సదూఖ్ యొక్క కృషి కొనియాడదగినది.అదే కాకుండా హదీసు సేకరణ లో కూడా షైఖ్ సదూఖ్ చాలా శ్రమించారనే చెప్పవచ్చు.షీయ హదీసు యొక్క నాలుగు ముఖ్యమైన పుస్తకాల సమూహంలో ఒకటైన “మన్లా యహ్జరుహుల్ ఫఖీహ్” షైఖ్ సదూఖ్ ద్వారానే సేకరించబడినది.
మరణం: షైఖ్ సదూఖ్ 381వ హిజ్రిలో మరణించారు.వారిని రయ్ పట్టణంలో ఖననం చేయటం జరిగింది.
రెఫరెన్స్
కమాలుద్దీన్,పేజీ నం:276,అబ్దుర్ రహీం రబ్బాని షిరాజి, మ ఆనిల్ అఖ్బార్ యొక్క పరిచయంలో,పేజీ నం:73.
వ్యాఖ్యానించండి