ప్రసిద్ధ షీయా పండితులైన షైఖ్ ముఫీద్ ల వారి గురించి సంక్షిప్తంగా.
షైఖ్ ముఫీద్ గా పిలవబడే "ముహమ్మద్ బిన్ ముహమ్మద్ బిన్ నొమాన్" నాలుగు మరియు ఐదవ శతాబ్దాలలో ప్రశిద్ధి చెందిన ఫఖీహ్ మరియు వేదాంతవేత్త.వారు 336 లేదా 338వ హిజ్రి లో బగ్దాద్ కు సమీపంలో గల ఉక్బరి అనే ప్రదేశంలో జన్మించారు.వారి తండ్రి వృత్తి రీత్యా ఉపాధ్యాయులు కావడం వలన వారిని “ఇబ్నుల్ ము అల్లిం” అని కూడా పిలిచేవారు.మోతజలి పండితుడైన అలి బిన్ ఈసా రుమ్మాని పై ఒక చర్చలో పైచేయి సాధించటం వలన వారికి “ముఫీద్” అనే పేరు వచ్చింది.షైఖ్ ముఫీద్ ల వారు తన తండ్రి గారి వద్దే ఖురాను మరియు ప్రాధమిక విధ్యలను నేర్చుకుని ఆ తరువాత ఉన్నత విద్యల నిమిత్తం బఘ్దాద్ వెళ్ళారు.అచట ప్రఖ్యాతి చెందిన షీయా మరియు సున్ని ఉలమాల వద్ద విద్యను అభ్యసించటం జరిగింది.వారి శిక్షకులలో ముఖ్యమైన వారు షైఖ్ సదూఖ్,ఇబ్నె ఖౌలవియ,అబు ఘాలిబె రాజి,అబు బక్ర్ ముహమ్మద్ బిన్ ఉమర్ మొదలైన వారు.అబ్బాసీ ఖలీఫాల సమక్షంలో జరిగిన ఎన్నో శాస్త్రీయ చర్చలలో పాల్గొని షీయా మతంపై వచ్చే ఎన్నో విమర్శలకు జవాబిచ్చేవారు. షైఖ్ ముఫీద్ ఎంతో మంది విద్యార్ధులకు మతపరమైన శిక్షననిచ్చి వారిని పండితులుగా తీర్చి దిద్దారు.వారిలో ఎంతో మంది షీయా మతపు ప్రసిద్ధ పండితులు కూడా ఉన్నారు.వారి వద్ద విద్యను అభ్యసించిన వారిలో షైఖ్ ముర్తజా,షైఖ్ తూసి,అబుల్ ఫత్ హె కరాజకి,సయ్యదె రజీ,నజాషి,అబూ యాలి ముహమ్మద్ బిన్ హసన్ జాఫరి ల వారు ముఖ్యమైన వారు. ఈ విధంగా ఇస్లాముకు మరియు షీయా మతానికి ఎన్నో సేవలందించిన ఈ ప్రసిధ్ధ పండితుడు హిజ్రి యొక్క 413వ యేట మరణించారు.వారిని కాజిమైన్ లో ఇమాం కాజిం[అ.స] మరియు ఇమాం జవాద్[అ.స] ల వారి సమాధులకు సమీపాన ఖననం చేయటం జరిగింది.
రెఫరెన్స్: రిజాలె నజాషి, పేజీ నం:399, తారీఖె ఫిఖ్ వ ఫుఖహా,గర్జీ, పేజీ నం:143.
వ్యాఖ్యానించండి