ఇఖ్లాస్ ప్రభావాలు

సోమ, 01/25/2021 - 16:32

ఇఖ్లాస్ అనగ సమ్మతమైన ఏ పని చేసినా అల్లాహ్ కొరకు చేయడం. అలా చేసేవాడిని “ముఖ్లిస్” అంటారు.

ఇఖ్లాస్ ప్రభావాలు

ఇఖ్లాస్ అనగ సమ్మతమైన ఏ పని చేసినా అల్లాహ్ కొరకు చేయడం. అలా చేసేవాడిని “ముఖ్లిస్” అంటారు.
1. అల్లాహ్ ముఖ్లిస్ వ్యక్తితో ఉంటాడు: రివాయత్: ఎవరైతే తన పనులను(పూర్తిగా) అల్లాహ్ కోసమే చేస్తాడో, అల్లాహ్ కూడా అతడి కొరకు అవుతాడు.[1]
2. అల్లాహ్ మార్గదర్శకం: అల్లాహ్ ఉపదేశం: ఎవరయితే మా మార్గంలో (మా కోసం) ప్రయత్నిస్తారో, నిస్సందేహంగా మేము వారికి మా మార్గాలు చూపుతాము.[2]
3. హృదయాల పై అధికారం: ఇమామ్ అలీ[అ.స] ఉల్లేఖనం: నిస్సందేహముగా ప్రతీదీ విశ్వాసి పట్ల వినయవిధేయతలు కలిగి వుంటాయి, విశ్వాసి యొక్క స్థాయి ముందు ఇమిడి ఉంటాయి. ఆ తరువాత ఇలా అన్నారు: విశ్వాసి అల్లాహ్ పట్ల ఇఖ్లాస్(స్వచ్ఛత) కలిగి ఉంటే ప్రతీది అతడిని చూసి భయపడేటట్లు చేస్తాడు, చివరికి భూమిపై ఉన్న సింహాలు మరియు క్రూరజంతువులు ఆకాశంలో ఉన్న పక్షులు కూడ(భయపడేటట్లు చేస్తాడు).[3]
4. జ్ఞానవిజ్ఞానాలు: దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: నలభై రోజుల వరకు కేవలం అల్లాహ్ కోసం పని చేస్తే, అల్లాహ్ అతడి నోటి నుండి సద్భోధనలు పొంగేలా చేస్తాడు.[4]
5. అల్లాహ్ సంరక్షణ: దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: అల్లాహ్ ఇలా ఉపదేశించెను: విశ్వాసి హృదయం గురించి తెలుసుకోను అందులో నా పట్ల ప్రేమ, విధేయత, స్వచ్ఛత మరియు అంగీకరణ లేనంత వరకు, ఆ తరువాత అతడి స్థిరత్వం, వ్యవహారాలు నేను నా బాధ్యతగా తీసుకుంటాను.[5]     

రిఫరెన్స్
1. బిహారుల్ అన్వార్, భాగం82, పేజీ197; వాఫీ, భాగం5, పేజీ784.
2. అన్కబూత్, ఆయత్69.
3. బీహారుల్ అన్వార్, భాగం17, పేజీ248, హదీస్21; మంతఖబ్ మీజానుల్ హిక్మ, పేజీ165, హదీస్1896.
4. ఉయూనొ అఖ్బార్ అల్ రిజా, పేజీ2, పేజీ69, హదీస్321.
5. బిహారుల్ అన్వార్, భాగం85, పేజీ136, హదీస్16; మంతఖబ్ మీజానుల్ హిక్మ, పేజీ165.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12