సృష్టికర్త గురించి తెలుసుకోవడం అవసరమా కాదా!

మనం ప్రపంచంలో ఉన్న అన్నింటిని ఉపయోగించుకొని లాభం పొందుతూ ఉంటాము. శరీరంలోని ప్రతీ భాగం చాలా ముఖ్యమైనది. ఇవే కాకుండా సూర్యుడు, చంద్రుడు, చెట్లు, గాలీ, నీరు మరియు నేల ఒడిలో ఉన్న అనుగ్రహాలు, ఈనాటి మనిషి వీటన్నీంటి నుండి లాభం పొందుతున్నాడు.
అంతకు మించిన విషయమేమిటంటే స్వయంగా మనిషి తన బుద్ధి మరియు శక్తిసామర్థ్యముల ద్వార కొండలను చిన్న చిన్న ముక్కలుగా మార్చేస్తున్నాడు. నీళ్ళతో పెద్ద పెద్ద వాటిని నడిపిస్తున్నాడు. ఇనుము లాంటి దృఢమైన దానిని సున్నితమైన పనులకు ఉపయోగిస్తున్నాడు.
మరలాంటప్పుడు, ఈ అనుగ్రహాలు ప్రసాదించే వాడు ఏవడు?! ఆయనకు కృతజ్ఞత తెలుపుకోవడానికి ఆయన ఎవరో తెలుసుకోవడం అవసరమా కాదా!. ఆలోచించండి!.
ఒకవేళ ఒక మంచి మనిషి, తల్లిదండ్రులను ఏదో సంఘటనలో కోల్పోయిన ఒక పసిబిడ్డ బాధ్యతను స్వీకరించి ఆ పిల్లవాడి కోసం మంచి వసతులు కలిపించి, మంచి స్కూలులో చదువు చెప్పించీ చివరికి తన ఆస్తిలోని కొంత భాగాన్ని అతడి మిగిలిన జీవితం సుఖంగా గడపాలని ఇచ్చాడు; మానవత్వం ఉన్న ప్రతీ మనిషి “అతడు తన పై దయ చేసిన వాడి గురించి తెలుసుకొని, అతడికి కృతజ్ఞత తెలుపుకోవడం అవసరం” అని అంటాడు. ఇంత చిన్న దయా కరుణకే అవసరమైనప్పుడు మనం మన చుట్టూ ఉన్న అనుగ్రహాలను చూసి వాటిని ప్రసాదించే వాడి గిరించి తెలుసుకోవడం అవసరం కాదంటారా!. ఆలోచించండి!.
వ్యాఖ్యానించండి