సన్మార్గం-అపమార్గం

శుక్ర, 03/05/2021 - 07:51

ఒకవేళ మీరు మంచి చేస్తే ఆ మంచి మీ స్వయం కోసమే. ఒకవేళ మీరు చెడుకు ఒడిగడితే అది మీ పాలిటే హానికరంగా పరిణమిస్తుంది.

మనిషి చర్య ఫలితాలు

ప్రశ్న: సూరయె బఖరహ్ యొక్క 26వ ఆయత్ ప్రకారం అల్లాహ్ తాను కోరినవారికి అపమార్గం పట్టిస్తాడు మరియు తాను కోరిన వారిని సన్మార్గం పైకి తీసుకువస్తాడు అన్న విషయం నిజమేనా?
“నిశ్చయంగా అల్లాహ్ దేనినీ ఉపమానంగా చెప్పటానికి సిగ్గు పడడు-(కడకు) దోమ అయినాసరే, దానికన్నా అల్పమైన వస్తువు అయినాసరే! విశ్వసించినవారు మాత్రం దీన్ని తమ ప్రభువు తరపు నుంచి వచ్చిన సత్యమని భావిస్తారు. కాని అవిశ్వాసులు, “ఈ ఉపమానం ద్వారా ఇంతకీ అల్లాహ్ ఏం చెప్పదలచుకుంటున్నాడు?” అని అంటారు. ఈ విధంగా ఆయన దీని ద్వారానే ఎంతో మందిని అపమార్గం పట్టిస్తాడు, మరెంతో మందిని సన్మార్గం పైకి తీసుకువస్తాడు. అయితే దీని ద్వారా ఆయన అపమార్గానికి లోను చేసేది అవిధేయులను మాత్రమే.[సూరయె బఖరహ్, ఆయత్:26]

సమాధానం: సన్మార్గం మరియు అపమార్గం మనిషి చేతుల్లో ఉంది. అంటే మనిషి తన మంచి పనుల ద్వార సన్మార్గానికి చేరుతాడు మరియు అలాగే తన చెడు పనుల ద్వారా అల్లాహ్ ఆగ్రహానికి గురి అయి మార్గభ్రష్టత వైపుకు నడవ సాగుతాడు. ఈ ఆయత్ వివరణలో ఆయతుల్లాహ్ మకారిమ్ షీరాజీ ఇలా వ్యాఖ్యించారు: ఈ ఆయత్ పైకి చూడడానికి ఒక మనిషి సన్మార్గం మరియు అపమార్గాలు అల్లాహ్ చేతుల్లో ఉన్నాయి, ఆయన కోరిక మెరకు మాత్రమే మనిషి అపమార్గానికి గురి అవుతాడు లేదా సన్మార్గం పొందుతాడు; లాంటి అనుమానానికి గురిచేసేటువంటి ఆయత్, నిజానికి ఈ ఆయత్ యొక్క చివరి వాక్యం ఈ సన్మార్గం మరియు అపమార్గాలు మనిషి చర్యలను బట్టి ఉంటాయి అని చెప్పి యదార్ధాన్ని వ్యక్తం చేస్తుంది. “....అయితే దీని ద్వారా ఆయన అపమార్గానికి లోను చేసేది అవిధేయులను మాత్రమే”[సూరయె బఖరహ్, ఆయత్:26]
వివరణ: నిత్యం మనిషి యొక్క పనులు మరియు అతడి నడవడి, ప్రత్యేక ఫలితాలు కలిగి ఉంటుంది. ఒకవేళ మంచి పనులు చేస్తే దాని ఫలితం, అంతర్దృష్టి, భాగ్యం, సన్మార్గం మరియు మరిన్ని మంచి పనులు చేయడం వంటివి ప్రసాదించబడతాయి.
ఈ మాటకు సాక్ష్యం సూరయె అన్ఫాల్ యొక్క 29వ ఆయత్: “ఓ విశ్వాసులారా! మీరు గనక అల్లాహ్ యెడల భయభక్తులతో మెలిగినట్లయితే ఆయన మీకు నిర్ణయాత్మకమైన ఒక వస్తువును (ఫుర్ఖాన్ ను) ప్రసాదిస్తాడు. మీ పాపాలను మీ నుండి దూరం చేస్తాడు. మిమ్మల్ని క్షమిస్తాడు. ఆయన గొప్ప అనుగ్రహం కలవాడు.[సూరయె అన్పాల్, ఆయత్:26]

అదే ఒకవేళ మనిషి చెడు పనుల వైపు వెళ్తే అతడి హృదయం చీకటితో కమ్ముకుంటుంది, మరియు పాపాల వైపుకు నెట్టుతుంది, ఒక్కోసారి అల్లాహ్ ను నిరాకరించడానికి దారి తీస్తుంది. ఈ మాటకు ఆయత్ నిదర్శనం: “మరి ఎట్టకేలకు-దుర్మార్గాలకు ఒడిగట్టిన వారికి దుర్గతే పట్టింది. ఎందుకంటే వారు అల్లాహ్ ఆయతులను ధిక్కరించేవారు. వాటిని పరిహసించేవారు”[సూరయె రూమ్, ఆయత్:10]
మరో ఆయత్ లో ఇలా ఉంది: “వారు వక్రంగానే ఉండటంతో, అల్లాహ్ వారి హృదయాలు వంకరగానే ఉండేలా చేశాడు. అవిధేయ జనులను అల్లాహ్ సన్మార్గం చూపడు”[సూరయె సఫ్, ఆయత్:5]
ఈ విధంగా చూసుకున్నట్లైతే ముందునుంచే మంచి మరియు చెడు మార్గాలను ఎన్నుకోవడం మనిషి చేతుల్లో ఉంది. ఇలా అని మనిషి అంతరాత్మ అంగీకరిస్తుంది, ఆ తరువాత వాటి ఫలితాల గురించి వేచివుండాలి.

సంక్షిప్తంగా చెప్పాలంటే: ఖుర్ఆన్ దృష్టిలో సన్మార్గం మరియు అపమార్గాల ఎన్నిక బలవంతం పై ఆధారపడిలేవు. అవి మన చర్యలక బట్టి ఉంటుంది.

ఒక ఉదాహారణ: మనిషి ఒక ప్రమాదకరమైన నది ప్రక్క నుండి వెళ్తున్నప్పుడు, దానికి ఎంత దగ్గర వెళ్తే కాలు జారి అందులో పడిపోయే ప్రమాదం ఉంటుంది, దానికి ఎంత దూరంగా ఉంటే అంతే ప్రమాదానికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. అతడి ప్రతీ అడుగు దృఢంగా మరియు శాంతితో కూడి ఉంటుంది; ఇది సన్మార్గం అయితే అది అపమార్గానికి ఉపమానం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19