ఇమామ్ కాజిమ్(అ.స) మరియు అబూహనీఫహ్ మధ్య సంభాషణ

మంగళ, 03/09/2021 - 19:29

ఇమామ్ కాజిమ్(అ.స) మరియు అబూహనీఫహ్ మధ్య జరిగిన సంభాషణం... 

ఇమామ్ కాజిమ్(అ.స) మరియు అబూహనీఫహ్ మధ్య సంభాషణ

ఇమామ్ మూసా కాజిమ్(అ.స) షియా ముస్లిముల 7వ ఇమామ్. వారు సఫర్ మాసం 7వ తేదీ హిజ్రీ యొక్క 128వ సంవత్సరంలో “అబ్వా”లో జన్మించారు. వారి తండ్రి ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) మరియు వారి తల్లి పేరు “హమీదహ్ ముసఫ్ఫహ్”. వారు రజబ్ మాసం, హిజ్రీ యొక్క 183వ సంవత్సరంలో 55 వయసులో హారున్ అల్ రషీద్ ఆదేశానుసారం విషం ద్వార చంపబడ్డారు. వారిని బగ్దాద్(ఇరాఖ్) లో ఉన్న “కాజిమైన్” పట్టణంలో సమాధి చేయబడ్డారు. జ్ఞానపరంగా మరియు అధ్యాత్మిక పరంగా వారి స్థానం తెలియనివారు లేరు.   
ఇరువర్గాలవారు(షియా మరియు సున్నీయులు) వారి గురించి రచించారు. వారు తమ జీవితంలో చాలా మందితో వివిధ సందర్భాలలో చర్చించారు మరియు చాలా మంది ప్రశ్నలకు సమాదానాలు ఇచ్చారు. వాటి నుంచి ఇక్కడ ఒక మంచి సంభాషణ మీకోసం:

అబూ హనీఫహ్ ఇలా అనెను: నేను ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) కాలంలో హజ్ కు వెళ్లాను. మదీనహ్ కు చేరగానే వారి(ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స)) ఇంటికి వెళ్లి వారి అనుమతికోసం ఇంటి వాకిట్లో కూర్చోని వేచివున్నాను, ఇంతలో ఒక పిల్లాడు బయటకు వచ్చాడు, అతడితో బాబూ!, మీ పట్టణానికి వచ్చే బాటసారులు తమ అవసరాల తీర్చుకోవడానికి(మలవిసర్జనలకు) ఎక్కడికి వెళ్లాలి? ఆ పిల్లవాడు కూర్చొని గొడకు ఆనుకోని ఇలా సమాధానమిచ్చాడు: “నదులకు, పండ్ల చెట్లకు, మస్జిద్ యొక్క నీడకు, రహదారులకు దూరంగా మరియు అలాగే చూపులకు దూరంగా” ఆ పిల్లాడు చెప్పిన మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. నీ పేరేమిటి అని ప్రశ్నించాను. ఆ పిల్లాడు “ముసా ఇబ్నె జాఫర్ ఇబ్నె ముహమ్మద్ ఇబ్నె అలీ ఇబ్నె హుసైన్ ఇబ్నె అలీ ఇబ్నె అబీతాలిబ్” అని సమాధానమిచ్చాడు.
నేను ఆ పిల్లాడితో “బాబూ! పాపం ఎవరి నుంచి” అని ప్రశ్నించాను. 

దానికి ఆ పిల్లాడు ఇలా సమాధానమిచ్చాడు: “ఇది మూడు రకాలు:
1. పాపం అల్లాహ్ తరపు నుంచి అయి ఉంటే అల్లాహ్ ఆ దాసుడిని శిక్షించడం సమంజసం కాదు.
2. అల్లాహ్ మరియు దాసుడు ఇద్దరి తరపు నుంచి అయి ఉంటే బలహీనమైన భాగస్వామిని శిక్షించడం కూడా అల్లాహ్ గొప్ప తనానికి సమంజసం కాదు.
3. పాపం దాసుడి తరపు నుండి అయి ఉండాలి, ఇలా అయి ఉంటే అల్లాహ్ అతడిని దయాతో క్షమించవచ్చు లేదా అతడు చేసిన పాపానికి శిక్షించవచ్చు”
అబూ హనీఫహ్ ఇలా అనెను: నేను ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స)తో కలవకుండానే తిరిగి వెళ్లిపోయాను, విన్నదానితో సంతృప్తిపొందాను.[1]

ఫలితం: యదార్థం మరియు అహ్లె బైత్(అ.స) కాంతి ఆరిపోలేనిది. అబ్బాసీ ఖలీఫాలు దుర్మార్గం మరియు అన్యాయంతో బనీ హాషిమ్ లను నాశనం చేయాలనుకున్నారు. వారి జ్ఞానంతో ప్రజలను దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తూ ఉండేవారు. వారి పన్నాగాలలో ఒకటి ఇమాములను ఏదో ఒక వంకతో కారాగారంలో బంధించడం. నిజానికి వారు బనీ హాషిమ్ లను అంతంం చేయాలనుకున్నారు కాని వారి విస్తరణ మరియు ప్రఖ్యాతి పెరిగింది, ఇప్పుడు ప్రపంచమంతా వారి ప్రఖ్యాతి ఉంది కాని బనీ అబ్బాసీల నామరూపాలు లేకుండా పోయాయి.

రిఫరెన్స్
1. తొహ్ఫుల్ ఉఖూల్, ఇబ్నె షఅబె హర్రానీ, భాగం1, పేజీ411.
«وقال أبو حنيفة  حججت في أيام أبي عبد الله الصادق عليه السلام فلما أتيت المدينة دخلت داره فجلست في الدهليز أنتظر إذنه إذ خرج صبي يدرج ، فقلت: يا غلام أين يضع الغريب الغائط من بلدكم ؟ قال: على رسلك . ثم جلس مستندا إلى الحائط. ثم قال: توق شطوط الانهار ومساقط الثمار وأفنية المساجد وقارعة الطريق وتوار خلف جدار وشل ثوبك . ولا تستقبل القبلة ولا تستدبرها. وضع حيث شئت. فأعجبني ما سمعت من الصبي، فقلت له: ما اسمك ؟ فقال: أنا موسى بن جعفر بن محمد بن علي بن الحسين بن علي بن أبي طالب. فقلت له: يا غلام ممن المعصية ؟ فقال عليه السلام: إن السيئات لا تخلو من إحدى ثلاث: إما أن تكون من الله وليست منه فلا ينبغي للرب أن يعذب العبد على ما لا يرتكب. وإما أن تكون منه ومن العبد وليست كذلك، فلا ينبغي للشريك القوي أن يظلم الشريك الضعيف. وإما أن تكون من العبد وهي منه، فإن عفا [ ف‌ ] بكرمه وجوده، وإن عاقب فبذنب العبد وجريرته. قال أبو حنيفة: فانصرفت ولم ألق أبا عبد الله عليه السلام واستغنيت بما سمعت

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
16 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17