మీ భార్యలు మీకు దుస్తులు - మీరు వారికి దుస్తులు

ఆది, 03/14/2021 - 08:43

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: “మీ భార్యలు మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు”[సూరయె బఖరహ్, ఆయత్187]

మీ భార్యలు మీకు దుస్తులు - మీరు వారికి దుస్తులు

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: “మీ భార్యలు మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు”[సూరయె బఖరహ్, ఆయత్187]

ఈ ఆయత్ కు సంబంధించిన కొన్ని అంశాలు:
1. భార్యభర్తలు ఒకరి ఒకరు దుస్తుల మాదిరి:
దుస్తులు మనిషి యొక్క మూడవ అవసరం. మనిషి మొదటి అవసరం ఆక్సీజన్, అది రెండు మూడు నిమిషాలు లేకపోతే మనిషి మరణిస్తాడు. మనిషి యొక్క రెండవ అవసరం ఆహారం, రెండుమూడు రోజులు ఇది లేకపోతే మనిషి మరణిస్తాడు. మనిషి యొక్క మూడవ అవసరం జీవిత భాగస్వామి(భార్యకు భర్త మరియు భర్తకు భార్య). ఆక్సీజన్ మరియు ఆహారం తరువాత మనిషికి అతి అవసరమైనది జీవిత భాగస్వామి., అందుకే అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: “మీ భార్యలు మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు”[సూరయె బఖరహ్, ఆయత్187]
దుస్తులను హాని కలిపించడం ఆ మనిషిని హాని కలిపించడంతో సమానం. ఒకవేళ ఎవరైనా ఒకరి కాలరు పట్టుకుంటే లేదా దానిని చించేస్తే అది అతడిని అవమానించినట్లే. అలాగే భార్యను అవమానించడం భర్తను అవమానించడంతో సమానం అలాగే భర్తను అవమానించడం భార్యను అవమానించినట్లే.

2. లోపములను దాచిపెట్టడం మరియు వాటిని సరి చేసుకోవడం:
దుస్తుల పని దాచిపెట్టడం. భార్యభర్తలు ఒకరినొకరి లోపాలను దాచిపెట్టాలి. ఒకవేళ భార్య భర్తలో లేదా భర్త భార్యలో ఏదైనా లోపాన్ని చూస్తే వెంటనే వెళ్లి తమ బంధువులకు లేదా పొరుగువారికి చెప్పకూడదు.
దుస్తుల రంగూ మరియు దాని కుట్టు(మోడల్)ను బట్టి దాన్ని వేసుకున్నవాడి అభిరుచి తెలుస్తుంది, అలాగే జీవిత భాగస్వామిని ఎంచుకోవడాన్ని చూసి మనిషి యొక్క ఆలోచనను తెలుసుకోవచ్చు. కేవలం అందమా, ధనమా లేదా పోస్టా?
బట్టల రంగూ, కుట్టూ మరియు క్వాలటీలు మనిషి యొక్క వ్యక్తిత్వానికి చిహ్నం. జీవిత భాగస్వామి ఎన్నిక మనిషి యొక్క వ్యక్తిత్వానికి చిహ్నం.
ఒక్కోసారి ఒక చిన్న మరక ఆ బట్టలను విలువలేనిదిగా మారుస్తుంది. ఉదాహారణకు తెల్లటి షర్టు పై బొగ్గుతో ఒక భాగం పై మరక వేస్తే ఆ షర్టు యొక్క విలువను తరిగేస్తుంది. జీవిత భాగస్వామి కూడా అంతే. ఒక్కోసారి కుటుంబంలో ఒక చిన్న పని పూర్త కుటుంబం యొక్క గుర్తింపును, గౌరవాన్ని మట్టిపాలు చేస్తుంది.
నిత్యం ఖరీదైన దుస్తులే మంచివి కావు. మేము మాంసంలో బలం ఉంది అని భావిస్తాము నిజానికి రెండు కిష్మిష్ పండ్లలో ఉన్న లేదా ఒక ఖర్జూరపు పండులో ఉన్న ఎనర్జీ అర కిలో మాంసం కన్న ఎక్కువ అయి ఉండవచ్చు. అలాగే దుస్తులు కూడా. ఒక్కోసారి అమ్మాయి తండ్రి ధనవంతుడని, వ్యాపారవేత్తని, పెద్ద చదువులు చవుకున్నాడని, హైసిటీలో ఇల్లుందని ఎంచుకుంటారు, తీరా చూస్తే అది మీకోసం నష్టం మరియు మీ పరిపూర్ణత్వానికి ఆటంకంగా నిలుస్తుది. ఇదే విధంగా అమ్మాయిలు కూడా. (అలా అని లేనివారు మంచివారు ధనవంతులు చెడ్డవారు అని చెప్పే ఉద్దేశం కాదు మనం దేన్ని చూసి ఎంచుకుంటున్నాము. మన మనసు కల్మషం లేనిదిగా ఉండాలి ఏదీ ఆశించకూడదు.)
ఒక్కోసారి బట్టలు మంచివి కాని అవి చిన్నవి లేదా పెద్దవిగా ఉంటాయి. మనకు అనుకూలంగా ఉండవు. ఇదే విధంగా ఒక అమ్మాయి లేదా అబ్బాయి అన్ని విధాలుగా బాగా ఉంటారు కాని వార్వారి స్వభావాలు అనుకూలంగా ఉండవు లేదా వయసు అనుకూలంగా ఉండదు.

3. దుస్తులు పరిమితాన్ని తీసుకొస్తుంది కాని అవి రోగనిరోధక శక్తి వంటింది
దుస్తులు పరిమితాన్ని తూసుకొస్తుంది. అంటే కోటుప్యాంటు వేసుకొని ఈదడానికి వెళ్ళలేము. అలాగే స్విమ్మింగ్ డ్రస్ వేసుకొని ఆఫిసుకు వెళ్ల లేము. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే లుంగీ కట్టుకుని తల క్రిందులుగా ఆశనం వేయలేము. దుస్తులు కొన్ని కట్టుబాటులు తీసుకొస్తుంది అని బట్టలు వేసుకోవడం మానేస్తామా అలాగే వివాహం కూడా కొన్ని కట్టుబాటులను తీసుకొస్తుంది. బాధ్యతలను పెంచుతుంది, రాకపోకలను కంట్రోల్ పెడుతుంది, నిజమే వివాహ జీవితం కట్టుబాటులు తీసుకొస్తుంది కాని ఈ కట్టుబాటులు ఇంటికి ఒంటికీ మరియు సమాజానికి మంచివి.
బట్టలు కొనుక్కోవడంలో మనిషి స్వేచ్ఛ కలిగి ఉన్నాడు, కొనుక్కోవడం, కొనుక్కోకపోవడం అది అతడి ఇష్టం., కాని ఒకసారి కొనుక్కున్న తరువాత దాన్ని వాడకపోవడం అన్యాయం. అలాగే వివాహం చేసుకునే విషయంలో మనిషి ఇష్టం, అతడు చేసుకోవచ్చూ లేదా చేసుకోకుండా ఉండిపోవచ్చు కాని వివాహం చేసుకున్న తరువాత మాత్రం తన భాగస్వామిని అటూఇటూ కాకుండా విడిచేయడం న్యాయం కాదు. 
ఒకడు ఇలా అన్నాడు: చంపేయి! లేదా గింజలువేయి! లేదా పంజరం నుండి విముక్తి ఇవ్వు.
ఒక జ్ఞాని బట్టలు దరించుకుంటే అతడి జ్ఞాని అవ్వరు. అలాగే ఫలానా వారితో సంబంధం కలుపుకుంటే వారిలా అయిపోతామని భావిస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే నూతి సొంతంగా నీరు కలిగి ఉండాలి. ఎండిన నూతి మరియు బకెటుతో నీరు పోసే నూతి ఎప్పటికీ సొంతనీరుతో నిండితో సమానం కాలేరు. పరిపూర్ణతలు లోపలి నుండి పొంగుకొని రావాలి అంతే గాని ఎవరితోనో సంబంధం కలుపుకొని వారిలా అయిపోదాం అనుకోవడం మూర్ఖత్వం.
ఇంకా ఉంది...        

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13