రమజాన్ మాసం యొక్క 7వ రోజు దుఆ భావర్ధాలు

సోమ, 04/19/2021 - 07:13

ఓ అల్లాహ్! నీవు ఈ రోజు(ఈ నెల)లో ఉపవాసం మరియు ఆరాధనకై రాత్రుళ్ళ జాగరణ విషయంలో సహాయం చేయి...

రమజాన్ మాసం యొక్క 7వ రోజు దుఆ భావర్ధాలు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

రమజాన్ మాసం యొక్క 7వ రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా:

దుఆ: అల్లాహుమ్మా అయిన్నీ ఫీహి అలా సియామిహి వ ఖియామిహ్, వ జన్నిబ్నీ ఫీహి మిన్ హఫవాతిహి వ ఆసామిహ్, వర్జుఖ్ నీ ఫీహి జిక్రక బి దవామిహి బి తౌఫీఖిక యా హాదియల్ ముజిల్ లీన్.[1]
అనువాదం: ఓ అల్లాహ్! నీవు ఈ రోజు(ఈ నెల)లో ఉపవాసం మరియు ఆరాధనకై రాత్రుళ్ళ జాగరణ విషయంలో సహాయం చేయి. నన్ను అందులో పొరపాట్లూ మరియు పాపముల నుండి దూరంగా ఉంచు. నీ దయతో, నీ స్మరణను నిరంతరం నా భాగ్యంగా చేయి ఓ మార్గభష్టుల మార్గదర్శి. 

ఈ దుఆ ద్వార మనం అల్లాహ్ ను వేడుకునే అంశాల వివరణ:
మొదటి అంశం: ఉపవాసం దీక్ష మరియు ఆరాధన చేసే భాగ్యం
రమజాన్ మాసం యొక్క 7వ రోజు దుఆ యొక్క మొదటి వాక్యంలో మేము అల్లాహ్ ను ఉపవాసం మరియు ఆరాధనకై రాత్రుళ్ళ జాగరణ విషయంలో సహాయం చేయి వేడుకుంటున్నాము. దాసుడికి ఆరాధన యొక్క ప్రాముఖ్యత తెలిస్తే, తన జీవితాన్ని అల్లాహ్ మయం చేసుకుంటాడు. చాలా మందికి అందులో ఉన్న మనశాంతి తెలియక ప్రాపంచిక మాయలో పడి అల్లాహ్ దాసోహానికి బదులు మనోవాంఛలకు దాసులుగా మారుతారు. అల్లాహ్ మానవుని సృష్టి యొక్క లక్ష్యాన్ని ఇలా వివరించెను: “నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే”[సూరయె జారియాత్, ఆయత్56] అరాధన అనగా కేవలం బాహ్య నిబంధనలు పాటిస్తే సరిపోదు దాంతో పాటు అంతర్ నిబంధనలను కూడా పాటించాలి అప్పుడే దాని ప్రభావం ఆత్మపై పడుతుంది, మరియు ఆత్మలో అల్లాహ్ సామిప్యం పొందే శక్తి పెరుగుతుంది. నెహ్జుల్ బలాగహ్ లో ఇలా రివాయత్ ఉల్లేఖించబడి ఉంది: “ఉపవాసం ఉండే చాలా మంది కేవలం ఆకలి మరియు దప్పిక తప్ప ఏదీ దక్కదు, రాత్రి జాగరణ చేసి నమాజు చదివే వారికి నిద్రలేకపోవడం మరియు కష్టం తప్ప ఏదీ దక్కదు”[2]
ఉపవాసం యొక్క అత్యుత్తమ ఫలితాలు మరియు ప్రభావాలు:
ఉపవాసం యొక్క ప్రాపంచిక ఫలితాలు మరియు వాటి ప్రభావాల గురించి తెలిసి ఉంటే చాలా మంది ఒక్క ఉపవాసం కూడా వదలకుండా రమజాన్ మాసమంతా ఉపవాస దీక్షలు నిర్వర్తిస్తారు. రివాయత్ లో దైవప్రవక్త(స.అ) ఇలా ఉల్లేఖించబడి ఉంది: “అల్లాహ్ తఆలా ఇలా ఉపదేశించెను; ఉపవాసం నాకోసం, అందుకు నేనే దాని ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాను”[3]
1. ఉపవాసం నరకాగ్ని యొక్క ఢాలు: నరకాగ్ని యొక్క భయంకరమైన శిక్ష మరియు దాని వేడి ముందు ఉపవాసం ద్వార కలిగే ఆకలి మరియు దాహం చాలా అల్పమైనవి. జీవితాంతం అల్లాహ్ పట్ల విధేయత కలిగి వుండడం అవసరం అది ఏ చర్య అయినా సరే. ఆ విధేయతలలో ఒకటి ప్రత్యేక రోజులలో ఉపవాస దీక్షలు నిర్వర్తించడం. ఖురఆన్ లో ఉపవాస దీక్షల గురించి ఇలా ఉపదేశించబడి ఉంది: “ఓ విశ్వసించినవారలారా! ఉపవాసాలుండటం మీపై విధిగా నిర్ణయించబడింది – మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధించబడింది. దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది. అదీ లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే. అయితే మీలో వ్యాధిగ్రస్తులుగానో, ప్రయాణీకులుగానో ఉన్నవారు ఆ ఉపవాసాల లెక్క ఇతర దినాలలో పూర్తి చేసుకోవాలి”[సూరయె బఖరహ్, ఆయత్183,184]
దైవప్రవక్త(స.అ) ఇలా ఉల్లేఖించారు: “ఉపవాసం (నరకం) అగ్నికి ఢాలు”[4] అంటే ఉపవాసం ద్వార నరకాగ్ని నుండి సురక్షితంగా ఉండవచ్చు, అది ఉపవాసిని హాని తలపెట్టదు. మరో రివాయత్ లో ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా ఉల్లేఖించెను: “ఉపవాసం, ప్రాపంచిక కష్టాలకు ఢాలు లాంటిది మరియు పరలోక శిక్షకు పరదా లాంటిది”[5]
2. ఉపవాసం స్వర్గ ప్రవేశానికి అనుమతి పత్రం: దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “స్వర్గ ద్వారములలో ఒక ద్వారం పేరు రయ్యాన్, ఈ ద్వారం నుండి కేవలం ఉపవాస దీక్షలు నిర్వర్తించేవారు మాత్రమే ప్రవేశించగలరు”[6] మరో రివాయత్ లో దైవప్రవక్త(స.అ) ఇలా ఉల్లేఖించారు: “ఉపవాసం వల్ల తనకు ఇష్టమైన ఆహారములను వదులుకునే వారికి స్వర్గపు ఆహారములు తినిపించడం మరియు స్వర్గపు పానియాలు త్రాగించడం అల్లాహ్ కు తప్పనిసరి”[7]

రెండవ అంశం: పొరపాట్ల మరియు పాపముల నుండి దూరం:
ఉపవాసం మనిషిని నరకాగ్ని నుండి కాపాడుతుంది అనే విషయం నిశ్చయం ఎందుకంటే ఉపవాసం మనిషిని పాపముల నుండి కాపాడుతుంది. అందుకనే రివాయతులలో ఉపవాసం గురించి వివరించనపుడు ఉపవాసి శరీరం యొక్క అన్ని భాగాలూ ఉపవాసం ఉండాలి అని ఉంటుంది. ఇమామ్ అలీ(అ.స) ఉల్లేఖనం: “ఉపవాసం దీక్షలో మనిషి ఎలాగైతే అన్నపానియాలకు దూరంగా ఉంటాడో అలాగే హరామ్ చర్యలకు కూడా దూరంగా ఉండాలి”[8] మరో రివాయత్ లో ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా ఉల్లేఖించారు: “ఉపవాస దీక్ష నిర్వర్తిస్తున్నపుడు నీ కళ్లు, చెవులు, చర్మం మరియు వెంట్రుకలు కూడా ఉపవాసం ఉండాలి”[9] అనగా వీటన్నింటిని పాపకార్యముల నుండి కాపాడుకోవాలి అని అర్థం.

మూడవ అంశం: నీ స్మరణను నిరంతరం నా భాగ్యంగా చేయి:
హజ్రత్ ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: “ప్రతీ దానికి ఒక హద్దు ఉంటుంది దాంతో అది అంతమవుతుంది కాని అల్లాహ్ స్మరణకు హద్దనేదే లేదు”[10] ఖుర్ఆన్ ఇలా వివరిస్తుంది: “ఓ విశ్వాసులారా! అల్లాహ్ ను అత్యధికంగా స్మరించండి. ఉదయం, సాయంకాలం ఆయన పవిత్రతను కొనియాడండి”[సూరయె అహ్‌జాబ్, ఆయత్41,42]

రిఫరెన్స్
1. ఇఖ్బాలుల్ ఆమాల్(తా-అల్ ఖదీమహ్), భాగం1, పేజీ132
2. నెహ్జుల్ బలాగహ్,(సుబ్హీ సాలెహ్, పేజీ498, హిక్మత్145
3. మన్ లా యహ్ జుర్, భాగం2, పేజీ75, హదీస్1773
4. కాఫీ(తా-అల్ ఇస్లామియహ్), భాగం4, పేజీ62, హదీస్1
5. మిస్బాహుష్ షరీఅహ్, పేజీ135. ముస్తద్రకుల్ వసాయిల్, భాగం7, పేజీ369, హదీస్8441
6. మఆనియుల్ అఖ్బార్, పేజీ409, హదీస్90
7. బిహారుల్ అన్వార్(తా-బీరూత్), భాగం40, పేజీ331, హదీస్13
8. బిహారుల్ అన్వార్(తా-బీరూత్), భాగం93, పేజీ294, హదీస్21
9. అల్ కాఫీ(తా-అల్ ఇస్లామియహ్), భాగం4, పేజీ87, హదీస్1
10. అల్ కాఫీ(కులైనీ), భాగం2, పేజీ498

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13