దైవప్రవక్త(స.అ) తరువాత వారి అహ్లెబైత్(అ.స)లే అసలైన రుజుమార్గదర్శకులు

గురు, 06/10/2021 - 18:43

దైవప్రవక్త(స.అ) తరువాత వారి అహ్లెబైత్(అ.స)లే అసలైన రుజుమార్గదర్శకులు అని నిదర్శిస్తున్న హదీసుల వివరణ..

దైవప్రవక్త(స.అ) తరువాత వారి అహ్లెబైత్(అ.స)లే అసలైన రుజుమార్గదర్శకులు

దైవప్రవక్త(స.అ) తరువాత వారి అహ్లెబైత్(అ.స)లే అసలైన రుజుమార్గదర్శకులు, వారే చీకటిలో వెలుతురుని నుంపేవారు మరియు వారే ఖుర్ఆన్ మరియు సున్నత్ యొక్క అసలైన అర్ధాన్ని వ్యాఖ్యానించేవారు. నిజంగా వారు దైవప్రవక్త(స.అ) ఈ ప్రవచనకు అర్హులు. దైవప్రవక్త‎(స.అ) ఇలా ప్రవచించెను:

”مَثَلُ اهل بيتى فِيكُمْ کسَفِينَةِ نُوحٍ مَنْ‏ رَكِبَهَا نَجَى‏ وَ مَنْ تَخَلَّفَ عَنْهَا غَرِق‏ لَا تُسقَدِّمُوهُمْ فَتَهْلِكُوا، وَ لَا تَتَخَلَّفُوا عَنْهُمْ فَتَهلکوا، وَ لَا تُعَلِّمُوهُمْ فَإِنَّهُمْ أَعْلَمُ مِنْكُم“‏
అనువాదం: “మీ మధ్య నా అహ్లెబైత్(అ.స) ఉదాహారణ ప్రవక్త నూహ్(అ.స) యొక్క ఓడ లాంటిది. దానిపై ఎక్కిన వాడు మోక్షాన్ని పొందాడు, మరి దాని నుండి దూరమైన వాడు మునిగిపోయాడు (అందుకని మీరు కూడా) అహ్లెబైత్(అ.స)లను మించకండి మరియు వారి నుండి దూరం అవ్వకండి లేకపోతే నాశనం(హలాక్) అయిపోతారు. వారిని బోధించడానికి ప్రయత్నించకండి ఎందుకంటే వారు మీ కన్నా ఎక్కువ తెలిసినవారు”[1]

మరియు హజ్రత్ అలీ(అ.స) గారి ఈ ప్రవచనకు వారు అర్హులు. ఇమామ్ అలీ(అ.స) ఇలా ప్రవచించెను:

”اُنْظُرُوا أَهْلَ‏ بَيْتِ‏ نَبِيِّكُمْ‏ فَالْزَمُوا سَمْتَهُمْ‏ وَ اتَّبِعُوا أَثَرَهُمْ‏ فَلَنْ‏ يُخْرِجُوكُمْ‏ مِنْ‏ هُدًى‏ وَ لَنْ‏ يُعِيدُوكُمْ فِي رَدًى فَإِنْ لَبَدُوا فَالْبُدُوا وَ إِنْ نَهَضُوا فَانْهَضُوا وَ لَا تَسْبِقُوهُمْ فَتَضِلُّوا وَ لَا تَتَأَخَّرُوا عَنْهُمْ فَتَهْلِكُوا“
అనువాదం: “తమ దైవప్రవక్త‎(స.అ) యొక్క అహ్లెబైత్(అ.స)ల వైపు దృష్టి పెట్టండి. వాళ్ళ మార్గం నుండి దూరం అవ్వకండి, వాళ్ళ పధ్దతులను అనుసరించండి, వాళ్ళు మిమ్మల్ని ఏమాత్రం రుజుమార్గం నుండి తప్పనివ్వరు, నాశనం మరియు అవిశ్వాసం వైపుకు మరలిపోనివ్వరు, ఇక వాళ్ళు ఒకవేళ(తమ ఇంట్లో) కూర్చుండిపోతే మీరు కూడా మీ ఇళ్ళలో కూర్చుండి పోండి, మరియు ఒకవేళ వాళ్ళు యుధ్ధానికి సిధ్ధమైతే మీరు కూడా యుధ్ధానికి సిధ్ధమవ్వండి, వాళ్ళ కన్న ముందు నడిచేందుకు ప్రయత్నించకండి లేకపోతే అవిశ్వాసులుగా మారుతారు, వాళ్ళకు దూరంగా ఉండిపోకండి లేకపోతే నాశనం అయిపోతారు”[2]

మరో ఉపన్యాసంలో ఇమామ్ అలీ(అ.స), అహ్లెబైత్(అ.స)ల ప్రతిష్టత గురించి ఇలా ప్రవచించారు: “దైవప్రవక్త(స.అ) యొక్క అహ్లెబైత్(అ.స)లు విజ్ఞానాన్ని జీవంపోసే మరియు అజ్ఞానాన్ని అంతం చేసేవారు, వాళ్ళ కోమల స్వభావమే వాళ్ళలో ఉన్న జ్ఞానాన్ని మీకు తెలియపరుస్తుంది, వాళ్ళ సుస్పష్టతే వాళ్ళ యొక్క అంతరంగాన్ని తెలియపరుస్తుంది, వాళ్ళ మౌనమే వాళ్ళ తత్త్వజ్ఞానాన్ని మరియు మాటతీరును తెలియపరుస్తుంది. దైవప్రవక్త(స.అ) అహ్లెబైత్(అ.స)లు సత్యాన్ని ఎప్పటికీ వ్యతిరేకించరు అలాగే అందులో సందేహించరు. వాళ్ళే ఇస్లాం యొక్క మూల స్తంభాలు మరియు రక్షకులు, వాళ్ళ వల్లే సత్యం తన స్ధానంలో తిరిగి వస్తుంది మరియు అన్యాయం తన స్ధానాన్ని విడుస్తుంది, సత్యం ప్రత్యక్షించడంతో అన్యాయం యొక్క కంఠం వధించబడుతుంది. దైవప్రవక్త(స.అ) యొక్క అహ్లెబైత్(అ.స)లు దీన్‌ను వివేక భావము మరియు బుద్ధితో తెలుసుకున్నారు, కేవలం దానిని విని ఉల్లేఖించేయలేదు. ఎందుకంటే విద్యను రచించే వారు చాలా ఉంటారు కాని దాని భావం తెలిసినవారు చాలా తక్కువ”[3]

నిజంగా ఇమామ్ అలీ(అ.స) గారు ఇచ్చిన ఉపన్యాసం సత్యంపై నిలిచి ఉంది. ఎందుకని ఉండదు అతనే విజ్ఞాన పట్టణానికి ద్వారం. దీన్‌ను తెలుసుకొని దానిపై అమలు చేసి ధర్మనిష్టతో ఉండడం వేరు మరి విని దానిని ఉల్లేఖించడం వేరు. వినే వారు మరియు దానిని ఉల్లేఖించే వారు చాలా ఉన్నారు. సహాబీయులలో ఎంతో మంది దైవప్రవక్త‎(స.అ) సన్నిధిలో కూర్చోనివుండేవారు మరియు వారి నుండి హదీసులను విని ఉల్లేఖించేవారు కాని వాళ్ళు ఇదంతా తెలిసి తెలియక చేసేవారు అందుకే అప్పుడప్పుడూ దాని అర్ధాన్ని మార్చేసే వారు. మరి అది ఒక్కోసారి దైవప్రవక్త‎(స.అ) యొక్క ఉద్దేశానికి పూర్తి వ్యతిరేకంగా మారిపోయేది. వాళ్ళు సాదాసీదా మనుషులు కాబట్టి అప్పుడప్పుడైతే ఇక అవిశ్వాసపు అర్ధాలు ఉల్లేఖించే వారు ఎందుకంటే వాళ్ళు దాని యధార్ధాన్ని తెలుసుకోలేకపోయేవారు.[4]

కాని విద్యను కాపాడి దాని భావనను రక్షించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది మరియు ఇప్పుడు కూడా చాలా తక్కువే, ఒక్కోసారి మనిషి తన పూర్తి జీవితాన్ని విద్యాభ్యాసం కోసం అంకితం చేస్తాడు కాని చాలా తక్కువ జ్ఞానాన్ని పొందగలుగుతాడు. మరియు కేవలం ఒక అధ్యాయం లేదా ఒక కళలో నైపుణ్యం పొందగలడు పూర్తి ఆధ్యాయాలలో సంపూర్ణత్వాన్ని పొందడం అసాధ్యం. ఇది కేవలం అహ్లెబైత్(అ.స)లకే సాధ్యం వారే అన్ని విద్యలు తెలిసినవారు. హజ్రత్ అలీ(అ.స) దీనిని రుజువు చేసి చూపించారు. వాటికి చరిత్రకారులే సాక్షి. అలాగే ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) మరియు ఇమామ్ సాదిఖ్(అ.స)లు కూడా వాటిని రుజువు చేశారు వివిధ విద్యలలో ఉదా: ఫిలాసఫీ, వైద్యం, పిఖా, మొ॥ వేల సంఖ్యలలో వాళ్ళ శిష్యులు ఉండేవారు.

రిఫరెన్స్
1. సవాయిఖుల్ ముహ్రిఖహ్, పేజీ136, 221. జామివుస్సగీర్, భాగం7, పేజీ132. ముస్నదె అహ్మద్, భాగం3, పేజీ17 మరియు భాగం4, పేజీ366. హిల్యతుల్ ఔలియా, భాగం4, పేజీ306. అల్ మోజము అల్ సగీర, తబరాని, భాగం2, పేజీ22.
2. నహ్జుల్ బలాగహ్, భాగం2, పేజీ190.
3. నహ్జుల్ బలాగహ్, భాగం2, పేజీ439.
4. దాని ఒక ఉదాహారణ వినండి, అబూహురైరహ్ యొక్క ఒక హదీస్, అల్లాహ్, ఆదమ్(అ.స)ను తన ముఖం వలే సృష్టించాడు “ان اللہ خلق آدم علی صورته” కాని ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా వివరించారు: ఇద్దరు వ్యక్తులు ఒకరిని ఒకరు దూషిస్తుండగా అందులో ఒకడు అల్లాహ్ నీ ముఖాన్ని మరియు నీ పోలిక గల ముఖాన్ని కురూపిగా మర్చుగాక అని అన్నాడు. దాంతో దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించారు: ان اللہ خلق آدم علی صورته అనగా పోలిక గల ముఖాన్ని దూషించి జనాబె ఆదమ్(అ.స)ను కూడా దూషించావు ఎందుకంటే అతను కూడా (మనిషి) పోలిక గలవారు. ఈ హదీసులో “ہ” ఆదమ్ యొక్క సర్వనామము అల్లాహ్ యొక్క సర్వనామము కాదు, లేకపోతే అల్లాహ్‌కు ముఖం ఉంది అని విశ్వాసించాల్సి వస్తుంది మరి అలాంటి నమ్మకం కుఫ్ర్‌కు సబబు అవుతుంది.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10