ఖిలాఫత్

శుక్ర, 06/18/2021 - 15:25

“దైవప్రవక్త‎(స.అ) తన మరణానికి ముందు ఏ ఒక్కరిని ఖిలాఫత్ పదవి కోసం నిశ్చయించలేదు” అనే విశ్వాసం పై సంక్షిప్త వివరణ...

ఖిలాఫత్

అహ్లెసున్నత్‌లలో “దైవప్రవక్త‎(స.అ) తన మరణానికి ముందు ఏ ఒక్కరిని ఖిలాఫత్ పదవి కోసం నిశ్చయించలేదు” అనే విశ్వాసం చాలా ప్రసిధ్ధి చెందినది. సహాబీయులలో సలహా మండలి, సఖీఫాయే బనీ సాయిదహ్‌లో చర్చించి దైవప్రవక్త(స.అ) దృష్టిలో గౌరవనీయులనీ, అబూబక్ర్‌ను ఖలీఫాగా ఎన్నుకున్నారు. మరియు దైవప్రవక్త‎(స.అ) మరణం కన్నా ముందు అనారోగ్యంతో ఉన్నప్పుడు అతనినే జామఅత్ యొక్క ఇమామ్‌గా నియమించారు. సహాబీయులు ఇలా చెప్పేవారు: దైవప్రవక్త(స.అ) అతనిని మన దీన్ కోసం(జమాఅత్ ఇమామ్‌గా) నియమించడాన్ని ఇష్ట పడ్డవారు మరి మన ఈ లోకం(వ్యవహారాల) కోసం ఎందుకు ఇష్టపడరూ?. వాళ్ళ సాక్ష్యాలు సంక్షిప్తంగా:
1. దైవప్రవక్త(స.అ) ఎవ్వరిని తన ఖలీఫాగా నియమించలేదు.
2. ఖిలాఫత్ పదవిని కేవలం సలహా మండలి ద్వార నిర్ణయించాలి.
3. అబూబక్ర్ యొక్క ఎన్నిక పెద్ద సహాబీయుల చేతుల మీదుగా జరిగింది.

వారి ప్రజాస్వామ్య పరిపాలనపై గర్వంగా ఇలా చెబుతూ ఉంటారు “ఇస్లాం పరిపాలన ఒక ప్రజాస్వామ్య పరిపాలన మరియు ప్రపంచంలో అభివృధ్ధి చెందిన కొన్ని దేశాలు దేనిపై గర్విస్తారో దానిని ఇస్లాం ముందుగానే తెలుసుకుంది, పశ్చిమ దేశస్తులు 19వ శతాబ్దంలో ప్రజాస్వామ్య పరిపాలనను తెలుసుకున్నారు కాని ఇస్లాం 6వ శతాబ్దంలోనే ఈ ప్రజాస్వామ్య పరిపాలనను తెలియపరిచింది” అని.

కాని షియా ఉలమాలు, అల్లాహ్ ఒక సంఘాన్ని నాయకుడు లేకుండా వదిలేయడం అనేది ఆయనకు తగనిది, అని నమ్ముతారు. స్వయంగా అల్లాహ్‌యే ఇలా ప్రవచించాడు: “ప్రతీ జాతి కొరకూ ఒక మార్గదర్శకుడు ఉన్నాడు”[రఅద్ సూరా:13, ఆయత్7][1]

మరి అలాగే దైవప్రవక్త(స.అ)కు తన ఉమ్మత్ తెగలుగా విడిపోతారని తెలిసి ఉండగా[2] ఇలా తన ఉమ్మత్‌ను నాయకుడు లేకుండా వదిలేయడం దైవప్రవక్త(స.అ)కు కూడా తగిన విషయం కాదు. జనం అవిశ్వాసం పై మరలి పోతారు[3] సహాబీయులు ప్రపంచం హోదా, సొమ్ము మొ॥ వాటి వైపుకు పరుగులు తీస్తారు[4] చివరికి పదవుల కోసం ఒకరినొకరు చంపుకోవడానికి కూడా సిద్ధమౌతారు[5] ప్రజలు యూధుల మరియు క్రైస్తవుల ఆదేశాలను ఆచరించే అవకాశం ఉంది[6] ఈ సమస్యలు ఎదురవ్వచ్చు అని భావిస్తున్న దైవప్రవక్త(స.అ) ఎలా నాయకుడిని నియమించకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్ళగలరూ!?.

అంతే కాదు ఉమ్ముల్ మొమినీన్ హజ్రత్ ఆయెషా కూడా ఈ విషయం పట్ల చాలా ఆలోచిస్తూ ఉండేవారు అందుకే ఉమర్ బిన్ ఖత్తాబ్ కత్తితో పొడవబడిన తరువాత హజ్రత్ ఆయెషా, హజ్రత్ ఉమర్ వద్దకు ఇలా సందేశాన్ని పంపించారు; “ఉమ్మతె ముహమ్మద్(స.అ) కొరకు ఒకరిని ఖలీఫాగా నియమించండి మీ తరువాత వాళ్ళను నాయకుడు లేని వారిగా వదిలేయ వద్దు ఎందుకంటే నాకు ఉమ్మత్‌లో కలతలు ఎర్పడతాయేమో అనే భయం ఉంది”[7]

అలాగే అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్, తన తండ్రి కత్తితో పొడవబడినప్పుడు అతని వద్దకు వచ్చి ఇలా అన్నాడు: “మీరు ఖలీఫాగా ఎవ్వరినీ నియమించరు” అని ప్రజలు అనుకుంటున్నారు, ఒకవేళ మీ ఒంటేల మరియు మేకల కాపరి వాటిని వదిలేసి మీ వద్దకు వస్తే మీరు అతడితో  “నీవు ఆ ఒంటెల మరియు మేకల మందను నాశనం చేశావు” అనే కదా అంటారు, మరలాంటప్పుడు ప్రజల నాయకత్వం అంతకన్న ముఖ్యమైనది కదా‎!‎!!.[8]

అంతే కాదు ముస్లిముల చేత సలహా మండలి ద్వార ఖలీఫాగా ఎన్నుకోబడ్డ హజ్రత్ అబూబక్ర్,  స్వయంగా అతనే ఈ సలాహా మండలియే ఎన్నుకోవాలనే నమ్మకాన్ని ఒమ్ము చేసి అతని తరువాత ఉమ్మత్‌లో విబేధాలు ఏర్పడకూడదని మరియు కలతలతో సురక్షితంగా ఉండాలని వెంటనే “ఉమర్‌”ను ఖలీఫాగా నియమించేశారు.

ఇవన్ని హజ్రత్ అబూబక్ర్ పట్ల మాకు మంచి అభిప్రాయం కలిగి ఉన్నప్పుడు. లేకపోతే హజ్రత్ అలీ(అ.స)(మా అందరి కన్న జరుగుతున్న సంఘటనలలో ఉన్న ఎగుడు దిగుడులు బాగా తెలిసినవారు) భవిష్యత్తులో ఇలా జరుగుతుంది అని ముందే చెప్పారు, అబూబక్ర్ తరువాత ఉమర్‌కే ఖిలాఫత్ పదవి దొరుకుతుంది ఎందుకంటే ఉమర్, హజ్రత్ అలీ(అ.స)పై అవసరానికి మించి అబూబక్ర్‌తో బైఅత్ చేసే విషయంలో బలవంతం చేశారు ఆ సమయంలో హజ్రత్ అలీ(అ.స) ఇలా ప్రవచించారు: “నీవు అతని కోసం పాలు పితుకు అందులో ఒక భాగం నీకు కూడా దక్కుతుంది, రేపు దానిని(ఖిలాఫత్ పదవి) నీ తరపు మలిచేయాలని ఈ రోజు నీవు అతని కోసం బలవంతం చేయి”[9]

రిఫరెన్స్
1. إِنَّمَآ أَنتَ مُنذِرٞۖ وَلِكُلِّ قَوۡمٍ هَادٍ
2. తిర్మిజీ, దావూద్, ఇబ్నెమాజా, ముస్నదె అహ్మద్ హంబల్, భాగం2, పేజీ332.
3. సహీ బుఖరీ, భాగం7, పేజీ902, బాబుల్ హౌజ్ మరియు భాగం 5, పేజీ192.
4. సహీ బుఖారీ, భాగం4, పేజీ195.
5. సహీ బుఖారీ, భాగం7, పేజీ112.
6. సహీ బుఖారీ,భాగం, పేజీ144.
7. ఇమామత్ వ సియాసత్, భాగం1, పేజీ28.
8. సహీ ముస్లిం, భాగం6, పేజీ5, బాబుల్ ఇస్తిఖ్లాఫి వ తర్కిహ్.
9. ఇమామత్ వ సియాసత్, భాగం1, పేజీ18.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 5