బద్ర్ యుద్ధం

ఆది, 08/01/2021 - 08:17

ముస్లిముల మరియు ముష్రికీనుల మధ్య జరిగిన మొట్టమొదటి యుద్ధం బద్ర్ యుద్దం(జంగె బద్ర్)....

బద్ర్ యుద్ధం

బద్ర్ యుద్దం(జంగె బద్ర్) ముస్లిముల మరియు ముష్రికీనుల మధ్య జరిగిన యుద్ధం. ఇరువైపులవారికీ ఇది సైన్యపరంగా ఒక పరీక్ష అందుకని ఈ యుద్ధం ఇరువైపుల వారికీ చాలా ముఖ్యమైనది.

ఈ యుద్ధం హిజ్రీ యొక్క రెండవ సంవతర్సరంలో జరిగింది, ఈ సంవత్సరంలో ఇస్లాం యొక్క పాత శత్రువు అబూసుఫ్యాన్ పర్యవేక్షణలో ఖురైషీయుల వ్యాపార బృందం షామ్ నుంచి మక్కాకు తిరిగి వెళ్తుంది అని దైవప్రవక్త(స.అ)కు తెలిసింది, ఆ వ్యాపార బృందం తిరిగి వెళ్లే మార్గం మదీనహ్ పట్టణం దగ్గర నుంచి వెళ్తుంది, దైవప్రవక్త(స.అ) ముహాజిరీన్ మరియు అన్సారుల నుంచి 313 మందిని తీసుకొని ఆ బృందం వెళ్లే బద్ర్ ప్రదేశానికి బయలుదేరారు.

దైవప్రవక్త(స.అ) ఇలా చేయడానికి కారణం., ఖురైషీయుల వ్యాపార బృందం యొక్క మార్గం ఇస్లామీయ దళాలను దాటి వెళ్లాలి, వాళ్లు ఇస్లాం ప్రచారంలో మరియు ముస్లిముల స్వేచ్ఛ విషయంలో అడ్డు పడితే, ఇస్లాం దళాలు వాళ్లను ఆర్థికంగా నాశనం చేస్తాయి అని వారికి తెలియాలి.

అటు ముస్లిముల కదలికను తెలుసుకున్న అబూసుఫ్యాన్, సుర్ఖ్ అనబడే నది ప్రక్కన ఉన్న మరో అడ్డదారిని ఎంచుకొని త్వరగా ఆ ఆపద ఉన్న ప్రదేశం నుంచి బృందాన్ని దూరం చేశాడు. అదే సమయంలో ఖురైష్ కు చెందిన పెద్దల నుంచి సహాయం కోరాడు. అబూసుఫ్యాన్ సహాయం కోరగా 950 నుంచి 1000 మంది సైన్యం ఏర్పడింది, వారందరూ మదీనహ్ వైపు బయలుదేరారు. రమజాన్ మాసం 17వ తారీఖున ఈ సైన్యం ఇస్లామీయ సైన్యానికి ఎదురుపడింది. ముష్రికీనుల సైన్యం ఇస్లాం సైన్యానికి మూడు వంతులు ఎక్కువగా ఉంది.

ముందుగా ఖురైష్ సైన్యం నుండి ముగ్గరు యోధులు ఉత్బా(హింద తండ్రి మరియు అబూసుఫ్యాన్ కొడుకు), ఉత్బా పెద్దన్నయ్య “షైబా” మరియు “వలీద్”(ఉత్బా కొడుకు) అరుస్తూ యుద్ధభూమి కేంద్ర ప్రదేశానికి వచ్చి యుద్ధానికి రమ్మని కోరారు. అప్పుడు అన్సారులకు చెందిన ముగ్గురు యోధులు యుద్ధభూమిలో ప్రవేశించి తమను పరిచయించుకున్నారు. ఖురైష్ యోధులు వారితో యుద్ధం చేయకుండా గట్టిగా అరుస్తూ ఇలా అన్నారు: ఓ ముహమ్మద్! మా జాతికి చెందిన మాకు సమానమైన వారిని మాతో యుద్ధానికి పంపించు.

అప్పుడు దైవప్రవక్త(స.అ) “ఉబైదహ్ ఇబ్నె హారిస్ ఇబ్నె అబ్దుల్ ముతల్లిబ్”, “హంజా ఇబ్నె అబ్దుల్ ముతల్లిబ్” మరియు అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స)లకు వెళ్లమని ఆదేశించారు, ఈ ముగ్గురు శౌర్యులు యుద్ధభూమికి చేరి తమను పరచయించుకున్నారు. వాళ్లు వీళ్లతో యుద్ధానికి సమ్మతించి అందరూ మాకు సమానమైనవారు అని అన్నారు. హంజా, షైబహ్ తో, ఉబైదహ్, ఉత్బాతో మరియు అందరికన్న చిన్నవాడు అయిన అలీ(అ.స)తో వలీద్(ముఆవియ్ మావయ్య) యుద్ధానికి దిగారు. అలీ మరియు హంజా ఇద్దరూ చాలా కొద్ది సమయంలోనే వాళ్లిద్దరిని హతమార్చారు కాని ఉబైదహ్ మరియు ఉత్బా మధ్య యుద్ధం ఇంకా సాగుతూనే ఉంది, చివరికి ఉత్బాను కూడా హతమార్చబడ్డాడు.[1]

కాలం గడిచిన తరువాత ఒకసారి అలీ(అ.స) ముఆవియాకు వ్రాసిన ఉత్తరంలో ఇలా వ్రాశారు: “ఒక యుద్ధంలో నీ ముత్తాత(ఉత్బా) నీ మావయ్య(వలీద్) మరియు నీ సోదరుడు హన్జలహ్ ను పొడిచిన ఖడ్గం ఇప్పటికీ నా వద్దనే ఉంది”[2]

ఈ ఇస్లామీయ ముగ్గురు శౌర్యులు, ఖురైష్ యోధుల పై విజయం సాధించిన తరువాత, వాళ్ల నాయకులు అవమానంగా భావించి మొత్తం సైన్యంతో యుద్ధానికి దిగారు, చివరికి ముష్రిక్కుల సైన్యం అపజయానికి గురి అయ్యింది, వాళ్ల 70 మందిని బందీయులుగా చేసుకున్నారు.

ఈ యుద్ధంలో సగం కన్న ఎక్కువ మంది అలీ(అ.స) ఖడ్గానికి గురి అయినవారే.

మర్హూమ్ షేఖ్ ముఫీద్, బద్ర్ యుద్ధంలో చనిపోయిన 36 మంది ముష్రిక్కుల పేర్లను చెప్పి ఇలా రచించెను: షియా మరియు అహ్లె సున్నత్ రావీయులందరూ వీరందరినీ స్వయంగా అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) హతమార్చారు అని అభిప్రాయం కలిగివున్నారు, ఇంకొందరి విషయంలో సందేహం ఉంది వాళ్లని అలీ(అ.స) హతమార్చారా లేదా ఇతరులు చంపారా.[3]

రిఫరెన్స్
1. ఇబ్నె హిషామ్, అబ్దుల్ మలిక్, అల్ సీరతున్నబవియహ్, తహ్ఖీఖ్.. ముస్తఫా అస్సఖా, ఇబ్రాహీమ్ అల్ అబ్యారీ మరియు అబ్దుల్ హఫీజ్ షిబ్లీ, భాగం2, పేజీ277. ఇబ్నె అసీర్, అల్ కామిల్ ఫీత్తారీఖ్, భాగం2, పేజీ125.
2. నెహ్జుల్ బలాగహ్, సూబ్హీ సాలెహ్, నామా64. అలీ(అ.స) నామా28లో కూడా దీనిని వివరించారు.
3. షఖ్ ముఫీద్, అల్ ఇర్షాద్, పేజీ39.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 15 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 21