హజ్రత్ అలీ ఇబ్నుల్ హుసైన్(అ.స)

శుక్ర, 08/13/2021 - 05:41

ఇమామ్ జైనుల్ ఆబెదీన్(అ.స) కాలంలో ఉన్న అధికారుల గురించి మరియు వారు కర్బలా తరువాత చేపట్టిన కార్యముల గురించి సంక్షిప్తంగా...

హజ్రత్ అలీ ఇబ్నుల్ హుసైన్(అ.స)

దైవప్రవక్త(స.అ) యొక్క నాలుగొవ ఉత్తరాధికారి, ఇమామ్ హుసైన్(అ.స) యొక్క కుమారుడు. వారి ప్రముఖ బిరుదులు “జైనుల్ ఆబెదీన్”, “సజ్జాద్”
ఇమామ్ సజ్జాద్(అ.స) హిజ్రీ యొక్క 38వ సంవత్సరంలో జన్మించారు.[1] వారి బాల్యం మదీనహ్ లో గడిచింది. రెండు సంవత్సరాలు వారి పితామహులైన అలీ(అ.స) యొక్క అధికారాన్ని చూశారు. ఆ తురువాత 10 సంవత్సరాలు తన పెదనాన్న అయిన హజ్రత్ హసన్(అ.స) యొక్క అధికారంలో జరిగిన సంఘటనలు చూస్తూ పెరిగారు. ఇమామ్ హసన్(అ.స) మరణానంతరం 10 సంవత్సరాల వరకు తన తండ్రి హుసైన్ ఇబ్నె అలీ(అ.స) ప్రక్కనే ఉన్నారు.
హిజ్రీ యొక్క 61వ హిజ్రీలో ముహర్రం లో కర్బలా భూమిపై తమ తండ్రిని అన్యాయంగా చంపబడడాన్ని చూశారు. కర్బలా యదార్థ సంఘటన తరువాత వారు ఇమామత్ బాధ్యత పొందారు. మిగిలివున్న ఇమామ్ హుసైన్(అ.స) కుటుంబ సభ్యులను బంధీలుగా చేసి కూఫా అక్కడ నుంచి షామ్ కు తీసుకుని వెళ్లారు. ఇమామ్ సజ్జాద్(అ.స) దారిపొడుగునా ఉపన్యాసాలు ఇచ్చి యజీద్ అధికారాన్ని సిగ్గుపడేలా చేశారు. షామ్ నుంచి తిరిగి వచ్చిన తరువాత మదీనహ్ లో స్థిరపడ్డారు. హిజ్రీ యొక్క 94 లేదా 95వ సంవత్సరంలో విషం ద్వార చంపబడ్డారు. వారి సమాధి ఇమామ్ హసన్(అ.స) ప్రక్కలో “బఖీ” స్మశానంలో ఉంది.

ఇమామ్ యొక్క కాలంలో ఉన్న అధికారులు
హజ్రత్ అలీ ఇబ్నుల్ హుసైన్(అ.స) యొక్క ఇమామ్ కాలంలో అధికారంలో ఉన్న అధికారులు.
1. యజీద్ ఇబ్నె ముఆవియహ్ – హిజ్రీ 61 నుంచి 64 వరకు.
2. అబ్దుల్లాహ్ ఇబ్నె జుబైర్ - హిజ్రీ 61 నుంచి 73 వరకు.
3. ముఆవియహ్ ఇబ్నె యజీద్ - హిజ్రీ యొక్క 64వ సంవత్సరంలో కొన్ని నెలలు.
4. మర్వాన్ ఇబ్నె హకమ్ - హిజ్రీ యొక్క 65వ సంవత్సరంలో 9 నెలలు.
5. అబ్దుల్ మలిక్ ఇబ్నె మర్వాన్ - హిజ్రీ 65 నుంచి 86 వరకు.
6. వలీద్ ఇబ్నె అబ్దుల్ మలిక్ - హిజ్రీ 61 నుంచి 64 వరకు.

ఇమామ్ చేపట్టిన చర్యలు
హజ్రత్ అలీ ఇబ్నుల్ హుసైన్(అ.స) అప్పటి పరిస్థితులను బట్టి కొన్ని తబ్లీగె ఇస్లాం కోసం బోధన పరంగా, సాంస్కృతిక కార్యక్రమాలు, శిక్షణ చర్యలు మరియు పరోక్ష పోరాటాలు మొదలు పెట్టారు. వాటిలో ముఖ్యమైనవాటి వివరణ..

1. ఆషూరా సంఘటనను సజీవంగా ఉంచడం
అమవీయుల అధికారం చట్టబద్ధమైనది కాదు అని తెలియపరిచిన ఇమామ్ హుసైన్(అ.స) మరియు వారి సహచరుల ప్రాణత్యాగం ఎప్పటికీ మరవకూడదు, అది సజీవంగా ఉండాలనే ఉద్దేశంతో హజ్రత్ సజ్జాద్(అ.స) కర్బలా అమరులను మరియు కర్బలాలో వారిపై జరిగిన అన్యాయాన్ని స్మరిస్తూ మరియు సంఘటనను వివరిస్తూ ఏడ్చేవారు. నిత్యం స్మరించడం వల్ల అమవీయులు చేసిన అన్యాయం మరియు దుర్మార్గం ప్రజలకు గుర్తుండి పోయింది.

2. ఉమ్మత్ మార్గదర్శకం
ఇమామ్ సజ్జాద్(అ.స) కాలం యొక్క పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల బహిరంగంగా ఇస్లాం ప్రచారం చేయడానికి వీలుండేది కాదు, అందుకని ఇమామ ప్రజలకు సద్బోధన చర్యగా ఇస్లాంను వివరించేవారు. అవి కాలక్రమేణ మరవబడినవి లేదా మార్చబడిన అంశాలు అయి ఉండేవి.

3. ఇస్లామీయ బోధనలు దుఆ మరియు మునాజాత్ రూపంలో
ఇమామ్ సజ్జాద్(అ.స) ఇస్లాం బోధనలు ప్రజలలో ప్రచారం చేసే విధానాలలో మరో విధానంగా దుఆ మరియు మునాజాత్ ను ఎంచుకున్నారు. దుఆ మనిషి మరియు తన ప్రభువు మధ్య గల బంధం, దుఆ మనిషి ఆథ్యాత్మిక బలాన్ని పెంచుతుంది.

సహీఫయె సజ్జాదియహ్
ఇమామ్ సజ్జాద్(అ.స) అప్పటి పరిస్థితులను బట్టి ఇస్లామీయ బోధనలను దుఆ రూపంలో ప్రజలకు బోధించేవారు. ఆ దుఆ మరియు మునాజాతుల సేకరణ “సహీఫయె సజ్జాదియహ్” పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇస్లామీయ బోధనల ప్రకారం ఈ గ్రంథం యొక్క స్థానం ఖుర్ఆన్ మరియు నెహ్జుల్ బలాగహ్ తరువాత స్థానం కలిగివుంది. ప్రముఖ ఉలమాల చేత ఈ గ్రంథం “ఉఖ్తుల్ ఖుర్ఆన్”[2],  “ఇంజీలె అహ్లె బైత్(అ.స)”, “జబూరె ఆలె ముహమ్మద్(స.అ)” అని బిరుదులు కూడా పొందింది.[3]

4. అహ్కామ్ మరియు సద్బోధనల ప్రచారం
ఇమామ్ సజ్జాద్(అ.స) చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలలో మరో చర్య అహ్కామ్ మరియు సద్బోధనల ప్రచారం. షేఖ్ ముఫీద్ తన గ్రంథ అల్ ఇర్షాద్‌లో ఇలా రచించారు:
“అహ్లె సున్నత్ ఫిఖా జ్ఞానులు వారి నుంచి లెక్కలేనివన్ని ఉల్లేఖనలు ఉల్లేఖించారు. సద్బోధనలు, దుఆలు, ఖుర్ఆన్ ప్రతిష్టతలు, హలాల్ మరియు హరామ్ ల గురించి చాల ఉల్లేఖనలు ఉన్నాయి, వాటిని వివరించాలంటే, చాలా సమయం పడుతుంది అని జ్ఞానులు మధ్య మాట....”[4]
ఇమామ్ సద్బోధన సేకరణ పేరు “రిసాలతుల్ హుఖూఖ్”, ఈ గ్రంథంలో ఇతరుల పట్ల మనిషి బాధ్యతలు వివరించబడి ఉన్నాయి.

6. నిస్సహాయులకు సహాయం చేయడం
ఇమామ్ సజ్జాద్(అ.స) జీవితంలో ప్రకాశవంతమైన అంశాలలో ఒకట, రాత్రి చీకటిలో ఎవరికి తెలియకుండా సమాజ సేవ చేయడం. మదీనహ్ క్లిష్ట మరియు అస్తవ్యస్తమైన పరిస్థితులలో నిస్సహాయులకు ఆదుకునేవారు. వారి ఈ సహాయం తన జీవితం యొక్క చివరి క్షణాల వరకు సాగింది. చరిత్ర వారి సహాయ చర్యలను ఇలా ఉల్లేఖిస్తుంది:
ఇమామ్ సజ్జాద్(అ.స) వంద నిస్సహాయ కుటుంబాల జీవన వ్యయం యొక్క బాధ్యతను తీసుకున్నారు.(వంద నిస్సహాయ కుటుంబాలను దత్తత తీసుకున్నారు)[5]
మదీనహ్ కు చెందిన కొంతమంది చేతికి ప్రతీరోజు ఆహారం చేరేది, దాంతో వారు తమ జీవితాన్ని గడిపేవారు, కాని వారికి ఆ ఆహారాన్ని ఎవరు చేర్చేవారో తెలియదు. ఇమామ్ సజ్జాద్(అ.స) మరణించిన తరువాత వారికి తెలిసింది వారు అలీ ఇబ్నుల్ హుసైన్(అ.స) అని.[6]

రిఫరెన్స్
1. షేఖ్ ముఫీద్, అల్ ఇర్షాద్, పేజీ253. చరిత్ర కారులలో కొందరు ఇమామ్ సజ్జాద్(అ.స) హిజ్రీ యొక్క 36 లేదా 37వ సంవత్సరంలో జన్మించారు అని రచించారు.
2. షేఖ్ ఆగా బుజుర్గె, అల జరీఅహ్ ఇలా తసానీపిష్ షియా, తా2, బీరూత్, దారుల్ అజ్వా, 1378హి, భాగం15, పేజీ18.
3. సీమాయె పీష్వాయాన్, మహ్దీ పీష్వాయీ, పేజీ70.
4. అల్ ఇర్షాద్, ఖుమ్, మక్తబతు బసీరతీ, పేజీ260.
5. అబూనయీమె ఇస్ఫెహానీ, హిల్యతుల్ ఔలియా, తా5, బీరూత్, దారుల్ కితాబ్ అల్ అరబీ, 1407హి, భాగం3, పేజీ136.
6. అలీ ఇబ్నె ఈసా అల్ అర్బలీ, కష్ఫుల్ గుమ్మహ్, తబ్రీజ్, మక్తబతు బనీ హాషిమ్, 1381హి, భాగం2, పేజీ289.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15