ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స)

శుక్ర, 08/27/2021 - 05:06

ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స) కాలం యొక్క సామాజిక మరియు రాజకీయ పరిస్థితుల గురించి సంక్షిప్త వివరణ...

ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స)

ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స)
ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స), దైవప్రవక్త(స.అ) యొక్క 9వ ఉత్తరాధికారి. పేరు “ముహమ్మద్”, కున్నియత్ “అబూ జాఫర్”, బిరుదు “తఖీ” మరియు “జవాద్”, రమజాన్ మాసం హిజ్రీ 195వ సంవత్సరం మదీనహ్ పట్టణంలో జన్మించారు.[1] తండ్రి ఇమామ్ రిజా(అ.స), తల్లి “సబీకహ్” ఈమె దైవప్రవక్త(స.అ) భార్య అయిన “మారియా ఖిబ్తియహ్” వంశానికి చెందివారు.
ఇమామ్ జవాద్(అ.స) యొక్క తండ్రి మరణించినపుడు వారు 8 సంవత్సరాల వయసు కలిగివున్నారు. 25 సంవత్సరాల వయసులో విషం ద్వార చంపబడ్డారు. వారి సమాధి బగ్దాద్ లో తన పితామహులైన ఇమామ్ మూసా కాజిమ్(అ.స) ప్రక్కన ఉంది.

ఇమామ్(అ.స) కాలంలో ఉన్న ఖలీఫాలు
ఇమామ్ జవాద్(అ.స) ఇద్దరు అబ్బాసీ ఖలీఫాల కాలంలో తన జీవితాన్ని గడిపారు. మొదటివాడు “మామూన్”(హిజ్రీ 193 నుంచి 218) మరియు రెండోవాడు “మొతసిమ్” (హిజ్రీ218 నుంచి 227 వరకు). వీరిద్దరు కూడా వారిని మదీనహ్ నుంచి బగ్దాద్ కు రమ్మని బలవంతం చేశారు. ఇమామ్ రిజా(అ.స) విషయంలో మామూన్ చేసినట్లు రాజధానికి పిలిచి వీరి పై నిఘా పెట్టారు.

చిన్న వయసులో ఇమామత్ పదవి
చిన్న వయసులోనే ఇమామత్ పదవి పొందిన మొదటి ఇమామ్, ఇమామ్ జవాద్(అ.స). చిన్న వయసులో ఇమామత్ బాధ్యత ఎలా నిర్వర్తించగలరు, ఇంతకు ముందు ఇలా ఎప్పుడైనా జరిగందా లాంటి ప్రశ్నలకు ఖుర్ఆన్ మరియు హదీసులు నిదర్శిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అల్లాహ్ కు సాధ్యం కానిది ఏదీ లేదు. అల్లాహ్ పూర్వంలో కొందరిని చిన్న వయసులోనే ప్రవక్తగా, నాయకుడిగా నియమించిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహారణకు ఖుర్ఆన్ లో హజ్రత్ ఈసా(అ.స) గురించి ఇలా వివరించబడి ఉంది: ఆ పసివాడు ఇలా పలికాడు: “నేను అల్లాహ్ దాసుడను. ఆయన నాకు గ్రంథం వొసగాడు. నన్ను తన ప్రవక్తగా నియమించాడు”[ సూరయె మర్యమ్, ఆయత్30.]
ఇమామ్ రిజా(అ.స) 202హిజ్రీలో మరణించారు, అప్పుడు ఇమామ్ జవాద్ వయసు ఏడు సంవత్సరాలు. అందుకు బగ్దాద్ మరియు చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలలో అభిప్రాయబేధాలు ఏర్పడ్డాయి. షియా వర్గానికి చెందిన సాధారణ ప్రజలే ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. హజ్ సమయం వచ్చినప్పుడు బద్గాద్ మరియు ఇతర ప్రాంతాలకు చెందిన 80 మంది ఫిఖా జ్ఞానుల మరియు ఉలమాలు హజ్ కు బయలుదేరి వెళ్ళి అక్కడ నుంచి మదీనహ్ కు ఇమామ్ జవాద్(అ.స)ను కలిసేందుకు వెళ్లారు. ఇమామ్ వారి వద్దకు వచ్చి కూర్చున్నప్పుడు వారిని ప్రశ్నలు అడిగారు, ఇమామ్ వారి ప్రశ్నలంన్నీంటికీ సంతృప్తి పరిచే విధంగా సమాధానాలు ఇచ్చారు, వారందరూ సంతోషపడ్డారు, ఇమామ్ కోసం దుఆ చేశారు, వారి ప్రశంసించారు.[2]
ఇమామ్ జవాద్ వద్దకు వెళ్లిన ఆ సమూహంలో “ఇస్హాఖ్ ఇబ్నె ఇస్మాయీల్” కూడా ఉన్నారు, అతను ఇలా ఉల్లేఖించెను: నేను కూడా ఒక పత్రంపై ఇమామ్(అ.స)ను ప్రశ్నించడానికి 10 ప్రశ్నలు వ్రాసుకున్నాను. అప్పుడు నా భార్య గర్భవతి. నాలో నేను అనుకున్నాను; ఒకవేళ ఇమామ్ నా ప్రశ్నలకు సమాధానం ఇస్తే, నా భార్య గర్భవతి ఆమె కడుపులో ఉన్నది మగపిల్లాడు అయి ఉండాలని అల్లాహ్ ను కోరి ప్రార్థించమని చెప్పాలనుకున్నాను. ప్రజలు ప్రశ్నలు అడిగిన తరువాత నేను కూడా ప్రశ్నించడానికి పత్రం చేతులో పట్టుకొని నిలబడ్డాను. ఇమామ్ నన్ను చూడగానే ఇలా అన్నారు: ఓ ఇస్హాఖ్! వాడి పేరు “అహ్మద్” అని పెట్టు..., నిజంగా నా భార్య మగపిల్లాడ్ని జన్మనిచ్చింది. వాడి పేరు “అహ్మద్” అని పెట్టాను.[3]
ఇలాంటి సభల ద్వార, చర్యల ద్వార, పరిచయాల ద్వార ఇమామ్ జవాద్(అ.స) పట్ల కలిగివున్న సందేహాలు తొలగిపోయి ప్రజలకు నమ్మకం కలిగింది. వారి ఆలోచనల పై కమ్మకొని ఉన్న మబ్బులు తొలిగి యదార్థ సూర్యకాంతి ప్రకాశించింది.

ప్రతినిధులతో కమ్యూనికేషన్ నెట్‌వర్క
ఇమామ్ జవాద్(అ.స) పై ఒత్తిడీ, నిఘా ఉన్నప్పటికీ వారు తన ప్రతినిధుల ద్వార తన అనుచరులైన షియాలతో సంబంధాన్ని కాపాడుకుంటూ వచ్చారు. అబ్బాసీ అధికారం ఉన్న ప్రదేశాలన్నింటిలో ఇమామ్ తన ప్రతినిధులను నియమించారు. వారు నియమించిన ప్రతినిధులు చాలా రాష్టాలలో ఉదా: అహ్వాజ్, హమెదాన్, సీస్తాన్, బుస్త్, రయ్, బస్రా, వాసిత్, బగ్దాద్, కూఫా, మరియు ఖుమ్ లలో వ్యాపించి ఉండేవారు.

రిఫరెన్స్
1. కులైనీ, అల్ ఉసూల్ మినల్ కాఫీ, తహ్రాన్, మక్తబతుస్సదూఖ్, 1381హి, భాగం1, పేజీ 492. షైఖ్ ముఫీద్, అల్ ఇర్షాద్, ఖుమ్, మన్షూరాతు మక్తబతు బసీరతీ, పేజీ316. కొందరు అదే సంవత్సరం రజబ్ మాసం 15వ తేదీ అని వ్రాశారు.( తబర్సీ, ఎఅలాముల్ వరా, తా3, తహ్రాన్, దారుల్ కుతుబ్ అల్ ఇస్లామియ, పేజీ334).
2. మజ్లిసీ, బిహారుల్ అన్వార్, తెహ్రాన్, తా2, అల్ మక్తబతుల్ ఇస్లామియహ్, 1395హి, భాగం50, పేజీ98-100.
3. మస్ఊదీ, ఇస్బాతుల్ వసియ్యహ్, తా4, నజఫ్, అల్ మత్బఅతుల్ హైదరియహ్, 1374హి, పేజీ213-215.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 5