చోరుడి శిక్ష పై ఇమామ్ ముహమ్మద్ తఖీ[అ.స] నిదర్శనం

ఆది, 08/12/2018 - 08:31

ఒక వ్యక్తి దొంగతనం చేస్తే అతనికి ఇస్లాం పిఖా చట్టం ప్రకారం విధించబడే శిక్ష పై ఇమామ్ ముహమ్మద్ తఖీ[అ.స] యొక్క నిదర్శనం.

చోరుడి శిక్ష పై ఇమామ్ ముహమ్మద్ తఖీ[అ.స] నిదర్శనం

“జుర్ఖాన్” అనే వ్యక్తి మరియు “ఇబ్నె అబీదావూద్” అనే వ్యక్తి మధ్య మంచి స్నేహం ఉండేది. జుర్ఖాన్ ఇలా ఉల్లేఖించెను: ఒకరోజు ‘ఇబ్నె అబీదావూద్’, ‘మోతసిమ్’ దర్బారు నుండి చాలా నిరాశతో, చాలా దుఖంతో తిరిగి వచ్చాడు. కారణమేమిటని అడిగాను. ఇరవై ఏళ్ల క్రింతమే చచ్చిపోయి ఉంటే బాగుండేది అని ఈనాడు అనిపించింది! అని అన్నాడు. ఎందుకు? అని అడిగాను. ‘మోతసిమ్’ దర్బారులో అబూజాఫర్(ఇమామ్ ముహమ్మద్ తఖీ) చేసిన పని వల్ల అన్నాడు. ఏం జరిగిందో చెప్పు అని అడిగాను. అతడు ఇలా అన్నాడు: ఒకవ్యక్తి తను చేసిన దొంగతనాన్ని ఒప్పుకొని ఖలీఫాను ఇస్లాం చట్టం ప్రకారం తనను పవిత్రుడ్ని చేయమని కోరాడు. ఖలీఫా, ఫిఖా పండితులందరితో పాటు ముహమ్మద్ ఇబ్నె అలీ(ఇమామ్ ముహమ్మద్ తఖీ) ను కూడా ఆహ్వానించారు. మమ్మల్ని ఈ దొంగ చేతులను ఎక్కడి నుండి నరకాలి? అని ప్రశ్నించారు. నేను “చేతిమణికట్టు నుండి” అని అన్నాను. ఎందుకని? అని ప్రశ్నించారు. ఎందుకంటే ఖుర్ఆన్ ‘తయమ్ముమ్’ ఆయత్[మాయిదహ్:5]లో చేయి అని ఉద్దేశించి దానిని మణికట్టు వరకు అని చెప్పంది, అని అన్నాను. ఈ నిర్ణయంలో కొందరు నాతో ఏకీభవించి ఔను చోరుడి చేయి మణికట్టు వరకు నరకాలి, అని అన్నారు. కాని ఇంకొందరు “కాదు మోచేయి నుండి నరకాలి” అని అన్నారు. వారిని కూడా వారి ఈ మాట పై నిదర్శన చూపమని అన్నారు. వారు సాక్ష్యంగా ఖుర్ఆన్ యొక్క ‘ఉజూ’ ఆయత్ ను ప్రదర్శించారు. అప్పుడు మోతసిమ్, ముహమ్మద్ ఇబ్నె అలీ(ఇమామ్ ముహమ్మద్ తఖీ)ను అభిముఖిస్తూ ఇలా ప్రశ్నించాడు: ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటి? వారు “వీళ్లు చెప్పారు కదా, నన్ను మన్నించండి(నన్ను అడగకండి)” అని అన్నారు. మెతసిమ్ మీ అభిప్రాయం కూడా చెప్పాలీ అని ప్రమాణం గుర్తు చేసి చాలా ప్రాధేయపడ్డాడు.
ముహమ్మద్ ఇబ్నె అలీ(అ.స) ఇలా అన్నారు: నీవు ప్రమాణం గుర్తు చేశావు గనుక నేను నా అభిప్రాయాన్ని చెబుతున్నాను; వీళ్ళు పొరబడుతున్నారు, కేవలం చోరుడి చేతి వ్రేళ్ళను మాత్రమే నరకాలి, మిగిలిన చేతిని అలాగే ఉంచాలి. మోతసిమ్, దీని పై మీ సాక్ష్యం అని ప్రశ్నించాడు. ఇమామ్ ఇలా అన్నారు: దైవప్రవక్త[స.అ] వచనానుసారం: సాష్టాంగం(సజ్దహ్) చేసే టప్పుడు శరీరం యొక్క ఏడు భాగాలు నేలకు తాకాలి; ముఖం(నొసలు), రెండు అరచేతులు, రెండు మోకాలు, రెండు కాళ్ళు(కాలి పెద్ద వ్రేలు). ఈ విధంగా చేయిని మణికట్టు లేదా మోచేయి వరకు నరకడం వల్ల నమాజ్ ను ఆచరించడానికై చేయి ఉండదు, మరి అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: “మస్జిదులు(అనగా సజ్దహ్ చేయబడే శరీరపు ఏడు భాగాలు) కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కాబట్టి (వాటిలో) అల్లాహ్ తోపాటు ఇతరులెవరినీ పిలవకండి(అనగా అల్లాహ్ నే ప్రార్ధించండి).[జిన్:18]. అల్లాహ్ కు ప్రత్యేకించబడిన వాటిని నరకలేము.
ఇబ్నె అబీదావూద్ ఇలా అన్నాడు: మోతసిమ్, ముహమ్మద్ ఇబ్నె అలీ[అ.స] యొక్క సమాధానాన్ని సమ్మతించి చోరుడి చేతి వ్రేళ్ళు మాత్రమే నరకండి, అని ఆదేశించాడు. (అక్కడున్న వారిలో మా గౌరవం పోయింది!) నేను అక్కడే (సిగ్గుతో) చావును కోరాను.[సీరయే పీష్వాయాన్, పేజీ549]

రిఫ్రెన్స్
సీరయే పీష్వాయాన్, మహ్దీ పీష్వాయి, దారుల్ ఇల్మ్, 1388.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 32