దైవప్రవక్తలు అద్భుతాలు చేసే శక్తి కలిగి ఉంటారు

సోమ, 11/08/2021 - 16:16

దైవప్రవక్తలు అద్భుతాలు చేసే శక్తి ఎందుకు కలిగివుండాలి అన్న విషయం పై ఖుర్ఆన్ మరియు హదిస్ నిదర్శనం...

దైవప్రవక్తలు అద్భుతాలు చేసే శక్తి కలిగి ఉంటారు

దైవప్రవక్తలు అద్భుతాలు చేసే శక్తి ఎందుకు కలిగివుండాలి అన్న ప్రశ్నకు సమాధానం.

నిజమైన దైవప్రవక్తలను గుర్తించడం కోసం కొన్ని మార్గాలు ఉన్నాయి.,
1. దౌత్యం యొక్క విషయం(కంటెంట్)
2. గత ప్రవక్త చేత నిర్ధారణ మరియు మరో ప్రవక్త అవతరించబడతారు అనే శుభవార్త ఇవ్వడం
3. దైవప్రవక్తలు కలిగి ఉండే ఉత్తమ రీతి, విజ్ఞానం మరియు ప్రతిష్టతలు కలిగి ఉండడం
4. అద్భుతాలు చేసే శక్తి కలిగి ఉండడం; ఇవి దైవవాణి కలిగి ఉండం, గొప్య జ్ఞానం కలిగివుండడం, ఇస్మత్ స్థానం మొదలగు వాటి ద్వార సంభవిస్తాయి.   
అద్భుతం చేసే శక్తి కలిగివుండడం అనగా అసాధారణమైన చర్యను చేసి చూపించడడం. దీనినే అరబీ భాషలో “మేజిజా” అంటారు. ఇది అల్లాహ్ సహాయం లేకుండా సంభవించవు. ప్రవక్త చేసే అద్భుతం ఎదుటివారికి సవాల్ తో కూడి ఉంటుంది అనగా మీకు దమ్ముంటే ఇలా చేసి చూపించండి అనే సత్తా ఆ ప్రవక్తలో ఉంటుంది.

వివేకుడు మరియు సరైన స్వభావం కలిగి ఉన్నవాడు ఏదీ సాక్ష్యం లేకుండా అంగీకరించడు. ఒకవేళ ఎవరైనా సాక్ష్యం లేకుండా అంగీకరిస్తే అతడి ఈ అంగీకరణ అతడి బుద్ధి హీనతకు నిదర్శనం. అయితే దైవప్రవక్తలు తమ దౌత్యానికి నిదర్శనగా సాక్ష్యాలు చూపించడం అవసరం అందుకని దైవప్రవక్తలకు అద్భుతాలు చేసే శక్తి ఉంటుంది.
దైవప్రవక్తలు అల్లాహ్‌తో సంబంధం కలిగివున్నారు అనడానికి వారు అద్భుతాలు చేసే శక్తి కలిగివుండడం ఒక సాక్ష్యం.
అద్భుతం అనగా అప్పుడు ఆ సమయంలో ఒక దైవప్రవక్త చేసిన పనిని ఇతరులెవ్వరూ చేయలేకపోవడం. ఉదాహారణకు మరణించినవారికి ప్రాణం పోయడం, ఎటువంటి సాధనలు లేకుండా రోగుల రోగాలను నయం చేయడం మొ..
అల్లాహ్ తన దాసులకు ఎన్నో అనుగ్రహాలను ప్రసాదించాడు. వాటిలో ఒకటి “ఏ కాలంలో ఏ ఉమ్మత్‌ను కూడా మార్గదర్శకుడు లేకుండా వదిలేయలేదు”. అల్లాహ్ ఖుర్ఆన్‌లో ఇలా ప్రవచించెను: “మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము”.[సూరయె నహ్ల్, ఆయత్36.][1]

అలాగే మరో చోట ఇలా ప్రవచించెను: “మేము నీకు సత్యాన్ని ఇచ్చి, శుభవార్తను అందజేసేవానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము. హెచ్చరించేవాడు గడచి ఉండని సమాజం అంటూ ఏదీ లేదు”.[సూరయె పాతిర్, ఆయత్24]
మరోచోట ఇలా ప్రవచించెను: “తరువాత మేము మా ప్రవక్తలను ఎడతెగకుండా పంపాము”.[సూరయె మోమినూన్, ఆయత్44.][2] మానవుల కోసం మార్గదర్శిగా ఉండేదుకు.
అల్లాహ్ ఆయతులు, మాసూమీన్(అ.స) యొక్క రివాయతులు మరియు వివేకపరమైన సాక్ష్యాల ఆధారంగా భూమి ఎప్పుడు కూడా అల్లాహ్ మార్గదర్శి లేకుండా ఉండదు. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ఉపదేశించెను: “గ్రంథవహులకు చెందిన తిరస్కారులు, బహుదైవారాధకులు తమ వద్దకు స్పష్టమైన నిదర్శనం రానంతవరకూ (తమ తిరస్కార వైఖరిని) మానుకోనివారుగా ఉండేవారు”.[సూరయె బయ్యినహ్, ఆయత్01]
నిజానికి ఈ ఆయత్ అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని సూచిస్తుంది, దీని గురించి ధార్మిక సంభాషణ గ్రంథాలలో వివరంగా చెప్పబడి ఉంది. అల్లాహ్ ప్రతీ వర్గం మరియు జాతి వారి కోసం స్పష్టమైన సాక్ష్యాలు పంపుతాడు.[3] అల్లాహ్ చేత అవతరించబడ్డ మతాలు(దీన్‌లు) స్థానం మరియు ప్రతిష్టత పరంగా సమానం కాకపోయినా దైవప్రవక్తల దావా(పిలుపు) మాత్రం ఒకటే. వారందరూ అల్లాహ్ ఆరాధనకై ఆహ్వానించేవారు మరియు విగ్రాహారాధన ను నిషేదించమని కోరేవారు. “మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వార (ప్రజలారా!) ‘అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప ఇతరత్రా మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి’ అని బోధపరచాము”.[సూరయె నహ్ల, ఆయత్36]
ఎందుకంటే తౌహీద్ పటిష్టంగా లేకపోతే, సమాజం నుంచి మరియు ఆలోచనల నుంచి మిథ్యా దైవాలు బయటకు పోవు. దాంతో ఎటువంటి దిద్దుబాటు కార్యక్రమాలు ఆ సమాజంలో అమలు పరచలేము.[4]

రిఫరెన్స్
1. ఆయతుల్లాహ్ మకారిమ్ షీరాజీ, తఫ్సీరె నమూనహ్, భాగం11, పేజీ222.
2. ఆయతుల్లాహ్ మకారిమ్ షీరాజీ, తఫ్సీరె నమూనహ్, భాగం14, పేజీ245.
3. జవాదీ ఆములీ, తఫ్సీరె మౌజూయియే ఖుర్ఆన్, భాగం6, సీరయె పయాంబరాన్ దర్ ఖుర్ఆన్., తఫ్సీరె నమూనహ్, భాగం27, పేజీ202.
4. ఆయతుల్లాహ్ మకారిమ్ షీరాజీ, తఫ్సీరె నమూనహ్, భాగం11, పేజీ221.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9