దైవప్రవక్త(స.అ) పట్ల వ్యతిరేకత

బుధ, 12/01/2021 - 17:21

దైవప్రవక్త(స.అ) ఆదేశం పట్ల సహాబీయులలో కొందరి వ్యతిరేకతను సూచిస్తున్న కలం మరియు సిరా సంఘటన యొక్క సంక్షిప్త వివరణ...  

దైవప్రవక్త(స.అ) పట్ల వ్యతిరేకత

దైవప్రవక్త(స.అ) తన అంతిమ సమయంలో తన తరువాత తన ఉమ్మత్ ను మార్గభ్రష్టత నుండి కాపాడేందుకు లేఖనాన్ని వ్రాయాలనుకున్నారు. అందుకని కలం మరియు సిరాను తీసుకొని రమ్మని ఆదేశించారు. అప్పుడు ఉమర్ ఇబ్నె ఖత్తాబ్, మరి కొంతమంది సహాబీయులు దైవప్రవక్త(స.అ)కు కలం మరియు సిరా ఇవ్వడానికి నిరాకరించారు.[1]
దైవప్రవక్త(స.అ) యొక్క శ్రేష్ఠతను మరియు ఘనతను ఎవరూ గౌరవిచలేదు. చాలా కఠోరంగా ప్రవర్తించారు. చివరికి వారి పై “ఉన్మాదితనం” (హిజ్యాన్, అనారోగ్యం వల్ల మతి భ్రమించడం.) నిందను వేశారు. మరియు స్పష్టంగా దైవప్రవక్త(స.అ) యొక్క లేఖనం మనకు అవసరం లేదు మనకు అల్లాహ్ యొక్క గ్రంథమే చాలు, అని కూడా అన్నారు.
ప్రముఖ ముహద్దిస్ అయిన “ఇబ్నె అబ్బాస్” ఆ దినం చాలా కష్టమైన దినం అన్నారు. ఆ రోజు “సహాబీయులలో చాలా మంది దైవప్రవక్త(స.అ) సున్నత్
ను వ్యతిరేకించి, ఖుర్ఆన్ మనకు చాలు అని అన్నారు” అని స్పష్టంగా తెలుస్తుంది.
కాని అలీ(అ.స) మరియు దైవప్రవక్త(స.అ) అలీ(అ.స) యొక్క షియా అని సంభోదించినటువంటి కొందరు సహాబీయులు, దైవప్రవక్త(స.అ) ఆదేశాలను పాటించారు. మరియు వారు ఖుర్ఆన్
పై అమలు చేయడం ఎలా విధి అని భావించే వారో అలాగే దైవప్రవక్త(స.అ) యొక్క అన్ని ప్రవచనాలను, కార్యములను అనుచరించడాన్ని విధి అని భావించేవారు. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను:
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ أَطِيعُواْ ٱللَّهَ وَأَطِيعُواْ ٱلرَّسُولَ
అనువాదం:విశ్వసించిన ప్రజలారా! విధేయత చూపండి అల్లాహ్‌కు, విధేయత చూపండి ప్రవక్తకు...,[అల్ నిసా సూరా:4, ఆయత్:59]

ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ యొక్క అలవాట్లు ముస్లిములందరికి తెలిసినవే, ఎల్లప్పుడూ అతను దైవప్రవక్త (స.అ)తో విభేదంగా ఉండేవారు[2] నిజం చెప్పాలంటే; ఉమర్ ఇబ్నె ఖత్తాబ్, దైవప్రవక్త(స.అ) సున్నత్ పరిమితాన్ని ఓర్చుకునే వారుకాదు. మరియు పాఠకులు అతని ఖిలాఫత్ కాలంలో జారీ అయిన అహ్కాముల ద్వార అతను దైవప్రవక్త(స.అ) స్పష్ట ఆదేశాలకు వ్యతిరేకంగా ఇజ్తిహాద్ మరియు స్వయపరియాలోచన చేసేవారు, అని అర్ధం చేసుకుంటారు. (కేవలం ఇదేకాదు) అల్లాహ్ యొక్క స్పష్ట నస్స్‌ (ఆదేశాల) కు వ్యతిరేకంగా కూడా ఇజ్తిహాద్ చేసేవారు, మరియు అల్లాహ్ హలాల్ (న్యాయబద్ధమైనవి) నిబంధనలను హరామ్ (నిషిద్ధాలు)
గా మరియు హరామ్
ను హలాల్
గా నిర్ధారించేవారని కూడా తెలుసుకుంటారు.[3]
సహాబీయులలో “ఉమర్”ను సమర్దిస్తున్నవారి మార్గం కూడా ఇదే, అనీ తెలుస్తుంది. మరి అతన్ని ఇష్టపడే పూర్వీకులు మరియు వారసులు “మంచి బిద్అత్”లలో అతనినే ఫాలో అయ్యారు; ఉదా: అతనే స్వయంగా తరావీహ్
ని “మంచి బిద్అత్”[4] అని అన్నారు. తరువాయి సంభాషణాలలో “సహాబీయులు దైవప్రవక్త(స.అ) సున్నత్‌ను వదిలి ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ సున్నత్
ను అనుచరించారు” అని స్పష్టం చేయబడుతుంది.
ఖుర్ఆన్ లో దైవప్రవక్త(స.అ) పట్ల విధేయత చూపడాన్ని విధిగా ప్రకటంచబడి ఉంది. ఇది చిన్న పిల్లాడి కి కూడా అర్థమౌతింది కాని ఖేదించదగ్గ విషమేమిటంటే కొందరు పరిశోధన చేసే టప్పుడు కూడా మత పక్షపాతం కళ్ళజోడు ధరించి పరిశోధిస్తారు అందుకని యదార్థం తెలుసుకోలేక పోతారు.

రిఫరెన్స్
1. సహీ బుఖారీ మరియు ముస్లిం గ్రంథాలలలో గురువారం రోజు జరిగిన జగడంలో.
2. పరిశోధన చేసి అహ్లె సున్నత్ నుంచి షియా గా మారిన ప్రముఖ రచయిత తీజానీ సమావీ రచించిన పుస్తకం ఫస్ అలూ అహ్లజ్జిక్ర్ (فاسئلوا اھل الذکر) లో దైవప్రవక్త(స.అ) పట్ల ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ యొక్క వ్యతిరేకతను వివరంగా వ్రాయబడి ఉంది. ఈ పుస్తకమే కాదు ఇంకా చాలా పుస్తకాలలో దైవప్రవక్త(స.అ) ఆదేశాల పట్ల నిరాకరణ గురించి లిఖించబడి ఉంది.
3. “سھم مؤلفۃ القلوب، متعۃ النساء، متعۃ الحج” ను అల్లాహ్ హలాల్
గా సూచిస్తే అతను హరామ్
గా నిర్ధారించారు. అల్లాహ్ హరామ్ చేసిన మూడు విడాకులను, ఒక తలాఖ్ ద్వార హలాల్ చేశారు.
4. బిద్ అత్ అనగా దైవప్రవక్త(స.అ) కాలం లేని దానిని తరువాత కొత్తగా ఇస్లాం ఆదేశంగా నిర్ధారించడం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Mirza on

Mashaallah..... Jazakallah qibla.
All Muslims can understand the character of the Companions of the Prophet Muhammad (peace be upon him) if they do research objectively. Inshaallah.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13