ముస్లిములు, ఇస్లామీయ దేశాలలో ఉంటూ కూడా ఇస్లాంకు దూరంగా ఉండటానికి గల కారణం ఎమిటి?.
అపార కరుణామయుడు అనంత క్రుపాసీలుడైన అల్లహ్ పేరిట
వలీద్, ఇమాం హుస్సైన్[అ.స]ను తన దర్బారుకు పిలిచిన మరుసటి రోజు ఉదయం మర్వాన్ ఇబ్నె హకమ్ ఇమాం హుస్సైన్[అ.స]ను బయట చూసినప్పుడు ఇలా అన్నాడు: ఓ అబా అబ్డిల్లహ్! నేను నీ మంచి కోరేవాడను నీకో సలహా ఇస్తాను ఒకవేళ మీరు దానిని ఒప్పుకుంటే మీకే చాలా మంచిది, ఇమాం హుస్సైన్[అ.స] ఈ మాటలు విన్న తర్వాత నీ సలహ ఎమిటి అని అడిగారు. దాని జవాబుగా ఇలా అన్నాడు: నిన్న రాత్రి జరిగిన సమావేసంలో తీసుకున్న నిర్ణయం ప్రకరం, మీరు యజీద్ బైఅత్ ను స్వీకరించండి. ఈ నిర్ణయం మీ యొక్క ఇహపరలోకాలకు చాల మంచిని సమకూరుస్తుంది.
దానికి జవాబుగా ఇమాం ఈ విధంగా సెలవిచ్చారు:
إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ راجِعُونَ وَعَلَى الْإِسْلامِ السَّلامُ إِذْ بُلِيَتِ الْأُمَّةُ بِراعٍ مِثْلِ يَزيدَ وَ لَقَدْ سَمِعْتُ جَدِّي رَسُولَ اللَّهِ صلى الله عليه و آله يَقُولُ: الْخِلافَةُ مُحَرَّمَةٌ عَلى آلِ أَبِي سُفْيانَ فَإِذا رَأَيْتُمْ مُعاوِيَةَ عَلى مِنْبَرى فَابْقِرُوا بَطْنَهُ وَقَدْ رَآهُ اهْلُ الْمَدينَةَ عَلَى الْمِنْبَرِ فَلَمْ يَبْقَرُوا فَابْتَلاهُمُ اللَّهُ بِيَزيدَ الْفاسق"۔
అనువాదం: ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, యజీద్ లాంటి వ్యక్తి ఇస్లాం ధర్మానికి నాయకుడైతే ఇస్లాంకు ఇక సెలవు మరియు నేను నా పితామహులైన దైవప్రవక్త[స.అ]ను ఇలా ప్రస్తావిస్తుండగా విన్నాను: ఖిలాఫత్ అబూ సుఫుయాన్ తనయులపై హరాం చేయబడినది(నిషిద్ధించబడినది), ఒకవేళ మీరు మావియాను మింబరు పై కూర్చున్నట్టు చూస్తే వాడి పొట్టను చీల్చివేయండి, గానీ మదీనా వాసులు ఈ విధంగా చెయలేదు అందువలనే అల్లాహ్ వారిని యజీద్ లాంటి అవిధేయుడి చేతిలో చిక్కుకున్న వారి మాదిరిగా చెశాడు.[సుఖనానే హుస్సైన్ ఇబ్నె అలీ[అ.స] అజ్ మదీన తా కర్బలా, పేజీ నం:39]
ఇదేవిధంగా మీరు ఈ రోజు ఇస్లాంను ఇస్లామిక్ దేశాలలో చూసినట్లైతే ఈ తీరు మీకు కనిపిస్తుంది, ఎప్పుడైతే ఆ దేశ నాయకులు ఇస్లాంకి వ్యతిరేకంగా వ్యవహరిస్తారో అక్కడ మనకు ఇస్లాం కనబడదు మరియు మెల్లగా ఆ దేశాలలొ, ప్రతీ ఇంట్లొ ప్రతీ మనిషిలో అధర్మం మరియు అవిస్వాసం పెరిగిపోతుంది. ఎందుకు?. ఎందుకంటే వారు ఇస్లాం ఆదేశాలను విడిచారు, వాటిని సెలవు పలికారు ఎందుకు సెలవు పలికారు?, ఎందుకంటే వారు యజీద్ లాంటి దుర్మార్గుల నాయకత్వాన్ని స్వీకరించారు.
రిఫ్రెన్స్
సుఖనానే హుస్సైన్ ఇబ్నె అలీ[అ.స] అజ్ మదీన తా కర్బలా, పేజీ39.
వ్యాఖ్యలు
Jazakallah bahot acha information
Jazakallah
వ్యాఖ్యానించండి