హజ్రత్ అలీ(అ.స) ఖలీఫ-ఎ-రషీద్ -2

మంగళ, 12/14/2021 - 16:15

ముఆవియా కాలం నుండి “మర్వాన్ ఇబ్నె మొహమ్మద్ ఇబ్నె మర్వాన్” కాలం అనగా హిజ్రీ శకం 132వ సంవత్సరం వరకు  పాలకులు పీఠాల నుండి అలీ(అ.స)పై లఅనత్ చేసేవారు మరియు వారి అనుచరులను హ హతమార్చేవారు.

హజ్రత్ అలీ(అ.స) ఖలీఫ-ఎ-రషీద్ -2

ముఆవియా కాలం నుండి “మర్వాన్ ఇబ్నె మొహమ్మద్ ఇబ్నె మర్వాన్” కాలం అనగా హిజ్రీ శకం 132వ సంవత్సరం వరకు  పాలకులు పీఠాల నుండి అలీ(అ.స)పై లఅనత్ చేసేవారు మరియు అతని షియాలను చంపేవారు. ఇది వాళ్ళ రీతిగా మారింది.[1] ఆ తరువాత హిజ్రీ శకం132వ సంవత్సరంలో అధికారం అబ్బాసీయుల చేతికి వచ్చింది. మరియు “ముతవక్కిల్” కాలం అనగా 247వ సంవత్సరం వరకు ఆ వంశంలోనే అధికారం ఉండింది. బనీఅబ్బాస్ యొక్క పాలన కాలం మధ్యలో కూడా వివిధ రకాలతో హజ్రత్ అలీ(అ.స) మరియు అతని షియా పట్ల నిగూఢగా శత్రుత్వాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే అబ్బాసీయుల అధికారం అహ్లెబైత్(అ.స) మరియు వారి షియాలతో సహానుభూతి వల్ల దక్కింది అందుకని వాళ్ళు మరియు వాళ్ళ అధికారులు బహిరంగంగా అలీ(అ.స)పై లఅనత్ చేయలేరు. అలా చేయడంలోనే వాళ్ళ రాజ్యనికి సరైనది. కాని నిగూఢంగా వీళ్ళు బనీఉమయ్యాహ్
ల కన్న ఎక్కువగా పన్నాగాలు పన్నేవారు. అహ్లెబైత్(అ.స) మరియు అతని షియాల యొక్క పీడితత్వము తెలిసిపోయింది మరియు లోపలి నుండి జనంలో వాళ్ళ పట్ల సహానుభూతి ఆవేశం నిద్రలేచింది. అందుకని పాలకులు కపటం మరియు మోసంతో ఆయిమ్మయే అహ్లెబైత్(అ.స)కు దగ్గరవ్వడానికి పూనుకొన్నారు. వాళ్ళకు అహ్లెబైత్(అ.స) పట్ల ఎటువంటి ప్రేమా ఉండేది కాదు మరియు వారి హక్కు(అనగా ఖిలాఫత్ పదవి)ను అంగీకరించే వారు కాదు. అంతేకాదు వాళ్ళ ఈ మౌనం వాళ్ళ అధికారానికి ఛాలెంజ్
గా నిలుస్తుందేమోనన్న ఆ విప్లవం. అందకనే మామూన్ రషీద్, ఇమామ్ రిజా(అ.స) ను తన రాజ్యానికి యువరాజుగా నిర్ధారించాడు. కాని లోపలి పరిస్థితుల పట్ల తృప్తి చెందిన తరువాత ఇమాములు(అ.స) మరియు వారి షియాలను అవమానించడం మొదలు పెట్టాడు. అలాగే ముతవక్కిలి కూడా పరిస్థితుల అనుకూలతను చూసుకొని అలీ(అ.స) పై వైరం మరియు ద్వేషాన్ని బహిరంగంగా వ్యక్తం చేశాడు. చివరికి అతని కుమారుడు హుసైన్(అ.స) యొక్క సమాధిని కూడా త్రవించేశాడు.

ఈ విషయాలన్నీంటి మూలంగానే, మేము “అహ్లెసున్నత్ వల్ జమాఅత్”లు అహ్మద్ ఇబ్నె హంబల్ కాలం వరకు అలీ(అ.స)ను ఖలీఫాగా అంగీకరించలేదు, అని అంటాము. అహ్మద్ ఇబ్నె హంబల్ తరువాత దానిని అంగీకరించడం మొదలు పెట్టారు.
ఇంతకు ముందు చెప్పినట్లు అందరి కన్న ముందు “అహ్మద్ ఇబ్నె హంబల్” అలీ(అ.స) యొక్క ఖిలాఫత్
ను అంగీకరించారు కాని అతను దాని ద్వార అహ్లె హదీసులను సంతృప్తి పరచలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు “అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్” విధేయులు కాబట్టి, అన్న విషయం స్పష్టమైనది.
“అహ్మద్ ఇబ్నె హంబల్” యొక్క ఈ ఆలోచనను ప్రజలు ఇంత సులువుగా అంగీకరించలేరు, అని తెలుస్తుంది. దానికోసం దీర్ఘకాలం అవసరం. నిజానికి హంబలీయులు అహ్లెబైత్(అ.స)ల పట్ల న్యాయంగా ఉండడానికి మరియు వాళ్ళకు దగ్గర అవ్వడానికి కూడా ఒక కారణం ఉంది. అందేమిటంటే తమను సున్నీయుల ఇతర వర్గాలు మాలికీ, హనఫీ మరియు షాఫెయీలపై శ్రేష్ఠతను పొందాలని మరియు ఈ విధంగా తమను సమ్మతించేవారి సంఖ్యను పెంచు కోవాలని. మరి అలా చేయాలంటే ఒక అభిప్రాయాన్ని నమ్మాల్సి ఉంటుంది, అన్న విషయం తెలిసిందే.
కాలక్రమాణముతో పాటు “అహ్లెసున్నత్ వల్ జమాఅత్”లు కూడా అహ్మద్ ఇబ్నె హంబల్ చెప్పిందే చెప్పడం మొదలు పెట్టారు. మరియు అలీ(అ.స)ను నాలుగోవ ఖలీఫాగా అంగీకరించారు. మరియు ఆ మూడు ఖలీఫాలకు సంబంధించిన విషయాలు వాజిబ్ అయిన విధంగానే ఇతని పట్ల కూడా వాజిబ్, అని భావించారు, ఉదా: గౌరవించడం, రజియల్లాహు అన్హూ మొ॥ అని అనడం.
ఇదీ ముందు అహ్లెసున్నత్ వల్ జమాఅత్
ల సంబంధం, అలీ(అ.స)పై వైరంగల మరియు అతనిని అవమానించే నవాసిబ్‌లతో ఉండేది అన్న విషయం పై మంచి సాక్ష్యం కాదా?[2]

రిఫరెన్స్
1. కేవలం ఉమర్ ఇబ్నె అబ్దుల్ అజీజ్ యొక్క రెండు సంవత్సరముల ఖిలాఫత్ కాలంలో అతని పై లఅనత్ ఆపివేయబడింది కాని ఉమర్ ఇబ్నె అబ్దుల్ అజీజ్ మరణాంతరం అది మరలా మొదలయ్యింది. ఇంతటితో ఆగకుండా అలీ(అ.స) యొక్క సమాధిని త్రవించేశారు. మరియు అతని పేరును పెట్టుకోవడాన్ని హారామ్
గా నిర్ధారించారు.
2. షియయె వాఖెయి, సమావీ తీజానీ, పేజీ60.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15