అన్యాయంలో భాగ్యస్వామ్యులు

శని, 02/16/2019 - 17:09

అన్యాయంలో భాగ్యస్వామ్యులు ఇమాం జవాద్[అ.స]ల వారి ద్రుష్టిలో 

అన్యాయంలో భాగ్యస్వామ్యులు

తొమ్మిదవ ఉత్తరాధికారులైన ఇమాం జవాద్[అ.స]ల వారు ఈ విధంగా ప్రవచించారు: “అన్యాయపరుడు మరియు ఎవరైతే ఆ అన్యాయానికి తోడ్పడతారో వారు మరియు ఎవరైతే ఆ అన్యాయంతో రాజీ పడతారో వారు అందరూ ఆ అన్యాయంలో(దౌర్జన్యంలో) పాత్రులు” [కష్ఫుల్ ఘుమ్మహ్,2వ భాగం,పేజీ నం:348].
ఈ రోజు చేసే దౌర్జన్యాలు రేపటి అంధకారానికి కారణం అని అంటారు,అన్యాయపరులు ఈ లోకంలో వారు చేసే దౌర్జన్యాల వలన చరిత్రలో నిలిచిపోతారు మరియు ఆ అల్లాహ్ ఆగ్రహానికి గురవుతారు. ఎక్కడైతే ఇతరులపై అన్యాయం జరుగుతుందో అక్కడ మనము కూడా ఆ అన్యాయానికి విరుధ్ధంగా నిలబడాలి,ఒక వేళ అలా చేయలేక పోతే ఆ అన్యాయపరులతో రాజీ పడకూడదు ఒక వేళ అది కూడా చేయలేక పోతే కనీసం ఆ అన్యాయపీడితులకు అండగా నిలవాలి, చరిత్రలో మనము చూస్తాము ఎవరైతే కర్బలా గాధలో ఇమాం హుస్సైన్[అ.స]ల వారి శత్రువులకు సవారీలను(గుర్రాలను),ఆయుధాలను,ధనాన్ని వారికి ఇచ్చి ఈ దుర్మార్గంలో వారికి తమ సహయాన్నీ అందించారో మరియు ఎవరైతే ఆ రోజు ఆ దౌర్జన్యాన్ని చూసి కాముగా ఉన్నారో(రాజీ పడ్డారో) అందరూ ఆ దౌర్జన్యంలో భాగ్యస్వామ్యులు మరియు ఆ అల్లాహ్ మరియు అతని ప్రవక్త[స.అ]ల వారి ఆగ్రహానికి పాత్రులు కూడా.
ఈ రోజు కూడా ఈ దౌర్జన్యాల పరంపర కొనసాగుతున్నది,ముస్లిం దేశాలలో ముఖ్యంగా పాలస్తీనా,ఇరాక్,సిరియా,అఫ్ఘానిస్తాన్ వంటి దేశాలలో ఈ దౌర్జన్యాలు జరుగుతున్నాయి,వారి దౌర్జన్యాలకు విరుధ్ధంగా నిలబడటం ఒక ముస్లింగా మన బాధ్యత కాదా? ఇది ఆలోచించవలసిన విషయం.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7