భర్త పట్ల హజ్రత్ ఫాతెమా(స.అ) ప్రవర్తన

శని, 12/18/2021 - 19:32

హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఉత్తమ జీవిత భాగస్వామి అని నిదర్శిస్తూ చాలా రివాయతులు ఉన్నాయి, వాటి నుంచి కొన్నింటి వివరణ...

భర్త పట్ల హజ్రత్ ఫాతెమా(స.అ) ప్రవర్తన

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఉత్తమ జీవిత భాగస్వామి అని నిదర్శిస్తూ చాలా రివాయతులు ఉన్నాయి, వాటి నుంచి కొన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాము:
జీవిత భాగస్వామి పట్ల బాధ్యతగా
1. కష్టాలలో తోడూ, అనుకూలత:
ఇలా ఉల్లేఖించబడి ఉంది: అలీ(అ.స) ఫాతెమా జహ్రా(స.అ)తో “తినడానికి ఏదైనా ఉందా? అని ప్రశ్నించారు. ఫాతెమా జహ్రా(స.అ) లేదు అని సమాధానమిచ్చారు ఇలా అన్నారు; రెండు రోజుల నుంచి మీకు ఇచ్చేంత ఆహారం మాత్రమే ఉండింది, నేను ఏమి తినలేదు! అలీ(అ.స) చాలా దుఖ్ఖానికి గురి అయి ఇలా అన్నారు: చెబితే ఏదో ఒకటి చేసేవాడినిగా! అప్పుడు ఫాతెమా(స.అ) ఇలా అన్నారు: అల్లాహ్ ముందు నాకు సిగ్గుగా అనిపిస్తుంది; తీసుకొని రావడం మీకు కష్టమైన దాన్ని తీసుకొని రండి అని చెప్పెందుకు.[1]

2. జీవిత భాగస్వామికి సమన్వయం:
సూరయె దహ్ర్ యొక్క 7వ ఆయత్ యొక్క అవతరణ కారణం క్రమంలో ఇలా వివరించబడి ఉంది: అలీ(అ.స) .... తన పొరుగులో ఉండే యూదుడు అతడి పేరు షంవూన్ మరియు ఉన్ని పని చేసేవాడు, అతడి వద్దకు వెళ్లి ఇలా అన్నారు: కొంత ఉన్ని ఇస్తావా మూడు సాఅ(దాదాపు 9 కిలో) బార్లీకి బదులు ముహమ్మద్(స.అ) కుమార్తె దాన్ని నేస్తుంది?! ఆ యూదుడు ఒప్పుకున్నాడు. అలీ ఉన్నీ మరియు (9 కిలో) బార్లీ తీసికొని ఇంటికి తిరిగి వచ్చారు. ఫాతెమా జహ్రా(స.అ)తో జరిగింది చెప్పారు. ఫాతెమా జహ్రా(స.అ) ఆ ఉన్ని నుంచి మూడవ వంతు నేసిన తరువాత దాదాపు మూడు కిలోల బార్లీ గింజలను పిండి చేసి దాంతో ఐదు రొట్టెలు తయారు చేశారు.[2]

3. భర్త అవసరాల పట్ల శ్రద్ధ:
హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) తన భర్త కోసం శరీర రక్షణ మరియు యుద్ధ సమయాలలో రక్షణ కోసం మంచి బట్టలు కుట్టేవారు.[3]

4. ఇంటి పరిస్థితులను రహస్యంగా ఉంచడం:
రివాయత్ లో ఇలా ఉల్లేఖించబడి ఉంది: ఒకరోజు హజ్రత్ ఫాతెమా(స.అ) తన తండ్రి వద్దకు వెళ్లారు, అప్పుడు ఆమె ముఖం పై ఆకలితో ఉన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దైవప్రవక్త(స.అ) ఆమెను ఆ పరిస్థితిలో చూసి చేతులు ఆకాశం వైపుకు ఎత్తి ఇలా అన్నారు: ఓ అల్లాహ్! నా బిడ్డ ఆకలిని కడుపు నింపుతో మార్చివేయి, ఆమె పరిస్థితి మెరుగు పరుచు.[4]
ఔను! హజ్రత్ జహ్రా(స.అ) తన ఇంట్లో ఉన్న పరిస్థితుల పట్ల ఎప్పుడు కూడా ఎవరి ముందు పిర్యాదు చేసేవారు కాదు. ఇది ఆమెకు తన భర్త పట్ల ఉన్న గౌరవం, నమ్మకం. భర్త గౌరవాన్ని తన గౌరవంగా భావించడం.

చివరిమాట: హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) గురించి వివాహం తరువాత రోజు దైవప్రవక్త(స.అ) ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ద్వారానే మీరు ఆమె గురించి తెలుసుకోవచ్చు. దైవప్రవక్త(స.అ) అలీ(అ.స)తో జహ్రా(స.అ) నీకు ఎలా అనిపించింది? (నీకు ఎలా తోడ్పడింది2.) హజ్రత్ అలీ(అ.స): ఫాతెమా(స.అ) అల్లాహ్ ఆరాధనలో ఉత్తమ తోడుగా అనిపించింది.[5].
ఎవరైతే అల్లాహ్ ఆరాధన పట్ల ప్రమాణకరంగా ఉంటారో వారు మిగత విషయాలలో కూడా ఖచ్చితంగా మరియు న్యాయంగా ఉంటారు.
ఈనాటి స్ర్తీలు ఆమె జీవిత చరిత్రను తెలుసుకొని దాని పై నడుచుకోవడం చాలా అవసం. ఆమె జీవిత చరిత్ర స్ర్తీలందరికి ఒక ఉత్తమ నమూనా.          

రిఫరెన్స్
1. కూఫీ, ఫురాత్ ఇబ్నె ఇబ్రాహీమ్, తఫ్సీరె ఫూరాతుల్ కూఫీ, పేజీ83, తెహ్రాన్, మొఅస్ససతుత్తబఅ వన్నష్ర్ ఫీ విజారతిల్ ఇర్షాదిల్ ఇస్లామీ, 1410ఖ.
2. సదూఖ్ మొహమ్మద్ ఇబ్నె అలీ, అమాలీ, పేజీ257, తెహ్రాన్, కితాబ్చీ, చాప్6, 1376ష, బిహారుల్ అన్వార్, భాగం35, పేజీ237.
3. ఇబ్నె షహ్రె ఆషూబె మాజిందరానీ, మొహమ్మద్ ఇబ్నె అలీ, మనాఖిబె ఆలె అబీతాలిబ్(అ.స), భాగం3, పేజీ246ఖుమ్, అల్లామా, 1379ష.
4. బిహారుల్ అన్వార్, అల్లామా మజ్లిసీ, భాగం43, జల్వహాయె రఫ్తారియె హజ్రత్ జహ్రా(స.అ).
5. బిహారుల్ అన్వార్, అల్లామా మజ్లిసీ, భాగం43, పేజీ117, జల్వహాయె రఫ్తారియె హజ్రత్ జహ్రా(స.అ).

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 15 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10