హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఉత్తమ గృహిణి అని నిదర్శిస్తూ చాలా రివాయతులు ఉన్నాయి, వాటి నుంచి కొన్ని రివాయతుల వివరణ...
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఉత్తమ గృహిణి అని నిదర్శిస్తూ చాలా రివాయతులు ఉన్నాయి, వాటి నుంచి కొన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాము:
1. పని పంపకం:
ఇలా ఉల్లేఖించబడి ఉంది; దైవప్రవక్త(స.అ) ఫిజ్జాను హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) వద్దకు పని చేయడానికి తీసుకొచ్చినప్పుడు, హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఆమెతో పిండి తయారు చేయడం మరియు రొట్టె కాల్చడం ఈ రెండింటిలో ఏది చేస్తావు అని అడిగారు, ఆమె పిండి తయారు చేస్తాను అని అన్నారు.[1] అలాగే పని పంపకం విషయంలో వంట పని హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) చేస్తే ఇంటి పని; కట్టేలు సేకరించడం, ఇంటిని తుడవడం వంటివి హజ్రత్ అలీ(అ.స) చేసేవారు.[2]
2. శ్రమ:
రివాయతులనుసారం, హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఎంతెలా నీళ్లు తోడేవారంటే దాని ప్రభావం ఆమె ఆ శరీర భాగంపై ఉండిపోయింది. పిండి రుబ్బీ రుబ్బీ ఆమె చేతులు కందుకుపోయేవి.[3]
అలాగే మరో రివాయత్ లో ఇలా ఉల్లేఖించబడి ఉంది: దైవప్రవక్త(స.అ) తన కుమార్తె హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ)ను ఒంటె చర్మపు అంగీని ధరించి ఒక చేత్తో పిండి రుబ్బుతూ మరో చేత్తో పిల్లాడ్ని పాలు పట్టిస్తుండగా చూసి వారి కళ్ళలో నీళ్లు వచ్చాయి. వారు హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ)తో ఇలా అన్నారు: “తల్లీ! ఇహలోక చేదును పరలోక తీపికి బదులుగా నిర్ధారించు” హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ): ఓ దైవప్రవక్త! అల్లాహ్ ప్రసాదించిన లెక్కలేనివన్ని అనుగ్రహాలను అల్లాహ్ నాకు బహుమదిగా ఇచ్చినందుకు, నేను ఆయన పట్ల కృతజ్ఞత కలిగివున్నాను, నేను ఆయన చూపించిన ప్రేమ పట్ల కృతజ్ఞతను తెలుపుకుంటున్నాను. అప్పుడు ఈ ఆయత్: "وَ لَسَوْفَ یُعْطیکَ رَبُّکَ فَتَرْضى”[4] దైవప్రవక్త(స.అ) పై అవతరించబడి.[5]
అలాగే సల్మానె ఫార్సీ వచనానుసారం; హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) రోకలిలో బార్లీ గింజలు రుబ్బుతున్నారు చేతులు గాయపడి ఉన్నాయి మరియు హుసైన్(అ.స) ఒక మూల కూర్చొని ఏడుస్తున్నారు. నేను ఆమెతో ఇలా అన్నాను: ఓ దైవప్రవక్త(స.అ) కుమార్తె! ఫిజ్జా ఖాళీగా ఉంది, మీ చేతులు పని చేయడం వల్ల గాయపడ్డాయి! హజ్రత్ ఫాతెమా(స.అ) ఇలా అన్నారు: దైవప్రవక్త(స.అ) నాకు ఇలా ఆదేశించారు ఇంటి పని ఒక రోజు నువ్వు చేసి ఒక రోజు ఆమె(ఫిజ్జా) చేస్తుంది. ఆమె నిన్న పని చేసింది. నేను హజ్రత్ ఫాతెమా(స.అ)తో నేను మీ తండ్రి చేత బానిసత్వం నుంచి స్వేచ్చను పొందినవాడ్ని! అనుమతివ్వండి, పిండి రుబ్బనివ్వండి లేదా హుసైన్(అ.స)ను శాంతి పరచనివ్వండి. అన్నాను. అప్పుడు ఫాతెమా(స.అ), నేను హుసైన్(స.అ)ను చూసుకుంటాను నువ్వు పిండి రుబ్బు అని అన్నారు. నేను కొంత సేపు రుబ్బిన తరువాత నమాజ్ సమయం అయ్యింది, నేను లేచి వెళ్లి దైవప్రవక్త(స.అ)తో పాటు నమాజ్ చదివి, నమాజ్ తరువాత చూసిందంతా అలీ(అ.స)తో చెప్పాను, వారు కన్నింళ్లు పెట్టుకున్నారు. అక్కడ నుంచి వెళ్లిపోయారు, కొంత సమయం గడిచాక వారు నవ్వుతూ తిరిగి వచ్చారు. దైవప్రవక్త(స.అ) అలీ(అ.స)తో సంతోషానికి కారణం అడిగారు?! అలీ(అ.స) ఇలా సమాధానమిచ్చారు: నేను ఫాతెమా(స.అ) వద్దకు వెళ్లాను. ఆమె పడుకొని ఉన్నారు ఆమె గుండెలపై హుసైన్(అ.స) నిద్రపోతున్నాడు. రోకలి తనకు తానుగా తిరుగుతుంది. దైవప్రవక్త(స.అ) చిన్నగా నవ్వుతూ ఇలా అన్నారు: ఓ అలీ(అ.స)!, అల్లాహ్ భూమిపై చాలా దూతలను ప్రళయదినం వరకు ముహమ్మద్(స.అ) వ ఆలె ముహమ్మద్(అ.స) సేవ కోసం ఉంచాడు అని నీకు తెలుసా.[6]
3. సాధారణ జీవితం:
రివాయతులనుసారం; ఇమామ్ అలీ(అ.స) మరియు హజ్రత్ ఫాతెమా(స.అ) ఇంట్లో పరుచుకునేందుకు చిన్న (జంతు చర్మపు) ముక్క ఉండేది ఉన్ని ఉన్న వైపు నిద్రపోయేవారు.[7] వారి తలగడ కర్జూలపు ఆకులతో నింపబడిన చర్మంతో చేసినది.[8]
రిఫరెన్స్
1. మువహ్హిదె అబ్తహీ, మొహమ్మద్ బాఖిర్, అవాలిము ఉలూమ్, భాగం11, పేజీ1043, ఖుమ్, మొఅస్ససతుల్ ఇమామ్ అల్ మహ్దీ(అ.స), 1413ఖ.
2. తూసీ, అమాలీ, పేజీ661, ఖుమ్, దారుస్సిఖాఫహ్, 1414ఖ.
3. ఇబ్నె బాబ్ వై, మొహమ్మద్ ఇబ్నె అలీ, మన్ లా యహ్జుర్, భాగం1, పేజీ 321, ఖుమ్, దఫ్తరె ఇంతెషారాతె ఇస్లామీ, చాప్2, 1413ఖ.
4. సూరయె జుహా, ఆయత్05.
5. సఅలబీ నైషాబూరీ, అహ్మద్ బిన్ ఇబ్రాహీమ్, అల్ కష్ఫు వల్ బయాన్, భాగం10, పేజీ225, బీరూత్, దారు ఇహ్యాయిల్ తురాస్ అల్ అరబీ, 1422ఖ.
6. ఖుత్బుద్దీన్ రావంది, సయీద్ ఇబ్నె హిబతుల్లాహ్, అల్ ఖరాయిజ్ వల్ జరాయిహ్, భాగం2, పేజీ530, ఖుమ్, మొఅస్ససతు ఇమామ్ మహ్దీ(అ.స), 1409ఖ.
7. హిమ్యరీ, అబ్జుల్లాహ్ ఇబ్నె జాఫరీ, ఖుర్బుల్ అస్నాద్, పేజీ112, ఖుమ్, మొఅస్ససయె ఆలుల్ బైత్(అ.స), 1413ఖ.
8. ఇబ్నె తావూస్, అలీ ఇబ్నె మూసా, అద్దురూవుల్ వాఖియహ్, పేజీ275, బీరూత్, మొఅస్ససతు ఆలుల్ బైత్(అ.స), 1415ఖ.
వ్యాఖ్యలు
Jazakallah, qibla... Please update some more riwayaats. Thanks.
Jazakallah
వ్యాఖ్యానించండి