తండ్రి తరువాత ఫాతెమా జహ్రా(స.అ) సీరత్

సోమ, 01/03/2022 - 18:25

దైవప్రవక్త(స.అ) తరువాత హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) సీరత్ గురించి హదీస్ గ్రంథాలలో వివరించబడి ఉన్న కొన్ని అంశాలు....

తండ్రి తరువాత ఫాతెమా జహ్రా(స.అ) సీరత్

1. తండ్రి కోసం శోకం
హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: నేను దైవప్రవక్త(స.అ)ను వారి దుస్తులలోనే గుస్ల్ ఇచ్చాను. ఫాతెమా(స.అ) ఇలా అంది: ఆ బట్టలు నాకు చూపించు. ఆ దుస్తుల వాసన చూసి స్పృహ తప్పిపోయారు. ఆమెను ఇలా చూసి నేను ఆ వార దుస్తులను దాచేశాను.[1]
2. యదార్థ రక్షణ కోసం నామహ్రమ్ తో మాట్లడడం
ఒక స్ర్తీ యొక్క అత్యుత్తమ స్థితి ఆమె పరాయి పురుషుడ్ని చూడకూడదు మరియు పరాయి పురుషుడు ఆమెను చూడకూడదు అని ఉపదేశించిన హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ), సమాజంలో మార్గభ్రష్టతను చూసినపుడు మరియు హజ్రత్ అలీ(స.అ) యొక్క హక్కును వారి నుంచి చేదించినపుడు ఇంటి నుంచి బయటకు వచ్చి బహిరంగంగా జనంతో మాట్లాడారు.
3. బయటకు వచ్చినప్పుడు మఖ్నఅ ధరించడం
హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ), అబూబక్ర్ మరియు ప్రజలతో మాట్లాడడానికి మస్జిదుకు వెళ్లినపుడు తన తలను గుడ్డతో కప్పుకున్నారు.[2] వారు తల పై వేసుకున్న ఆ గుడ్డ గురించి రివాయత్ లో ఇలా ఉంది, ఆమె వేసుకున్న ఆ గుడ్డ ఆమె మేచేతుల వరకు ఉంది.[3]
4. గుడ్డను చుట్టుకోవడం(పరదా చేయడం)
హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఉపన్యాసం ఇవ్వడానికి మస్జిద్ వైపు వెళ్లినప్పుడు ఒక గుడ్డను తల నుంచి కాళ్ళ వరకు చుట్టుకున్నారు(పరదా చేసుకున్నారు).[4]
5. చూపులకు కనబడకుండా ఉండడం
ఆమె ఎవరికీ కనబడకుండా ఉండేందు తమ సహాయకురాలు మరియు తమ సమూహానికి చెందిన స్ర్తీల మధ్య నుంచి నడిచేవారు.[5]
6. భర్త కష్టాలను దూరం చేయడం
హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) యొక్క ప్రవర్తన ద్వార తెలిసే విషయమేమిటంటే ఆమె ప్రవర్తన వల్ల ఆమె భర్త యొక్క దుఖ్ఖం దరమయ్యేది. హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: నేను ఆమెను చూసేవాడిని, ఆ చూపు నా దుఖ్ఖాలను నా నుంచి దూరం చేసేది.[6]
7. భర్త ఆగ్రహానికి గురికాకుండా చూసుకోవడం
హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: ఎప్పుడు కూడా నన్ను ఆగ్రహానికి గురి చేయలేదు....[7]
8. జీవిత భాగస్వామిని నిరాశ చేయకూడదు
హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: అల్లాహ్ సాక్షిగా!, నేను ఫాతెమాను ఆగ్రహానికి గురి చేయలేదు. ఆమె జీవితాంతం ఏ పనిపై బలవంతం చేయలేదు. ఆమె కూడా నన్ను ఎప్పుడూ ఆగ్రహానికి గురి చేయలేదు. నా మాటను ఎప్పుడూ కాదనలేదు. నేను ఆమెను చూసేవాడిని, దాంతో నాలో ఉన్న దుఖ్ఖం పోయేది.[8]
9. భర్త పట్ల అవిధేయత నిషిద్ధం
భార్య, తన భర్త మాటను పాటించాలి, నిరాకరించకూడదు. హజ్రత్ అలీ(అ.స) ఆమె గురించి ఇలా అన్నారు.. ఆమె ఎప్పుడు కూడా నా మాటను నిరాకరించలేదు.[9] హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) చివరి క్షణాలలో తన భర్త అయిన హజ్రత్ అలీ(అ.స)తో ఇలా అన్నారు: ఓ అలీ(అ.స) నువ్వు నాతో జీవితం మొదలు పెట్టినప్పటి నుంచి నేను నీ మాటను నిరాకరించలేదు(నీ పట్ల అవిధేయత చూపలేదు)[10]
10. భర్త అనుమతి లేకుండా బయటకు వెళ్లడం
తన హక్కు తిరిగి తీసుకోవడం కోసం కూడా హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) తన భర్త అనుమతి లేకుండా బయటకు వెళ్లలేదు. ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) ఉల్లేఖనం: అలీ(అ.స) ఫాతెమాతో ఇలా అన్నారు: వెళ్లు, వెళ్లి దైవప్రవక్త(స.అ) అయిన నీ తండ్రి ఆస్తిని అడుగు. ఫాతెమా(స.అ) అబూబక్ర్ వద్దకు వచ్చి ఇలా అన్నారు: .....[11]
11. భర్త పట్ల వినయం
అబూబక్ర్ మరియు ఉమర్ ఆమెను పరామర్శించడానికి వచ్చినప్పుడు ఆమె వాళ్ళతో కలవడానికి ఇష్టం లేదు అని అన్నప్పుడు వాళ్లు హజ్రత్ అలీ(అ.స)ను ఆశ్రయించారు. ఆమె అలీ(అ.స)తో ఇలా అన్నారు: ఈ ఇల్లు నీ ఇల్లు, నేను నీ దాసిని.
12. షియాల కోసం దుఆ చేయడం
అస్మా ఉల్లేఖనం: హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) చివరి క్షణాలలో ఆమెను ఇలా దుఆ చేస్తుండగా చూశాను: “ఓ అల్లాహ్, ఓ ప్రభూ! మా అనుచరులను(షియాలను) మరియు వారి సంతానాన్ని క్షమించు.[12]
13. నమాజ్ కోసం ప్రత్యేక దుస్తులు
హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) తన చివరి క్షణాలలో అస్మాతో ఇలా అన్నారు: నేను నమాజ్ చేసుకునే నా దుస్తులను తీసుకొని రా, నా వద్ద కూర్చో, నమాజ్ సమయం రాగానే నన్ను పిలూ, ఒకవేళ లేస్తే పరవలేదు లేకపోతే ఎవరినైనా అలీ(అ.స) వద్దకు పంపు...[13]
14. పవిత్రత మరియు హిజాబ్
అస్మా ఉల్లేఖనం: హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) తన అంతిమ రోజులలో నాతో ఇలా అన్నారు: మరణించిన తరువాత స్త్రీల జనాజాను పైనుంచి తెరిచి ఉంచి కేవలం గుడ్డ కప్పడంతో శరీరం కనబడే విధంగా ఉండడం నాకు నచ్చదు. నన్ను అలా తీసుకెళ్లవద్దు. నా శరీరాన్ని కనబడకుండా కప్పివేయి అల్లాహ్ నిన్ను నరకాగ్ని నుంచి దూరంగా ఉంచుగాక.[14]
హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) అలీ(అ.స)తో ఇలా అన్నారు: దైవదూతలు నాకు నేర్పించినట్లు నాకోసం ఒక శవపేటికను తయారు చేయి.[15]

రిఫరెన్స్
1. బిహారుల్ అన్వార్, భాగం43, పేజీ157.
2. ఎహ్తెజాజె తబర్సీ, ఎహ్తెజాజాతె ఫాతెమా జహ్రా(స.అ), పేజీ131-132.
3. మకారిముల్ అఖ్లాఖ్, తబర్సీ, పేజీ93.
4. ఎహ్తెజాజె తబర్సీ, భాగం1, పేజీ131.
5. ఎహ్తెజాజె తబర్సీ, భాగం1, పేజీ131.
6. మనాఖిబె ఖారజ్మీ, పేజీ353.
7. మనాఖిబె ఖారజ్మీ, పేజీ353.
8. బిహారుల్ అన్వార్, భాగం43, పేజీ134.
9. బిహారుల్ అన్వార్, భాగం43, పేజీ134.
10. బిహారుల్ అన్వార్, భాగం43, పేజీ191.
11. బిహారుల్ అన్వార్, భాగం29, పేజీ207.
12. జఖాయిరుల్ ఉఖ్బా, పేజీ53.
13. కష్ఫుల్ గుమ్మహ్, భాగం2, పేజీ122.
14. కష్ఫుల్ గుమ్మహ్, భాగం2, పేజీ126.
15. బిహారుల్ అన్వార్, భాగం43, పేజీ192.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
15 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 27