హజ్రత్ మహ్దీ[అ.స] అధికారాన్ని షియా మరియు అహ్లె సున్నత్ వర్గాల వారు, వారి రాకతో ఎలాగైతే అన్యాయం మరియు దుర్మార్గాలతో నిండి ఉందో అలాగే ప్రపంచం న్యాయధర్మాలతో నిండిపోతుంది, అని నమ్మతారు.
![ఇమామ్ మహ్దీ[అ.స] అధికారం](https://te.btid.org/sites/default/files/field/image/25.jpg)
అల్లాహ్ ఖుర్ఆన్ యొక్క 24వ సూరహ్ 55వ ఆయత్ లో ఇలా ప్రవచించెను: “మీలో ఎవరైతే విశ్వసించి, మంచి పనులు చేశారో వారికి అల్లాహ్, వారి పూర్వీకులను భూమి పై ప్రతినిధులుగా చేసినట్లు గానే వారికి కూడా తప్పకుండా ప్రాతినిధ్యం ప్రసాదిస్తానని, తాను వారి కోసం సమ్మతించి ఆమోదించిన ధర్మాన్ని వారి కొరకు తప్పకుండా పటిష్టం చేసి, దానికి స్థిరత్వాన్ని కల్పింస్తానని, వారికున్న భయాందోళనల స్థానే తప్పకుండా శాంతిభద్రతల స్థితిని కల్పిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు”[నూర్:55]
ఈ ఆయత్ లో అల్లాహ్ చెప్పదలుచుకున్న విషయమేమిటంటే: అల్లాహ్, విశ్వసించి మంచి పనులు చేసేవారితో భూమి పై అధికారాన్ని, సమ్మతించబడ్డ ధర్మన్ని పటిష్టం చేస్తానని మరియు పూర్తి శాంతిభద్రతలు కలిపిస్తానని వాగ్దానం చేసెను.
ఈ ఆయత్ లో ఉద్దేశబడ్డ ఆ సమూహం ఏ సమూహం అని ఖుర్ఆన్ వ్యాఖుల మధ్య అభిప్రాయబేధం ఉంది. కొందరు దైవప్రవక్త[స.అ] కాలంలో అధికారం వారి చేతికి వచ్చింది కాబట్టి, దైవప్రవక్త[స.అ] సహాబీయులని అంటారు. కొందరు దైవప్రవక్త[స.అ] కాలం తరువాత నాలుగు ఖలీఫాల అధికార కాలం అని అంటారు. కొందరు దీని అర్ధాన్ని చాలా వైశాల్యంగా తీసుకుంటారు అందుకు వారు భూమి పై ఉన్న ఈ గుణాలు కలిగి ఉన్న ముస్లిములందరూ అని అంటారు. మరి కొందరు తూర్పూపడమరలను ఒకే అధికారం క్రింద చేసే హజ్రత్ ఇమామ్ మహ్దీ[అ.స] అధికారం అని అంటారు. హజ్రత్ మహ్దీ[అ.స] అధికారంలో అన్ని చోట్లలో సరైన ధర్మం కనిపిస్తుంది, భయాందోళనలు మరియు యుద్ధాలు భూమి పై కనిపించవు, మానవులందరి ప్రార్ధనలు విగ్రాహారాధనల నుండి పవిత్రమవుతాయి. అప్పుడు ఈ ఆయత్ అన్ని విధాలుగా తన అర్ధాన్ని పొందుతుంది. హజ్రత్ మహ్దీ[అ.స] అధికారాన్ని ఇరువర్గాల వారు, వారి రాకతో ఎలాగైతే అన్యాయం మరియు దుర్మార్గాలతో నిండి ఉందో అలాగే ప్రపంచం న్యాయధర్మాలతో నిండిపోతుంది, అని నమ్మతారు.[తఫ్సీరె నమూనహ్, సూరయే నూర్ ఆయత్55 వ్యాఖ్యానంలో]
రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ నాసిర్ మకారిమ్ షీరాజీ, తఫ్సీరె నమూనహ్, సూరయే నూర్ ఆయత్55 వ్యాఖ్యానంలో.
వ్యాఖ్యలు
Maahalla
Shukriya site par aakar comment k zariye himmat afzaei karne ka ...
Jazakallah.
Masha Allah
Shukriya... iltemase dua.
Mashaallah
Shukriya.. Jazakallah
వ్యాఖ్యానించండి