హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ప్రతిష్టత హదీసులలో

ఆది, 12/19/2021 - 15:09

దైవప్రవక్త(స.అ) కుమార్తె అయిన హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ప్రతిష్టతను నిదర్శిస్తున్న ఇతర పవిత్ర మాసూముల హదీసులు...

హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ప్రతిష్టత హదీసులలో

1. హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) పట్ల జ్ఞానం యొక్క ప్రాముఖ్యత
ఇమామ్ సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: ఫాతెమా(అ.స) యొక్క యదార్థాన్ని అర్థం చేసుకున్నవాడు నిస్సందేహంగా షబే ఖద్ర్ ను అర్ధం చేసుకున్నట్లే.[1]

2. హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) పట్ల ప్రేమ యొక్క ప్రభావం:
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: నా కుమార్తె ఫాతెమా(స.అ) ను ఇష్టపడేవాడు, స్వర్గంలో నాతో ఉంటాడు మరియు ఎవరైతే ఆమె పట్ల వైరం కలిగివుంటారో (నరక) అగ్నిలో ఉంటాడు.[2]  

3. హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) పట్ల విధేయత:
హజ్రత్ ఇమామ్ బాఖిర్(అ.స) ఉల్లేఖనం: అల్లాహ్ సృష్టతాలు జిన్నాతులు, మానవులు, పక్షలు, మృగాలు, ప్రవక్తలు మరియు దూతలందరి పై హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) పట్ల విధేయత తప్పనిసరి(వాజిబ్).[3]

4. హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) యొక్క ఆదేశాలు:
దైవప్రవక్త(అ.స) ఉల్లేఖనం: ఓ అలీ! ఫాతెమా(అ.స) ఆదేశాలను పాటించు., ఎందుకంటే నేను జిబ్రయీల్ నన్ను ఆదేశించినవాటినే ఆమెకు ఆదేశించాను.[4

5. హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) యొక్క సృష్టి:
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: నిస్సందేహంగా ఫాతెమా జహ్రా(స.అ) మనిషి రూపంలో సృష్టించబడిన ఒక హూరియా (అల్లాహ్ యొక్క ప్రత్యేక దూత)[5]

6. హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) యొక్క పేరు ఫాతెమా పెట్టడానికి కారణం:
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: నా కుమార్తె ను ఫాతెమా అని నామకరించాను; కారణం అల్లాహ్ ఫాతెమా మరియు ఆమె ను ఇష్టపడేవారందరినీ, నరకాగ్ని నుంచి దూరంగా ఉంచాడు.[6]

7. హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) యొక్క పేరు ప్రభవం:
ఇమామ్ మూసా కాజిమ్(అ.స) ఉల్లేఖనం: ఒక ఇంట్లో ముహమ్మద్ లేదా అహ్మద్, లేదా అలీ లేదా హసన్ లేదా హుసైన్ లేదా జాఫర్ లేదా తాలిబ్ లేదా అబ్దుల్లాహ్ మరియు అలాగే ఆడవాళ్ళలో ఫాతెమా అని పేరు ఉంటే, దరిద్రం (మరియు లేనితనం) ఆ ఇంట్లో రాదు.[7]

8. హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) పేరు పట్ల గౌరవం:
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) తన కుమార్తె పేరు ఫాతెమా అని పెట్టిన వ్యక్తితో ఇలా అన్నారు: ఈమె పేరు ఫాతెమా పెట్టుకున్నావు కాబట్టి, ఇక ఈమెను తిట్టకూ, దూషించకు మరియు కొట్టకు.[8]

9. ఉత్తమ నమూనా:
పన్నెండవ ఇమామ్, హజ్రత్ ఇమామ్ మహ్దీ(అ.స) ఉల్లేఖనం: దైవప్రవక్త(స.అ) కుమార్తె నాకు ఉత్తమ నమూనా.[9]

10. మంచి సహాయకురాలు:
 దైవప్రవక్త(స.అ) అలీ(అ.స)తో జహ్రా(స.అ) నీకు ఎలా అనిపించింది? (నీకు ఎలా తోడ్పడింది?) హజ్రత్ అలీ(అ.స): ఫాతెమా(స.అ) అల్లాహ్ ఆరాధనలో ఉత్తమ తోడుగా అనిపించింది.[10].

11. ప్రజలందరిలో ప్రియమైనవారు:
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: ఫాతెమా(స.అ) ప్రజలందరిలో నాకు చాలా ప్రియమైనది.[11]

12. కనుల కాంతి మరియు హృదయ ఫలం:
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: నిస్సందేహంగా ఫాతెమా(స.అ) నా శరీర భాగం, నా కనుల కాంతి మరియు నా హృదయ ఫలము.[12]

13. హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) యొక్క ఆగ్రహం:
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: నిస్సందేహముగా ఫాతెమా(స.అ) నిరాశ పడడం వల్ల అల్లాహ్ నిరాశ పడతాడు.[13]

14. హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) శత్రువులు నిలయం:
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: ఓ ఫాతెమా! ఒక వేళ అల్లాహ్ చేత అవతరించబడిన ప్రవక్తలందరూ మరియు ఆయన అతిసామిప్యం గల దూతలందరూ, నీ హక్కును అన్యాయంగా దోచుకున్న కపటవర్తనుల గురించి షిఫాఅత్ కోరినా, ఎట్టిపరిస్థితిలో అల్లాహ్ వాడ్ని (నరక)అగ్ని నుంచి బయటకు తీయడు.[14]

15. ప్రకాశవంతమైన నక్షత్రం:
హజ్రత్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: ఫాతెమా(స.అ) ఈహలోక స్ర్తీలలో ప్రకాశవంతమైన నక్షత్రం.[15]

రిఫరెన్స్
1. బిహారుల్ అన్వార్, భాగం43, పేజీ65.
2. బిహారుల్ అన్వార్, భాగం27, పేజీ116.
3. దలాయిలుల్ ఇమామహ్, పేజీ28.
4. బిహారుల్ అన్వార్, భాగం22, పేజీ484.
5. బిహారుల్ అన్వార్, భాగం78, పేజీ112.
6. ఉయూను అఖ్బార్ అల్ రిజా(అ.స), భాగం5, పేజీ46.
7. కాఫీ, భాగం6, పేజీ19.
8. కాఫీ, భాగం6, పేజీ48.
9. బిహారుల్ అన్వార్, భాగం53, పేజీ180.
10. బిహారుల్ అన్వార్, భాగం43, పేజీ117.
11. అల్ అమాలీ, షేఖ్ ముఫీద్, పేజీ289.
12. అల్ అమాలీ, షేఖ్ ముఫీద్, పేజీ486.
13. అల్ అమాలీ, షేఖ్ ముఫీద్, పేజీ94.
14. బిహారుల్ అన్వార్, భాగం76, పేజీ354.
15. కాఫీ, భాగం1, పేజీ195.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11