బనీ ఉమయ్యాహ్ అధికారుల దౌర్జన్యాలు

శుక్ర, 01/28/2022 - 14:33

దైవప్రవక్త(స.అ) మాసూమ్ కాదు అని చెప్పి ఖురైషీయులు, “అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్‌”కు దైవప్రవక్త(స.అ) హదీసులను వ్రాయనివ్వకుండా ఆపివేశారు...

బనీ ఉమయ్యాహ్ అధికారుల దౌర్జన్యాలు

అసత్యాన్ని సత్యంగా మరియు సత్యాన్ని అసత్యంగా ఎలా మార్చేస్తారో. మరి ఎప్పడైతే దైవప్రవక్త(స.అ) మరియు అతని ఇత్రత్(అ.స) పట్ల ప్రేమ కలిగి ఉన్న వారిని “రాఫిజీ మరియు బిద్అతీయుల” అని చెప్పడం జరిగిందో. బిద్అతీయులను, దైవప్రవక్త(స.అ) సున్నత్ మరియు ఇత్రత్(అ.స)
ను వదిలినవారిని మరియు దుర్మార్గపు పాలకుల స్వయపరియాలోచన పై అమలు చేసేవారిని “అహ్లెసున్నత్ వల్ జమాఅత్” అని చెప్పడం జరిగిందో. ఇక ఇంతకన్న ఎక్కువ ఆశ్చర్యపడవలసిన విషయం ఏమైఉంటుంది.
ఇలాంటి వారిని అహ్లెసున్నత్ అని పేరు ఇవ్వడంలో ఖురైషీయుల హస్తం ఉంది, ఎందుకంటే అందులో ఖురైషీయుల విజయం ఉంది.
దైవప్రవక్త(స.అ), మాసూమ్ కాదు, అని చెప్పి ఖురైషీయులు, “అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్‌”కు దైవప్రవక్త(స.అ) హదీసులను వ్రాయనివ్వకుండా ఆపివేశారు, అని ఇంతకు ముందు చెప్పడం జరిగింది.
వాస్తవానికి ఖురైషీయులు అరేబీయా దేశ సమూహాలలో వంశ మరియు ఆధ్యాత్మిక పరంగా ప్రభావం మరియు పలుకుబడి ఉండేది అందువల్ల చరిత్రకారులలో కొందరు వారిని “ఉహ్హాతుల్ అరబ్”[1] అని వ్రాశారు. ఎందుకంటే వారు మోసం మరియు టక్కుల మారితనంలో మరియు మేనేజ్మెంట్‌లో ఆధిక్యతను ఆశించడంలో ప్రసిద్ధి చెందినవారు. వారినే కొందరు “అహ్లె హల్ల వ అఖ్ద్”(తీర్మానులు) అని కూడా అన్నారు.
మరియు వారిలో నుండే “అబూబక్ర్”, “ఉమర్”, “ఉస్మాన్”, “అబూసుఫ్యాన్”, “ముఆవియహ్”, “అమ్రె ఆస్”, “ముగైరహ్ ఇబ్నె షఅబహ్”, “మర్వాన్ ఇబ్నె హకమ్”, “తల్హా ఇబ్నె అబ్దుల్లాహ్”, “అబ్దుల్ రహ్మాన్ ఇబ్నె ఔఫ్” మరియు “అబూ ఉబైదహ్ ఆమిర్ ఇబ్నె జర్రాహ్” మొ॥ [2]
ఉదాహారణకు, అప్పుడప్పుడు వీరు ఒక కార్యం పట్ల సలహా మరియు ఎదైనా విషయాన్ని అమలులోకి తీసుకొని రావడానికి మీటింగ్ చేసినప్పుడు దాని పై అందరి అభిప్రాయం ఒకటైనప్పుడు దానిని ఇంకా బలపరచడానికై, కొన్ని రోజుల తరువాత అది ఒక యదార్ధాం అవ్వాలని మరియు ప్రజలు దాని వెనక ఉన్న రహస్యం తెలుసుకోకుండానే దాని పై అమలు చేయాలని ప్రజల మధ్యలో ప్రచారం చేసేవారు.

వారి మోసం మరియు కపటవర్తనాలలో ఒక భాగం “దైవప్రవక్త(స.అ) ముహమ్మద్ మాసూమ్[3] కాదు అతను కూడా ప్రజలందరి వలే సాధారణ మనిషి, అతని నుండి కూడా తప్పులు సంభవించవచ్చు” అని. వాళ్ళు దైవప్రవక్త(స.అ) పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేసేవారు. సత్యం ఏమిటో తెలిసి కూడా సత్యం విషయంలో ఆయనతో తగాదా పడేవారు.
అటువంటి కపటం మరియు మోసాలలో అలీ(అ.స)ను “అబూతురాబ్” అని పిలవడం, అతనిని దూషించడం మరియు అలీ(అ.స), అల్లాహ్ మరియు దైవప్రవక్త(స.అ) యొక్క శత్రువు(మాజాల్లాహ్), అని ప్రజలను నమ్మించడం.
వాళ్ళు “అమ్మారె యాసిర్”ను “ఉబైదుల్లాహ్ ఇబ్నె సబాయా ఇబ్నె సౌదా” యొక్క పేరుతో పిలవడం. మరియు అతనిని అగౌరవించడం. అమ్మారె యాసిర్ చేసిన అపరాదం, కేవలం ఖులఫాలకు వ్యతిరేకించి ప్రజలను ఇమామ్ అలీ(అ.స) యొక్క ఇమామత్(నాయకత్వం) తరపు ఆహ్వానించడం. [4]
అలీ(అ.స) యొక్క “షియా”లను “రాఫిజీ” అని సంభోదించడం. దానితో ప్రజల మనసులో “షియాలు ముహమ్మద్(స.అ) దౌత్యాన్ని నిరాకరించి అలీ(అ.స)ని నమ్మడం మొదలు పెట్టారు” అని బలపరచాలని.
తమను “అహ్లెసున్నత్ వల్ జమాఅత్” అని నామకరించుకోవడం కూడా ఒక కపటమే. దానితో స్వచ్ఛమైన విశ్వాసులు మోసానికి గురి అవ్వాలని మరియు వాళ్ళ విశ్వాసాలను దైవప్రవక్త(స.అ) సున్నత్ నుండి తీసుకోబడినవి మరియు షియాలను దైవప్రవక్త(స.అ) సున్నత్
ను నిరాకరించే వారు, అనుకోవాలని.

వాస్తవానికి వాళ్ళ దృష్టిలో “సున్నత్”, అమీరుల్ మొమినీన్ మరియు దైవప్రవక్త(స.అ) యొక్క అహ్లెబైత్(అ.స)పై మసీదులలో పీఠాల నుండి లఅనత్ చేయించడంతో మొదలైన ఒక చెండాలమైన బిద్అత్. మరి అలా పల్లె పల్లెల, పట్టణాల మసీదులలో ఈ దుష్టకార్యాన్ని అమలు పరిచేవారు. మరియు ఈ బిద్అత్ 80 సంవత్సరాల వరకు నడుస్తూనే ఉంది. చివరికి ఒక్కోసారి ఉపన్యాసకుడు నమాజ్ కోసమని పీఠం నుండి అలీ(అ.స) పై లఅనత్ చేయించకుండా క్రిందికి దిగిపోతే మసీదులో ఉన్న ప్రజలు “నీవు సున్నత్
ను వదిలేశావు” అని అరిచేవారు.
మరియు “ఉమర్ ఇబ్నె అబ్దుల్ అజీజ్”, అల్లాహ్ యొక్క ఈ ప్రవచనం ప్రకారంగా(إِنَّ ٱللَّهَ يَأۡمُرُ بِٱلۡعَدۡلِ وَٱلۡإِحۡسَٰنِ وَإِيتَآيِٕ ذِي ٱلۡقُرۡبَىٰ...) అనువాదం: )అల్లాహ్ న్యాయం చేయమనీ, ఉపకారం చేయమనీ, బంధువుల హక్కులను నెరవేర్చమనీ ఆజ్ఞాపిస్తున్నాడు(.[నహ్ల్ సూరా:16, ఆయత్:90]
ఈ చెడు రీతిని మార్చేస్తే అతడికి వ్యతిరేకంగా అల్లర్లు చేస్తారు, మరియు ముస్లిములు అతడిని చంపేస్తారు. ఎందుకంటే “ఉమర్ ఇబ్నె అబ్దుల్ అజీజ్” వాళ్ళ సున్నత్
ను నాశనం చేశాడు. మరియు అతడిని ఖిలాఫత్ పదవి పై కూర్చోబెట్టిన పూర్వీకుల వచనాలను అసత్యంగా నిర్ధారించాడు. అందుకనే అతడికి విషమిచ్చి చంపేశారు. అప్పటికి అతడి వయసు 38 సంవత్సరాలు. మరియు కేవలం రెండు సంవత్సరములు మాత్రమే పాలించాడు.
ఎందుకంటే అతడి పినతండ్రి కుమారులు తమ సున్నత్ నశించిపోవడాన్ని చూడలేకపోయారు. మరియు దానితో అబూతురాబ్(ఇమామ్ అలీ(అ.స)) మరియు అతని కుమారల గౌరవం కూడా పెరుగుతుంది.

రిఫరెన్స్
1. అనగా అరేబీయ దేశానికి చెందిన తెలివిగలవారు మరియు టక్కులమారులు.
2. మేము హజ్రత్ అలీ(అ.స)ను వేరు చేశాము ఎందుకంటే తర్కం పరంగా బుద్ధిమంతుడు, వివేకి, మంచి యుక్తి కలిగి ఉండడం వేరు మరియు మోసగించె తెలివి, కపటం వేరు. హజ్రత్ అలీ(అ.స)యే స్వయంగా ఎన్నో సార్లు ప్రవచించారు “ఒకవేళ నేను మోసం మరియు కపటాన్ని ఆశ్రయించి ఉంటే అరేబీయా దేశంలో అందరిలో (మోసంగించడంలో) నిపుణతగల మనిషిని అయ్యి ఉండే వాడిని. ఖురాన్
లో ఇలా ప్రవచించబడి ఉంది. و یمکرون و یمکر اللہ واللہ خیر الماکرین .
3. ఎటువంటి అపరాధం చేయని పవిత్రులు.
4. ఈ క్రమంలో డాక్టర్ ముస్తఫా కామిల్ అల్ షబీబీ మిస్రీ తన పుస్తకం “అల్ సిలతు బైనల్ తసవ్వుఫ్ వల్ తషయ్యొహే”లో తిలకించండి. రచయిత అందులో ఎన్నో సాక్ష్యాలు, అబ్దుల్లాహ్ ఇబ్నె సబా, యూదుడు లేదా ఇబ్నె సౌదా, అమ్మారె యాసిరే అని నిరూపించడానికి ప్రదర్శించారు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19