అధికారుల సున్నత్

సోమ, 02/21/2022 - 04:31

అహ్లెసున్నత్
లు, తమ తరపు నుండి సృష్టించుకున్నటువంటి మూల ఆధారములలోనే వారి మరియు షియాల మధ్య వ్యతిరేకత ఉంది. వాటిలో ఒకటి: అధికారుల సున్నత్. దాని గురించి సంక్షిప్తంగా...

అధికారుల సున్నత్

అహ్లెసున్నత్
లు, తమ తరపు నుండి సృష్టించుకున్నటువంటి మూల ఆధారములలోనే వారి మరియు షియాల మధ్య వ్యతిరేకత ఉంది. వాటిలో ఒకటి: అధికారుల సున్నత్. దాని గురించి సంక్షిప్తంగా తెలుసుకుందా
అధికారుల సున్నత్
ను కూడా అహ్లెసున్నత్ వల్ జమాఅత్
లు “صوافی الامر” అని అంటారు. మరియు దీనిని అల్లాహ్ యొక్క ఈ ప్రవచనం ద్వార నిరూపిస్తారు:
أَطِيعُواْ ٱللَّهَ وَأَطِيعُواْ ٱلرَّسُولَ وَأُوْلِي ٱلۡأَمۡرِ مِنكُمۡ
అనువాదం: “ఓ విశ్వాసులారా! అల్లాహ్
కు విధేయత చూపండి. ప్రవక్తకు మరియు మీలోని ఊలిల్ అమ్ర్(అధికారం కలిగి ఉన్నవారు)కు విధేయత చూపండి.”[నిసా సూరా:4, ఆయత్:59][1] 
అహ్లెసున్నత్ దృష్టిలో, బలవంతంగా వాళ్ళపై అధికారం చేస్తున్నవారేనా సరే, అధికారులందరు కూడా “ఊలిల్ అమ్రులే”. ఆ అధికారులను అల్లాహ్
యే ప్రజల పై నాయకుడిగా నిర్ధారించాడు అని వారి నమ్మకం, అందుకని వారిని అనుచరించడం మరియు వారి సున్నత్ పై అమలు చేయడం విధిగా భావిస్తారు.
“ఇబ్నె హజ్మ్ జాహిరీ” అహ్లెసున్నత్ యొక్క ఈ అభిప్రాయాన్ని రద్దు చేస్తూ ఇలా అన్నారు: “మీ అభిప్రాయం ప్రకారం అధికారులకు, షరీఅత్ నుండి అల్లాహ్ మరియు దైవప్రవక్త(స.అ) యొక్క ఏ ఆదేశాన్నైనా అసత్యంగా నిర్ధారించే హక్కు ఉంది. అలాగే అధికారులకు షరీఅత్‌లో (ఒక విషయాన్ని) పెంచే హక్కు ఉంది, ఎందుకంటే ఎక్కువతక్కువలతో అంత ప్రభావం పడదు. ఇలాంటి అభిప్రాయం కలిగి ఉన్నవారు ఇజ్మా ప్రకారంగా అవిశ్వాసులు”.[2]
"జహబీ” “ఇబ్నె హజ్మ్”కు ఇలా జవాబిస్తున్నారు: ఈ వ్యాఖ్యానం పూర్తిగా తప్పుడు వ్యాఖ్యానం. మరియు తప్పుడు వచనం. ఎందుకంటే “దావూద్ ఇబ్నె అలీ” మరియు అతని అనుచరులను వదిలి ఉమ్మత్ మొత్తం “ఉమ్మత్ యొక్క ఊలిల్ అమ్ర్
కు (అనగా అధికారులకు) స్పష్ట ఆదేశాలు లేనటువంటి వ్యవహారములలో తన స్వయఅభిప్రాయం మరియు ఇజ్తిహాద్ ద్వార తీర్పానించే హక్కు ఉంది అని” ఏకాభిప్రాయం(ఇజ్మా) కలిగి ఉన్నారు.
ఒకవేళ వారికి స్పష్టఆదేశం తెలిసి ఉంటే ఇక అతడి తన అభిప్రాయం మరియు ఇజ్తిహాద్ ద్వార ఆదేశాన్ని ఇవ్వడం సరికాదు. అయితే అతడికి కేవలం న్యాయసమ్మతి గల విషయాలను షరీఅత్
లో పెంచే హక్కు ఉంది కాని షరీఅత్ నుండి దేన్ని కూడా తప్పుగా నిర్ధారించే హక్కు లేదు, అని తెలుస్తుంది.

“జహబీ”తో మా విన్నపం. అదేమిటంటే; గౌరవనీయులైన జహబీ గారు! ఉమ్మత్ యొక్క ఇజ్మా(ఏకాభిప్రాయం) ఉంది అని వ్యాజించారు. మరియు మీరే స్వయంగా దావూద్ ఇబ్నె అలీ మరియు అతని అనుచరులు తప్ప అందరూ అని నిర్ధారించారు. కాని దావూద్ ఇబ్నె అలీ యొక్క అనుచరుల పేర్లను ఎందుకు వ్రాయలేదు? అంటే వాళ్ళు మీ దృష్టిలో ఇస్లామీయ ఉమ్మత్
లో లేరనా? లేదా మీరు ఎవరికోసమైతే షరీఅత్‌లో పెంచడాన్ని సమ్మతమైనదిగా నిర్ధారించారో ఆ అధికారుల పట్ల ముఖస్తుతి అడ్డుపడిందా!? అలా అతడు మీ పరపతి మరియు కానుకలను పెంచుతాడనా!?
ఎవరైతే ఇస్లాం పేరున ముస్లిముల నాయకులు అయ్యి కూర్చున్నారో వారికి ఖుర్ఆన్ మరియు సున్నత్ యొక్క ఆదేశాల గురించి తెలుసా!? వారు దాని హద్దులో ఉండడానికి?.

షేఖైన్
లు(అబూబక్ర్ మరియు ఉమర్) తెలిసి కూడా ఖుర్ఆన్ మరియు సున్నత్ యొక్క స్పష్ట ఆదేశాల
ను వ్యతిరేకించారు. దాని గురించి ఇంతకు ముందు చర్చించాము. అయితే వారి తరువాత వచ్చేవారు ఇలా చేయకుండా ఎలా ఉండగలరూ!?
అహ్లెసున్నత్ వల్ జమాఅత్ యొక్క ఫిఖా జ్ఞానులు, అధికారుల మరియు పాలకుల గురించి “వారు అల్లాహ్ యొక్క దీన్
లో ఎక్కువతక్కువలు చేయగలరు” అని ఫత్వా ఇస్తారు. అయితే ఇక “జహబీ” వారి తఖ్లీద్ చేయడంలో ఆశ్చర్య పడవలసిన అవసరం లేదు.

“తబఖాతుల్ ఫుఖహా”
లో “సయీద్ ఇబ్నె జబీర్” ద్వార ఇలా ఉల్లేఖించబడి ఉంది, అతను ఇలా అన్నారు: “నేను, అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్
ను “ఈలా”(ایلا) గురించి ప్రశ్నించినప్పుడు అతను “ఇబ్నె ఉమర్ ఇలా చెప్పారు” అని చెప్పడానికా!, అని అన్నారు. అవును, మేము మిమ్మల్మి నమ్ముతాము, మీ మాటతో సంతృప్తి పడతాము. ఇబ్నె ఉమర్ ఇలా అన్నారు: ఈ విషయం(ఈలా విషయంలో) గురించి అధికారులే చెప్పాలి, అంతేకాదు అల్లాహ్, దైవప్రవక్త(స.అ) మరియు వారి నుండి హదీస్
ను ప్రవచించే వారే చెప్పాలి.

“సయీద్ ఇబ్నె జబీర్” ఉల్లేఖనం ప్రకారం, “రజా ఇబ్నె హయాత్” “సీరియా”కు చెందిన ప్రముఖ ఫఖీహ్
లలో లెక్కించబడేవారు. కాని నేను అతనిని పరీక్షించినపుడు, నేను అతనిని ఒక సీరియన్
గా తెలుసుకున్నాను. ఎందుకంటే ఉతను ఇలా అన్నారు: “ఈ విషయంలో అబ్దుల్ మలిక్ ఇబ్నె మర్వాన్ ఇలా ఇలా తీర్పులు ఇచ్చారు”.[3]

“ఇబ్నె సఅద్” యొక్క పుస్తకం “తబఖాత్”
లో “ముసయ్యబ్ ఇబ్నె రాఫె” గురించి ఇలా వ్రాయబడి ఉంది, అతను ఇలా అన్నారు: “ఎప్పుడైన ఎదైన సమస్య వస్తే, దాని పరిష్కారం ఖుర్ఆన్ మరియు సున్నత్
లో లేకపోతే దానిని “صوافی الامراء” కు అప్పగించండి, ఇక దేనిని ఆ జ్ఞానులు ఏకీభవిస్తారో అదే సత్యం, యదార్ధం”.[4]

మేము ఇలా చెబుతున్నాము: ఖుర్ఆన్ ఇలా ఆదేశిస్తుంది:
وَلَوِ ٱتَّبَعَ ٱلۡحَقُّ أَهۡوَآءَهُمۡ لَفَسَدَتِ ٱلسَّمَٰوَٰتُ وَٱلۡأَرۡضُ، بَلۡ جَآءَهُم بِٱلۡحَقِّ وَأَكۡثَرُهُمۡ لِلۡحَقِّ كَٰرِهُونَ
అనువాదం: “సత్యమే గనక వారి కోరికలను అనుసరించినట్లైతే భూమ్యాకాశాలు చిందరవందర అయిపోయేవి. అంతేకాదు వారి వద్దకు సత్యం తీసుకుని వచ్చాడు అయితే వారిలో చాలా మందికి సత్యమంటే ఏమాత్రం పడదు.”[మొమినూన్ సూర్:23, ఆయత్:71,70.]   

రిఫరెన్స్
1. ఇస్లామీయ చాలా గ్రంథాలలో اولی الامر  అనగా పవిత్ర ఇమాములు, అన్యాయంగా అధికారాన్ని దోచుకున్న అధికారులు కాదు అని వివరించబడి ఉంది. ఎందుకంటే అల్లాహ్, అన్యాయుల, దుర్మార్గుల మరియు అవిశ్వాసులను అనుచరించమని ఆదేశించడు.
2. ఇబ్నె హజ్మ్, ములఖ్ఖసు ఇబ్తాలిల్ ఖియాస్, పేజీ37.
3. తబఖాకుల్ ఫుఖహా, అనువాదం సయీద్ ఇబ్నె జబీర్.
4. తబఖాతె ఇబ్నె సఅద్, భాగం6, పేజీ179.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
14 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 52