.ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇమామత్ కాలం ఐదుగురు “అమవీ” అధికారుల మరియు ఇద్దరు “అబ్బాసీ” అధికారుల అధికారంలో గడిచింది.
ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] 114వ సంవత్సరంలో ఇమామత్ పదవీ స్వీకరణ చేశారు. వారి ఇమామత్ కాలం ఐదుగురు “అమవీ” అధికారుల మరియు ఇద్దరు “అబ్బాసీ” అధికారుల అధికారంలో గడిచింది. వారి పేర్లు ఇవి:
అమవీ అధికారులు
1. హిషామ్ ఇబ్నె అబ్దుల్ మలిక్(పదవీకాలం 105 హిజ్రీ నుండి 125 వరకు)
2. వలీబ్ ఇబ్నె యజీద్ ఇబ్నె అబ్దుల్ మలిక్(పదవీకాలం 125 హిజ్రీ నుండి 126 వరకు)
3. యజీద్ ఇబ్నె వలీద్ ఇబ్నె అబ్దుల్ మలిక్(పదవీకాలం 126 హిజ్రీ)
4. ఇబ్రాహీమ్ ఇబ్నె వలీద్ ఇబ్నె అబ్దుల్ మలిక్(పదవీకాలం 126వ సంవత్సరంలో 70 రోజులు)
5. మర్వాన్ ఇబ్నె మొహమ్మద్, “మర్వానె హిమార్” అని ప్రఖ్యాతి చెందిన వాడు. (పదవీకాలం 126 హిజ్రీ నుండి 132 వరకు)
అబ్బాసీ అధికారులు
1. అబ్దుల్లాహ్ ఇబ్నె మొహమ్మద్, “సఫ్ఫాహ్” అను పిలవబడేవాడు(పదవీకాలం 132 హిజ్రీ నుండి 137 వరకు)
2. అబూ జాఫర్, మన్సూరె దవానెఖీ(పదవీకాలం 137 హిజ్రీ నుండి 158 వరకు) [సీమాయే పీష్వాయాన్, పేజీ95]
రిఫ్రెన్స్
సీమాయే పీష్వాయాన్, మహ్దీ పీష్వాయి, దారుల్ ఇల్మ్, 1388.
వ్యాఖ్యానించండి