ఊహ్

గురు, 02/21/2019 - 05:31

ఇస్రా సూరహ్ యొక్క 23 ఆయత్ నుండి తెలుసుకోవలసిన కొన్ని అంశాల వివరణ.

ఊహ్

నీ ప్రభువు స్పష్టంగా ఆజ్ఞాపించాడు: మీరు ఆయనను తప్ప మరొకరెవరినీ ఆరాధించకూడదు. తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా వ్వవహరించాలి. నీ సమక్షంలో వారిలో ఒకరుగాని, ఇద్దరుగానీ వృద్ధాప్యానికి చేరుకుని ఉంటే వారి ముందు (విసుగ్గా) “ఊహ్” అని కూడా అనకు. వారిని కసురుకుంటూ మాట్లాడకు. పైగా వారితో మర్యాదగా మాట్లాడు.[ఇస్రా:23]
ఈ ఆయత్ నుండి మనం తెలుసుకోవలసిన కొన్ని విషయాలు:
1. తల్లిదండ్రుల యెడల ఉత్తమ వ్యవహారం, విశ్వాసుని లక్షణం.
2. తల్లిదండ్రుల యెడల ఉత్తమ వ్వవహారం ఆజ్ఞ, తౌహీద్ ఆజ్ఞతో పాటు చేయబడినది. ఇది రద్దుచేయబడనటువంటి ఆజ్ఞ.
3. ఈ ఆజ్ఞ వివేకపరంగా మరియు షరా పరంగా కూడా విధి.
4. కొత్తతరం, విశ్వాసం మరియు పాతతరం యొక్క నీడలో గట్టి బంధాన్ని ఏర్పర్చుకోవాలి.
5. తల్లిదండ్రుల పట్ల ఉత్తమ వ్వవహారం కోసం వారు ముస్లిములే అయ్యి ఉండాలనే షరత్తు లేదు.
6. తల్లిదండ్రుల మధ్య తేడా లేదు, ఇద్దరి పట్ల ఉత్తమమంగా ఉండాలి.
7. ఉత్తమ వ్వవహారానికి హద్దులు లేవు. (అనగా ఇఫ్తార్ సమయం అయిన తరువాత ఉపవాసం పూర్తయినట్లు కాదు).
8. ఉత్తమ వ్వవహార ఆజ్ఞ పిల్లలకు మాత్రమే, తల్లిదండ్రులకు కాదు. ఎందుకంటే వారికి ఆజ్ఞ అనవసరం స్వాభావికంగానే పిల్లల యెడల ఉత్తమంగా ఉంటారు.
9. శారీరకంగా ఎంత బలహీనతకు గురి అవుతారో అంత ఎక్కువగా వారికి మంచిచేయడం అవసరం.
10. తల్లిదండ్రుల వృద్ధాప్యాపంలో వారిని వృద్ధాశ్రయం(ఓల్డేజ్ హోమ్)లో వదలకండి, మీ వద్దే ఉంచుకోండి.
11. వారి పట్ల ఉత్తమ వ్యవహారంతో పాటు, మర్యాదగా మాట్లాడాలి.
12. మర్యాదగా మాట్లాడమనే ఆజ్ఞ పిల్లలకు మాత్రమే, ఇది తల్లిదడ్రులకు వర్తించదు. వారు ఏవిధంగా మాట్లాడినా పిల్లలు మర్యాదగానే మాట్లాడాలి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14