అహ్లెబైత్(అ.స) పట్ల అహ్లెసున్నత్‌ల వ్యతిరేకత-1

గురు, 03/24/2022 - 19:00

అహ్లెబైత్(అ.స) పట్ల అహ్లెసున్నత్‌ల వ్యతిరేకత వివరణ కొన్ని చారిత్రాత్మిక రచనల మరియు ముహద్దిసీనుల ఉల్లేఖనల ద్వార...

అహ్లెబైత్(అ.స) పట్ల అహ్లెసున్నత్‌ల వ్యతిరేకత-1

ఒక పరిశోధకుడి ముందు, అహ్లెసున్నత్ వల్ జమాఅత్ యొక్క యదార్థం ముందుకొచ్చినప్పుడు, అతడు దిగ్భ్రమకు గురి చెంది, అహ్లెసున్నత్
లు పవిత్ర ఇత్రత్(అ.స) పట్ల వైరం గలవారు, అని అంగీకరిస్తాడు. ఎందుకంటే అహ్లెసున్నత్ లు, అహ్లెబైత్(అ.స)లతో యుద్ధం చేసిన వారిని, వారిపై లఅనత్ చేసిన వారిని మరియు వారిని చంపిన వారిని అనుచరిస్తారు.
అందుకనే మీరు అహ్లెసున్నత్
లను ఖారిజీయులైన మరియు నాసిబీయులైన ఉస్మానీ ముహద్దిసీన్
లను మంచి ముహద్దిసీన్
లుగా నిర్ధారించడాన్ని, మరియు అహ్లెబైత్‌లను ఇష్టపడే ముహద్దిసీన్‌లను నిందించడాన్ని చూస్తారు.
దీన్ని మీరు వారి పుస్తకాలలో స్పష్టంగా తిలకించవచ్చు. వారు అలీ ఇబ్నె అబీ తాలిబ్(అ.స) యొక్క శ్రేష్ఠతలను వివరించే సరైన హదీసులన్నీంటిని తొలగించాలి అని ప్రయత్నిస్తారు. అటువంటి హదీసులలో ఉన్న రావీయులను “దాని రావీయుల క్రమంలో ఫలాన వ్యక్తి రాఫిజీ”[1] అని అవమానిస్తారు. మరియు వేరే ఖలీఫాల శ్రేష్ఠత ఉన్న ఆ నకిలీ హదీసులను సరైనవిగా నిరూపించాలని (అపజయ) ప్రయత్నం చేస్తారు. ఆ హదీసుల రావీ నాసిబీయే కానివ్వండి ఎందుకంటే అహ్లెసున్నత్ దృష్టిలో నాసిబీ
లకు దైవప్రవక్త(స.అ) సున్నత్ విషయంలో ఎలాంటి మొహమాటం ఉండదు.
అయితే ‘ఇబ్నె హజర్”, “అబ్దుల్లాహ్ ఇబ్నె ఇద్రీస్ అల్ అజ్దీ”, ఇతడు నాసిబీగా ప్రసిద్ధి చెందినవాడు. అతడి గురించి ఇలా వ్రాశారు: “అతడు అహ్లెసున్నత్ వల్ జమాఅత్
కు చెందిన వారు. సున్నత్ విషయంలో చాలా స్ట్రిక్ట్, అతడు ఒక ఉస్మానీ”.
“ఇబ్నె హజర్”, “అబ్దుల్లాహ్ ఇబ్నె ఔన్ అల్ బసరీ” గురించి ఇలా వ్రాశారు: “అతను నమ్మదగినవారు, సున్నత్ విషయంలో చాలా స్ట్రిక్ట్, బిద్అత్ సృష్టించువారి కొరకు ఆగ్రహం. ఇబ్నె సఅద్ ఇలా అన్నారు: “అబ్దుల్లాహ్ ఇబ్నె ఔన్ అల్ బసరీ” ఒక ఉస్మానీ.[2]

మరి అలాగే “ఇబ్నె సఅద్”, “ఇబ్రాహీమ్ ఇబ్నె యాఖూబ్ అల్ జౌజానీ” గురించి ఇలా అన్నారు: అతడు అలీ(అ.స) పట్ల వైరంలో ప్రసిద్ధి చెందినవాడు. మరియు ‘హరీజా’ వర్గానికి చెందినవాడు. అనగా ‘హరీజ్ ఇబ్నె ఉస్మానె దమిష్ఖీ’ వర్గాన్ని అనుచరించే వాడు. అతడు నాసిబీగా ప్రసిద్ధి చెందిన వాడు”.[3]
ఇక్కడ ఒక విషయం చెప్పడం అవసరం అని అనుకుంటున్నాను, అదేమిటంటే; వారు పొగడ్తలతో ముంచేత్తుతున్న, మరియు సున్నత్ విషయంలో స్ట్రిక్ట్ మరియు హదీస్ రక్షకులు అని చెప్పబడుతున్న, మరియు చాలా ముహద్దిసీన్
లు అతని ద్వారం వద్ద ఉండేటువంటి ఆ నాసిబీ, ఒకరోజు తన పనిమనిషికి కోడి ఇచ్చి పంపాడు. ఆమె నగరమంతా తిరిగి చివరికి తన యజమాని “జౌజాని” వద్దకు తిరిగి వచ్చి “నాకు కోడిని జపా చేయు ఒక్కడు కూడా కనబడలేదు” అని అంది. అప్పుడు జౌజానీ గట్టిగా అరిచి ఇలా అన్నారు: “సుబ్హానల్లాహ్! కోడిని జపా చేయడానికి ఒక్కడు కూడా కనబడలేదు. నిజానికి ఉదయం నుండి ప్రొద్దుపోయే లోపే అలీ(అ.స) ఇరవై వేల కన్న ఎక్కువ మనుషులను హతమారుస్తారు”
అహ్లెబైత్(అ.స)
ల శత్రువులు మరియు నాసిబీయులు ఇలాంటి టక్కరి, మోసాల ద్వార ప్రజలను యదార్థమార్గం నుండి తప్పించేవారు. మరియు అబద్ధం ద్వార తప్పుత్రోవ పట్టించేవారు. చివరికి వారు ముస్లిముల హృదయాలలో ముఖ్యంగా ముహద్దిసీన్
ల హృదయాన్ని అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) పట్ల ద్వేషం మరియు కపటంతో నింపేశారు. వారు అలీ(అ.స) పై లఅనత్ మరియు దూషణాన్ని సమ్మతిగా నిర్ధారించారు.

మా కాలపు అహ్లెసున్నత్‌లు “మేము కూడా అహ్లెబైత్(అ.స)లను ఇష్ట పడతాము” అని వాదిస్తున్నప్పటికీ, దానిని మీరు ఈనాటికి కూడా చూడగలరు.
సయ్యద్నా అలీ(కర్రమల్లాహ్ వజ్హహు)ను కూడా “రజియల్లాహ్ అన్హు” అని అంటారు. కాని మీరు హజ్రత్ అలీ(అ.స) యొక్క శ్రేష్ఠత గురించి ఏదైనా హదీస్ వినిపిస్తే వారు ఏలా మీ హేళన చేస్తారో చూడవచ్చు. మరి ఇంత విషయానికే మీరు షియా అని నిర్ధారిస్తారు. మరియు ఇతను దీన్
లో బిద్అత్ మరియు అతివృష్టికి పాలుపడ్డాడు, అని అంటారు.
మరి మీరు షేఖైన్ అబూబక్ర్ మరియు ఉమర్ లేదా వేరే సహాబీ గురించి మనసుకు నచ్చినట్లు వాళ్ళ శ్రేష్ఠత గిరించి  మాట్లాడితే మరియు అందులో అతివృష్టిని కూడా వాడితే వారు మీ మాటలను విశాల హృదయంతో వింటారు. మరియు తృప్తి పొందుతారు. మరియు మిమ్మల్ని జ్ఞానసముద్రం మరియు దీర్ఝ యోచన గలవారుగా నిర్ధారిస్తారు.
నిస్సందేహముగా ఇది పూర్తిగా వారి మంచి పూర్వీకుల[4] యొక్క నమ్మకం. చరిత్రకారులు ఇలా అని వ్రాశారు; “ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్, అహ్లె హదీస్ నుండి ప్రతీ ఆ వ్యక్తిని ఎవరైతే అబూబక్ర్, ఉమర్ లేదా ఉస్మాన్
ల గురించి తగ్గించి మాట్లాడతారో వారిని జయీఫ్(బలహీనులు)గా నిర్ధారించే వారు. ఉదాహారణకు ‘ఇబ్రాహీమ్ జౌజానీ’, ఇతడు ఒక నాసిబీను గౌరవించే వారు. అతడితో ఉత్తరోత్తములు జరిగేవి. అలా అతను పీఠం పైకెళ్ళి అతడి ఉత్తరమును చదివారు. మరియు దాని ద్వార నిరసన వ్యక్తం చేశారు”.
అలీ(అ.స)ని నాలుగోవ ఖలీఫాగా అంగీకరించే “అహ్మద్ ఇబ్నె హంబల్” యొక్క పరిస్థితే ఇలా ఉంటే, ఇక ఇమామ్ అలీ(అ.స) యొక్క శ్రేష్ఠతలనే అంగీకరించని వారి పరిస్థితి, మరియు అలాగే ‘జుమా ఉపన్యాసం’ మరియు ‘ఈద్’
ల నమాజ్ సందర్భాలలో పీఠాల నుండి హజ్రత్ అలీ(అ.స) పై లఅనత్ పంపించే వారి పరిస్థితి అయితే అడగనక్కరలేదు”.
“దారు ఖుత్నీ” ఇలా అన్నారు: అహ్లెసున్నత్
ల వేదాంతి అయిన ‘ఇబ్నె ఖుతైబహ్’, ‘తష్బీహ్’ విశ్వాసం వైపు ద్యాసగల వారు మరియు అహ్లెబైత్(అ.స)కు విరోధి”.[5]
దీని ద్వార అర్ధం అయ్యే విషయం ఏమిటంటే, అహ్లెసున్నత్
లలో చాలా మంది దైవప్రవక్త(స.అ) యొక్క ఇత్రత్(అ.స)
కు విరోధులు.

1. రాఫిజీ అనగా అలీ(అ.స) యొక్క షీయాలు మరియు ఖులఫాయే సలాసహ్(అబుబక్ర్, ఉమర్ మరియు ఉస్మాన్)ల ఖిలాఫత్‌ను అంగీకరించని వాడు.
2. ఉస్మానీ అనగా అలీను కాఫిర్ అని చెప్పేటువంటి మరి ఉస్మాన్ హత్య విషయంలో అలీని నిందించేటువంటి నాసిబీలు. ముఆవియహ్ ఇబ్నె అబీ సుఫ్యాన్ వాళ్ళ నాయకుడు.
3. ఖారిజీయులు, నాసిబీయులు, ఖాసితీనులు, నాకిసీనులు, వీళ్ళు అలీ(అ.స) మరియు అతని సంతానం యొక్క శత్రువులు. వాళ్ళు అతనికి వ్యతిరేకంగా శత్రుత్వపు జెండాను పాతారు, అతనితో యుద్ధం చేశారు, మరణాంతరం అతనిపై లఅనత్ చేశారు.
4. సలఫె సాలెహ్.
5. లిసానుల్ మీజాన్, భాగం3, పేజీ357.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 31