సంతృప్తి అనేది ఆ దేవుని తరుపు నుండి ఈ మనవునికి అందించబడిన ఒక వరం అని చెప్పవచ్చు.
సంతృప్తి కోసం మనిషి ఈ లోకంలో ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడడు, ఒకవైపు ఆ సంతృప్తిని డబ్బులో మరొవైపు దానిని అధికారంలో వెతుకుతాడు మరియు కనిపించే ప్రతీ ద్వారాన్ని తట్టడం మొదలు పెడతాడు కానీ చివరికి ఎటువంటి లాభం సమకూరదో అలాంటి సమయంలో ప్రపంచంలో అన్ని తలుపులు తట్టి అలిసిపోయిన ఈ మనవునిని సంభోదిస్తూ అంతిమ దైవగ్రంధం అయిన ఖురాన్ ఈ విధంగా సెలవిస్తుంది:
ٱلَّذِينَ ءَامَنُوا۟ وَتَطْمَئِنُّ قُلُوبُهُم بِذِكْرِ ٱللَّهِ أَلَا بِذِكْرِ ٱللَّهِ تَطْمَئِنُّ ٱلْقُلُوبُ
విశ్వసించిన వారి హృదయాలు అల్లాహ్ స్మరణ ద్వారా తృప్తి చెందుతాయి. తెలుసుకోండి! అల్లాహ్ స్మరణ ద్వారానే హృదయాలు నెమ్మదిస్తాయి[అర్-రాద్:28].
లోకవ్యవహారాలతో మరియు సాంసారిక జీవితంలో నిమజ్ణమై ఆ దేవుని మరచిన ఈ మానవుడు ఎప్పుడైతే ఒకసారి ఆ పరమేస్వరుడిని స్తుతించి అతని పట్ల విధేయత చూపుతాడో అప్పుడే అతని హృదయానికి సుఖము మరియు సంతృప్తి సమకూరుతుంది.
ఆ దేవునిని ఎందుకు స్తుతించాలి లేదా ఆ దేవుని స్మరణ వలన ఏదైన ఉపయోగం ఉన్నదా అనే ప్రశ్న అందరికి కలుగుతుంది, అందువలనే ఆ దైవస్మరణ వలన కలిగే కొన్ని లాభాలను ఇక్కడ ప్రస్థావిస్తున్నాము:
1. ఆ అల్లాహ్ మిమ్మల్ని జ్ణాపకం ఉంచుకుంటాడు:
فَٱذْكُرُونِىٓ أَذْكُرْكُمْ وَٱشْكُرُوا۟ لِى وَلَا تَكْفُرُونِ
అందుకే మీరు నన్ను స్మరించండి, నేను మిమ్మల్ని జ్ఞాపక ముంచుకుంటాను. నాకు కృతజ్ఞులై ఉండండి. కృతఘ్నతకు పాల్పడకండి[అల్-బఖర:152].
2. సాఫల్యం ప్రాప్తిస్తుంది:
فَإِذَا قُضِيَتِ ٱلصَّلَوٰةُ فَٱنتَشِرُوا۟ فِى ٱلْأَرْضِ وَٱبْتَغُوا۟ مِن فَضْلِ ٱللَّهِ وَٱذْكُرُوا۟ ٱللَّهَ كَثِيرًۭا لَّعَلَّكُمْ تُفْلِحُونَ
మరి నమాజు ముగిసిన తరువాత భూమిలో విస్తరించి, దైవానుగ్రహాన్ని అన్వేషించండి. ఎక్కువగా అల్లాహ్‌ను స్మరిస్తూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు[అల్-జుము అహ్;10].
3. దైవ స్మరణతో షైతాన్ దూరమవుతాడు:
إِنَّ ٱلَّذِينَ ٱتَّقَوْا۟ إِذَا مَسَّهُمْ طَٰٓئِفٌۭ مِّنَ ٱلشَّيْطَٰنِ تَذَكَّرُوا۟ فَإِذَا هُم مُّبْصِرُونَ
నిశ్చయంగా అల్లాహ్ భీతిపరులు(ముత్తఖీన్) తమకు ఎప్పుడైనా షైతాన్ తరఫు నుంచి చెడు ఆలోచన తట్టినప్పుడు వారు (తమ ప్రభువు యొక్క ఔన్నత్య) స్మరణలో నిమగ్నులై పోతారు. దాంతో వెంటనే వారికి కనువిప్పు కలుగుతుంది[అల్ ఆరాఫ్:201].
ఇంకా మరెన్నొ ప్రయోజనాలు హదీసులలో ప్రస్థావించబడ్డాయి కానీ ఎటుచూసినా హింస మరియు అన్యాయంతో నిండిపోయిన ఈ లోకంలో మనిషి కొంత మనశ్శాంతిని కోరుకుంటాడు ఎవరైతే దానిని ఆ పరమేశ్వరుని స్తుతి మరియు స్మరణలో పొందుతారో వారే నిజమైన ధనికులు.
వ్యాఖ్యానించండి