క్రింది వ్యాసంలో అల్లాహ్ తన మానాన ఎవరికి విడిచిపెడతాడు, దానికి గల కారణాలు ఎమిటి మరియు దాని నుండి ఎలా విముక్తి లభిస్తుంది అన్న అంశాలు.
నిర్లక్ష్యం మనసు యొక్క అత్యంత తీవ్రమైన రోగములలొ ఒక రోగము. నిర్లక్ష్యం మంచి పనులనుండి దూరమవడనికి కారణమవుతుంది. మరియు అలాగే మనిషి చెడ్డ పనులకు దగ్గరవడనికి గల కారణం కూడా నిర్లక్ష్యమే, ఎందుకంటే నిర్లక్ష్యంగల మనిషి ఎల్లప్పుడు దేవుడు వైపు గాని మరియు మంచి పనులవైపు గాని ఆకర్షింపబడడు. ఎల్లప్పుడు దేవుని స్తుతి, ఖురాన్ పఠనం, జ్ఞానుల సాహచర్యం, ఈ లోకం నసించిపోతుంది అని గుర్తించుట, పాపములకు దూరంగా ఉండటం, మ్రుత్యువును జ్ఞాపకం ఉంచుకోవడం ఇవన్ని నిర్లక్ష్యానికి దూరంగా ఉండడానికి గల కొన్ని కారణాలు.
నిర్లక్ష్యం యొక్క నష్టాలు చాలా ఉన్నాయి దాని గురించి అల్లాహ్ ఖురాన్ లొ ఇలా సెలవిస్తున్నాడు:
وَلَا تَكُونُوا كَالَّذِينَ نَسُوا اللَّهَ فَأَنْسَاهُمْ أَنْفُسَهُمْ أُولَئِكَ هُمُ الْفَاسِقُونَ
మీరు అల్లాహ్‌ను మరచిపోయినవారి మాదిరిగా అయిపోకండి. (వారి ఈ విస్మరణ కారణంగా) అల్లాహ్ కూడా వారిని తమను తామే మరచిపోయిన వారిగా చేసేశాడు. ఇలాంటి వారే పరమ అవిధేయులు.[అల్-హష్ర్:19].
నిర్లక్ష్యం నుండి ముక్తి పొందటంలోనే మనిషికి సాఫల్యం ప్రాప్తిస్తుంది, ఎందుకంటే నిర్లక్ష్యం మనిషిని దైవనామస్మరణం నుండి ఆపుతుంది మరియు ఎప్పుడైతె మనిషి దైవనామస్మరనాన్ని వదిలిపెదతాడొ భగవంతునికి దూరమైపొవడం జరుగుతుంది అటువంటి సమయం లో అల్లాహ్ కూడా అతనిని తన మానాన విదిచి పెడతాడు.
వ్యాఖ్యలు
Beshak Allah hame gaflat bachale aur hame hidayat de
Bohut qoob....
Subhanallah,bahot qub
వ్యాఖ్యానించండి