సత్ప్రవర్తన ప్రభావాలు

బుధ, 05/11/2022 - 14:49

కుటుంబంలో మనశాంతి మరియు పటిష్టతకు కారణాలలో ఒకటి కుటుంబ సభ్యుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండడం...

సత్ప్రవర్తన ప్రభావాలు

కుటుంబంలో మనశాంతి మరియు పటిష్టతకు కారణాలలో ఒకటి కుటుంబ సభ్యులతో మంచిగా ఉండడం ముఖ్యంగా భార్యభర్తలు ఒకరి పట్ల మరొకరు మంచిగా ప్రవర్తింతడం. మంచిగా ప్రవర్తన అంటే మనిషిలో కొన్ని ప్రత్యేకతలు మరియు గుణాలు ఉంటాయి అవి అతడి మాటల్లో మరియు చేసే పనుల్లో కనిపిస్తాయి. ఉదాహారణకు; మంచిగా మాట్లాడడం, ఎదుటివారిని గౌరవించడం, వినయం, విశాల హృదయం, నమస్కారం చేయడం, ఓదార్చడం మరియు దయ చూపడం లాంటివి. ఇతరుల పట్ల మంచి ప్రవర్తన ముఖ్యంగా జీవిత భాగస్వామి మరియు పిల్లల పట్ల కలిగి ఉండడం వల్ల మనిషి ఉనికి పై మంచి ప్రభావం చూపించడమే కాకుండా ఆ కుటుంబంలో మనశాంతి, ప్రేమానురాగాలు మరియు ఆత్మీయత ఉంటాయి. హజ్రత్ ఇమామ్ సాదిఖ్(అ.స) ఉలా ఉపదేశించారు: “సత్ప్రవర్తన కలిగి ఉన్న జీవితానికి మించిన మంచి లేదు”[1] ఇక్కడ సత్ప్రవర్తన కలిగి ఉండడం వల్ల మనిషి జీవితంలో పడే ప్రభావాలు మరియు శుభాల గురించి సంక్షిప్తంగా వివరించాలనే మా ప్రయత్నం.

వయసు పెరుగుతుంది
సత్ప్రవర్తన కలిగి ఉన్న వారి వయసు పెరుగుతుంది; ఈనాడు నిర్ధారించబడిన విషయమేమిటంటే చాలా రోగాలకు కారణం అంతే కాదు కొందరి మరణాలకు కారణం మనిషి పడే ఆందోళనలు మరియు అతడి పై పడే ఒత్తిడ్లు. నిస్సందేహంగా సత్ప్రవర్తన మరియు ప్రేమానురాగాలు ఆ ఒత్తిడ్లను తగ్గిస్తాయి లేదా పూర్తిగా తగ్గిస్తాయి, దాంతో మనిషి వయసు పెరుగుతుంది. ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా ఉపదేశించారు: “సత్కార్యం మరియు సత్ప్రవర్తన ఇళ్లను (కుటుంబాలను) నిలుపుంతుంది మరియు వయసును పెంచుతుంది”[2]

జీవనోపాధి పెరగడం
హజ్రత్ ఇమామ్ అలీ(అ.స) కూడా సత్ప్రవర్తనను జీవనోపాధి పెరగడానికి కారణంగా సూచించారు. వారి ఇలా ఉపదేశించారు: “జీవనోపాధి గనులు, సత్ప్రవర్తనలో దాగి ఉంది”[3]

ప్రజాదారణ పొందడం
మనిషి యొక్క ఆశలలో ఒకటి ఆదరణ పొందడం. అయితే ప్రజాదారణ ఎలా పొందగలం? ఈ ప్రశ్నకు సమాధానం; మనిషి సత్ప్రవర్తనే అతడి ప్రేమను ఇతరుల మనసుల్లో వేస్తుంది. అమీరుల్ మొమినీన్(అ.స) ఇలా ఉపదేశించారు: “సత్ప్రవర్తన కలిగివున్నవారికి మిత్రులు ఎక్కువ అవుతారు మరియు ప్రజలు వారిని ఇష్టపడతారు”[4].

ప్రపంచ శిక్ష నుండి విముక్తి
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా ఉల్లేఖించారు: దైవప్రవక్త(స.అ) వద్దకు తీసుకొచ్చిన బంధీలందరిని చంపేయండి ఒక్కడ్ని తప్ప అని ఆదేశించారు. ఆ బందీ దైవప్రవక్త(స.అ)తో ఇలా అన్నాడు: నా తల్లిదండ్రులు మీపై ఫిదా, వీళ్లందరిలో నన్నే ఎందుకు వదిలేశావు? దైవప్రవక్త(స.అ) ఇలా అన్నారు: జిబ్రయీల్ అల్లాహ్ తరపు నుంచి వార్త తీసుకొన్ని వచ్చారు నీలో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు ఇష్టమైన ఐదు గుణాలు ఉన్నాయి అని. 1. నీ గౌరవనీయుల(అమ్మా, చెల్లీ, భార్యా, కూతురూ...) పట్ల అత్యంత గౌరవం కలిగి ఉన్నవాడివి 2. దయా దాతృత్యాలు కలిగి ఉన్నవాడివి 3. సత్ప్రవర్తన కలిగివున్నవాడివి 4. నిత్యం సత్యాన్ని పలికేవాడివి 5. శౌర్యుల శ్రేణికి చెందినవాడివి. ఆ బంధీ ఈ యదార్ధాలను వినగానే ఇస్లాంను స్వీకరించాడు. అతడి ఇస్లాం స్వీకరణ ఉత్తమమయ్యింది, అతడు దైవప్రవక్త(స.అ)తో పాటు జిహాద్ లో పాల్గొన్నాడు, చివరికి అల్లాహ్ మార్రంలో వీరమరణాన్ని పొందాడు.[5]

అల్లాహ్ ఆదరణ పొందడం
అల్లాహ్ ఆదరణ పొందడానికి గల మార్గాలలో సత్ప్రవర్తన కలిగి ఉండడం ఒకటి. అల్లాహ్ సత్ప్రవర్తన కలిగివున్న వ్యక్తిని ఇష్టపడతాడు. దైవప్రవక్త(స.అ) ఇలా ఉపదేశించారు: “అల్లాహ్ దృష్టిలో అత్యంత ఆదరణ కలిగి వున్న వారు, మీలో సత్ప్రవర్తన కలిగి ఉన్నవారే”[6]
దైవప్రవక్త(స.అ, అమీరుల్ మొమినీన్(అ.స)ను ఉత్తమ స్థానం పొందడానికై కుటుంబ సభ్యుల పట్ల, పొరుగువారి పట్ల మరియు వారితో జీవించే ప్రతీవారి పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండమని ఇలా సఫార్సు చేశారు: “ఓ అలీ! అల్లాహ్ వద్ద ఉత్తమ స్థానంలో (నీ పేరు) లిఖించబడడానికి; నీ ప్రవర్తనను నీ కుటుంబ సభ్యుల పట్ల, నీ పొరుగువారి పట్ల, నీ వద్దకు వస్తూ పోతూ ఉండేవారి పట్ల, నీతో ఉండేవారి మరియు నీతో మాట్లాడే వారి పట్ల మంచిగా మలుచుకో”[7].

అయితే గుర్తుంచుకోవలసిన విషమేమిటంటే ఇస్లాం సత్ప్రవర్తనను ఇంతిలా సిఫార్సు చేస్తుంది అంటే మనిషి పాపముల పట్ల మరియు ఇతర నిషిద్ధ ఆదేశాల పట్ల అశ్రద్ధత చూపించవచ్చు అని ఏమాత్రం కాదు, లేదా ఒక వ్యక్తి పాపముకు పాల్పడుతుంటే మౌనంగా ఉండి పోవడం మరియు అతడిని చూసి చిరునవ్వు నవ్వాలి అని కాదు, లేదా ఒకడు తప్పుగా ప్రవర్తిస్తుంటే ప్రతిచర్యగా ఏమి చేయకుండ ఉండిపోవాలి అని కూడా కాదు., ఎందుకంటే తిరగబడడం, వాదించడం మతం మరియు దాని ఆదేశాల ప్రతిష్టత ఆపదలకు గురికానంత వరకే మంచివి కావు. అదే ధర్మం యొక్క విలువల రక్షణ కోసం ఇలా చేయడం తప్పు కాదు ఇంకా చెప్పాలంటే అతి ముఖ్యమైన షరా చర్యలో ఒకటిగా మారుతుంది. హజ్రత అలీ(అ.స) ఇలా ఉల్లేఖించారు: “దైవప్రవక్త(స.అ) మాకు ఇలా ఆదేశించారు., పాపములు చేసేవారు ఎదురు పడితే ముఖాన్ని అసహ్యంగా పెట్టండి”.[8]

రిఫరెన్స్
1. బిహారుల్ అన్వార్, భాగం68, పేజీ389.
2. అల్ కాఫీ, బాగం2, పేజీ100.
3. అల్ కాఫీ, భాగం8, పేజీ23.
4. గురరుల్ హికమ్ వ దురరుల్ కలిమ్, పేజీ663.
5. బిహారుల్ అన్వార్, భాగం68, పేజీ384.
6. ముస్తద్రికుల్ వసాయిల్, భాగం9, పేజీ150.
7. తొహ్ఫుల్ ఉఖూల్, పేజీ14.
8. అల్ కాఫీ, భాగం5, పేజీ95.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14