.ఖుర్ఆన్ యే పవిత్రులుగా నిర్ధారించిన హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] పొరుగువారి ప్రాధాన్యత గురించి ఏమని చెబుతున్నారు.
దైవప్రవక్త[స.అ] యొక్క ఒక్కగానొక కుమార్తె, ఫాతెమా జహ్రా[స.అ]. ఆమె పవిత్రత గురించి ఖుర్ఆన్
లో అల్లాహ్ ఇలా ప్రవచించెను: «إِنَّما يُرِيدُ اللَّهُ لِيُذْهِبَ عَنْكُمُ الرِّجْسَ أَهْلَ الْبَيْتِ وَ يُطَهِّرَكُمْ تَطْهِيراً» [అల్ అహ్జాబ్ సూరా:33, ఆయత్:33]
అంతటి పవిత్రత గల ఆమె గురించి, ఆమె పెద్దకుమారుడు ఇమామ్ హసన్[అ.స] ఇలా వివరించారు: “ఒక రోజు అమ్మను రాత్రంతా అల్లాహ్ను ప్రార్ధింస్తూ, ప్రజల కోసం దుఆ చేస్తుండగా చూశాను. చివరికి సుర్యోదయం అయ్యింది. నేను అమ్మ వద్దకు వెళ్ళి “అమ్మా! నువ్వూ, నీ కోసం ఎందుకు దుఆ చేసుకో లేదు?” అని ప్రశ్నించాను. ఆమె ఇలా అన్నారు: یا بُنَیَّ الْجارُ ثُمَّ الدّارُ; నా ప్రియ కుమారా! ముందు పొరుగు వారు ఆ తరువాత ఇంట్లో వారు.[దాస్తానె రాస్తాన్, షహీద్ ముతహ్హరీ, భాగం1, పేజీ88]
ఈ రివాయత్ ద్వార మనకు తెలిసేదేమిటంటే ముందు చుట్టు ప్రక్కలవారి గురించి ఆలోచించాలి. ఇస్లాం ప్రతీ చిన్న విషయానికి కూడా హక్కులను వెల్లడించింది. ఇలా పొరుగువారి పట్ల కూడా మన పై కొన్ని హక్కులు ఉన్నాయి.
రిఫ్రెన్స్
దాస్తానె రాస్తాన్, షహీద్ ముతహ్హరీ, భాగం1, పేజీ88.
వ్యాఖ్యలు
Jazakallah
Shukriya....
వ్యాఖ్యానించండి