అబ్దుల్ రహ్మాన్ ఇబ్నె ఔఫ్-3

సోమ, 06/13/2022 - 15:31

అజ్ఞానపు కాలంలో ఇతని పేరు “అమ్ర్”, దైవప్రవక్త(స.అ) ఇతనిని “అబ్దుల్ రహ్మాన్” అని నామకరణం చేశారు. ఇతను “బనీజొహ్రహ్”
తో సంబంధంగల వారు. “సఅద్” యొక్క పినతండ్రి కుమారుడు...

అబ్దుల్ రహ్మాన్ ఇబ్నె ఔఫ్-3

ఇక “అబ్దుల్ రహ్మాన్ ఇబ్నె ఔఫ్” మరియు అతని ఉపాయం యొక్క ఫలితాన్ని చూడాలి. చరిత్రకారులు ఇలా అంటున్నారు: ఉస్మాన్, షైకైన్
ల సున్నత్
ను వ్యతిరేకించడాన్ని మరియు ఉస్మాన్ పెద్ద పెద్ద పదవులు, ఎక్కువ సొమ్ము తన బంధువులలో పంచడాన్ని చూసినప్పడు, అబ్దుల్ రహ్మాన్ ఇబ్నె ఔఫ్ చాలా పశ్చత్తాపడ్డారు. అందకనే ఒకరోజు అతని వద్దకు వెళ్ళి అతనిని కోపగించి ఇలా అన్నారు: “నేను కేవలం నిన్ను పదవి పై తీసుకొచ్చింది[1], నీవు మా మధ్య అబూబక్ర్ మరియు ఉమర్
ల సీరత్
ను అమలు పరుస్తావని, అంతే. మరిప్పుడు నీవు వారిని వ్యతిరేకిస్తున్నావు. బనీఉమయ్యాహ్
లలో ధనాన్ని పంచుతున్నావు. మరి వారిని ముస్లిముల పై అధికారం ఇస్తున్నావు.

ఉస్మాన్ ఇలా అన్నారు: ఉమర్ తన బంధువులకు అల్లాహ్ (శరణు) కొరకు సహాయం చేయలేదు. నేను నా బంధువులకు అల్లాహ్ (శరణు) కొరకు సహాయం చేస్తున్నాను. అబ్దుల్ రహ్మాన్ ఇలా అన్నారు: అల్లాహ్ సాక్షిగా ఇక నేను నీతో ఎన్నడూ మాట్లాడను. అబ్దుల్ రహ్మాన్ అలాగే చనిపోయారు కాని చివరి వరకు ఉస్మాన్
తో మాట్లాడలేదు, అతనితో సంబంధం చెంతుకున్నారు. ఒకసారి ఉస్మాన్ పరామర్శించడానికి అతని వద్దకు వెళ్తే అతను తన ముఖాన్ని గోడ వైపుకు త్రిప్పుకున్నారు, మరియు అతనితో ఒక్కమాట కూడా మాట్లాడలేదు.[2]

మరియు “తల్హా” మరియు “జుబైర్”
ల గురించి అలీ(అ.స) చేసిన శాపం ఎలా అంగీకరించాడో అలాగే “అబ్దుల్ రహ్మాన్” కోసం అలీ(అ.స) చేసిన శాపాన్ని కూడా అల్లాహ్ అంగీకరించాడు. మరియు వారిద్దరు కూడా శపించిన రోజే చంపబడ్డారు.

“ఇబ్నె అబిల్ హదీదె మోతజిలీ”, “షర్హె నెహ్జుల్ బలాగహ్”
లో ఇలా లిఖించారు: షూరా నాడు అలీ(అ.స)కు కోపం వచ్చింది, అతనికి అబ్దుల్ రహ్మాన్ చేసిన కుట్ర తెలిసొచ్చింది, మరియు అతనితో ఇలా అన్నారు: “అల్లాహ్ సాక్షిగా! నీ మిత్రుడి(ఉమర్)కి అతని మిత్రుడు(అబూబక్ర్)తో ఆశ ఉన్నట్లు నీకు ఉస్మాన్
తో ఆశ ఉంది, అందుకే నీవు ఉస్మాన్
కు ఖిలాఫత్
ను ఇచ్చావు, అల్లాహ్ మీ మధ్య శత్రుత్వం మరియు వైరం సృష్టించుగాక!”.[3]

హజ్రత్ అలీ(అ.స) చెప్పిన మాటకు అర్ధమేమిటంటే, అబ్దుల్ రహ్మాన్
కు అబాబక్ర్ తన తరువాత ఉమర్
ను ఎలాగైతే ఖలీఫాగా నియమించారో అలాగే ఉస్మాన్ తన తరువాత అబ్దుల్ రహ్మాన్
నే ఖలీఫా చేస్తాడని తెలుసు, అని. అప్పుడు అలీ(అ.స) ఉమర్
లో ఇలా అన్నారు: “బాగా పాలు పిండుకో అందులో నీకు కూడా భాగం ఉంది, రేపు నీకే ఈ అధికారాన్ని తిరిగి ఇచ్చేందుకు ఈరోజు నీవు దానిని బలపరుచు”.

అంతే అల్లాహ్, అలీ(అ.స) శాపాన్ని అంగీకరించాడు. కొన్ని సంవత్సరముల తరువాత ఉస్మాన్ మరియు అబ్దుల్ రహ్మాన్ మధ్య ద్వేషం, వైరం సృష్టించాడు. ఎంతేలా శత్రుత్వం అంటే అబ్దుల్ రహ్మాన్ తన బావమరిది ఉస్మాన్
తో చివరి నిమిషం వరకు మాట్లాడలేదు. మరియు తన పై జనాజా నమాజ్ చదివేందుకు అనుమతి కూడా ఇవ్వలేదు.

ఈ సంక్షిప్త సంభాషణతో మాకు ఒక విషయం స్పష్టమయ్యింది, అందేమిటంటే “అబ్దుల్ రహ్మాన్ ఇబ్నె ఔఫ్” దైవప్రవక్త(స.అ) సున్నత్
లను దాచేసిన మరియు వాటిని “ఖులీఫాల” బిద్అత్ ద్వార మార్చేసిన వారి నాయకుడు. ఎలాగైతే హజ్రత్ అలీ(అ.స) ఖిలాఫత్
ను మరియు దాని లాభాలను అతని పినతండ్రి కుమారుడు “ముహమ్మద్ ఇబ్నె అబ్దుల్లాహ్ సలవాతుల్లాహి వ సలాముహు అలైహి వ అలా అలిహిత్తయ్యబీనత్తాహిరీన్” తీసుకొచ్చిన “సున్నతే ముహమ్మదీ”ను కాపాడేందుకు బలిచ్చిన ఒకే ఒక వ్యక్తి అని మనకు తెలుసు.

గౌరవనీయులైన పాఠకులారా! నిస్సందేహముగా మీకు అహ్లెసున్నత్ వల్ జమాఅత్
ల యదార్థం తెలుసు. మరి అలాగే అల్లె సున్నత్
లు ఎవరు అన్నది కూడా తెలుసు. విశ్వాసి మోసపోగలడు కాని ఒకే రంధ్రం నుండి రెండు సార్లు కాటు వేయించుకోడు.

రిఫరెన్స్
1. దీంతో అర్ధమయ్యే విషయమేమిటంటే, అబ్దుల్ రహ్మాన్ దౌర్జన్యంగా ఉస్మాన్
ను ఖలీఫా చేశారు, అహ్లెసున్నత్ అనుకున్నట్లుగా అందులో(ఉస్మాన్ ఖిలాఫాత్ ఎన్నికలో) ప్రజలతో సలహా తీసుకోవడం, మాట్లాడడం లాంటివి ఏమీ చేయలేదు.
2. తారీఖె అబుల్ ఫిదా, భాగం1, పేజీ166. అన్సాబుల్ అష్రాఫ్, బిలాజరీ, భాగం5, పేజీ57. అల్ అఖ్దుల్ ఫరీద్, ఇబ్నె అబ్దు రబ్బిహీ మాలికీ, భాగం2, పేజీ261.
3. షర్హె నెహ్జుల్ బలాగహ్, ఇబ్నె అబిల్ హదీద్, భాగం1, పేజీ63.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8