ఇమామ్ హుసైన్(స.అ) దైవప్రవక్త(స.అ)

శని, 08/20/2022 - 14:46

దైవప్రవక్త(స.అ) దృష్టి లో ఇమామ్ హుసైన్(స.అ) ప్రాముఖ్యత ను వివరిస్తున్న ఇరువర్గాల వారి హదీసులు...

ఇమామ్ హుసైన్(స.అ) దైవప్రవక్త(స.అ)

ఇమామ్ హుసైన్ మరియు దైవప్రవక్త(స.అ) సంబంధం
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: హుసైన్ నా నుండి మరియు నేను హుసైన్ నుండి. హుసైన్ ను ఇష్టపడే వారిని అల్లాహ్ ఇష్టపడతాడు, హుసైన్ నా మనవళ్లలలో ఒకడు.[1]

ఈ హదీస్ ఇరువర్గాల వారి గ్రంథాలలో ఉల్లేఖించబడి ఉంది.[2] ఇబ్నె మాజా తన గ్రంథం సునన్ లో మరియు జమఖ్షరీ తన గ్రంథం ఫాయిఖ్ లో ఉల్లేఖించెను[3].

ఇమామ్ హుసైన్(అ.స) రైహానతుర్రసూల్
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: (ఈ) బాబు నుండి రైహానహ్ మాధిరి సుగంధం వస్తుంది, హసన్ మరియు హుసైన్ నా రెండు రైహానహ్ లు.[4]

ఈ రివాయత్ ను కూడా ఇరు వర్గాల వారు సరైన హదీస్ అని తమ గ్రంథాలలో ఉల్లేఖించారు. ఇబ్నె షహ్రే ఆషూబ్ తన మనాఖిబ్ లో, ఖర్గోషీ తన గ్రంథం షరఫున్నబీ లో, దైలమీ ఇబ్నె ఉమర్ నుండి, తిర్మజీ అబూ హురైరహ్ ద్వార తన గ్రంథం అల్ జామె లో, సహీ బుఖారీ మొ..[5]

సర్గ యువకుల నాయకుడు ఇమామ్ హుసైన్(స.అ)

అహ్లె సున్నత్ కు చెందిన ఒక సమూహం, వారిలో అల్ అజ్ హర్ యునీవర్సటీ కి చెందిన అల్లామా మనావీ అల్ కితాబుల్ కబీర్ తబరానీ నుండి జాబిర్ ఉల్లేనం: దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించెను.. హసన్ మరియు హుసైన్ స్వర్గ యువకుల నాయకులు[6].

ఈ హదీస్ కూడా ఇరు వర్గాల వారి ప్రముఖ హదీస గ్రంథాలలో ఉల్లేఖించబడి ఉంది.

హస్‌నైన్(అ.స) దైవప్రవక్త(స.అ) కుమారులు
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతీ ప్రవక్త సంతానాన్ని వారి నుండి పుట్టిస్తాడు మరియు నా సంతానాన్ని నా (సంతానం) నుండి మరియు అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) నుండి పుట్టించాడు, నిస్సందేహాంగా పిల్లలను జన్మనిచ్చిన తల్లికే సంబంధం ఉంటుంది కాని ఫాతెమా పిల్లలు, నా పిల్లలు.[7].

ఇబ్నె అబిల్ హదీద్ దీనికి సంబంధించి ఇలా అనెను.. హసన్ మరియు హుసైన్ దైవప్రవక్త(స.అ) పిల్లాలా అని ప్రశ్నిస్తే వారికితో నేను ఇలా అంటాను.. ఎందుకంటే అల్లాహ్ ముబహలహ్ ఆయత్ ను ..అబ్నాఅనా..(సూరయె ఆలి ఇమ్రాన్, ఆయత్61)  అని హసన్ మరియు హుసైన్ ను తప్ప మరొకరిని ఉద్దేశించలేదు.

ఇమామ్ హుసైన్(అ.స) శత్రువు
జైద్ ఇబ్నె అర్ఖమ్ ఉల్లేఖనం: దైవప్రవక్త(స.అ), ఫాతెమా, అలీ, హసన్ మరియు హుసైన్ ఉన్న ఇంటి ప్రక్క నుండి వెళ్తూ ఇలా అన్నారు.. వీళ్లతో వైరం కలిగివున్న వారితో నేను వైరం కలిగి ఉన్నారు. వీరు తో స్నేహంగా ఉన్న వారిలో నేను స్నేహంగా ఉంటాను.[8]

ఈ హదీసులే కాకుండా ఇంకా చాలా హదీసులు ఇమామ్ హుసైన్(అ.స) యొక్క ప్రతిష్టతను వివరిస్తూ ఇరువర్గాల వారు ఉల్లేఖించినవి చాలా ఉన్నాయి.

రిఫరెన్స్
1. కష్ఫూల్ గుమ్మాహ్ ఫీ మారిఫతిల్ అయిమ్మహా, భాగం2, పేజీ6.
2. ఇహ్ఖాఖుల్ హఖ్, షూష్తరీ, భాగం11, పేజీ265.
3. నఫసుల్ మహ్మూమ్, పేజీ28.
4. ఉయూను అఖ్బారిర్ రిజా(అ.స), భాగం2, పేజీ27.
5. బిహారుల్ అన్వార్, భాగం43, పేజీ281.
6. ఇహ్ఖాఖుల్ హఖ్, షూష్తరీ, భాగం19, పేజీ244. జామివుల్ అహాదీస్, భాగం8, పేజీ594.
7. ముంతహల్ ఆమాల్, భాగం2, పేజీ664.
8. ఇహ్ఖాఖుల్ హఖ్, షూష్తరీ, భాగం18, పేజీ412.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16