జిన్ సూరహ్

ఆది, 03/18/2018 - 08:08

అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 72వ సూరహ్ అయిన “జిన్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

జిన్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 72వ సూరహ్ ఇది. “జిన్” అల్లాహ్ సృష్టించిన కనిపించని ఒక జీవి. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “జిన్” అను పదం 3 సార్లు మరియు పూర్తి ఖుర్ఆన్ లో 22 సార్లు వచ్చింది. ఈ సూరహ్ లో 28 ఆయత్‍లు, 286 పదాలు మరియు 1109 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం 10 సార్లు వచ్చింది. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “అఅరాఫ్” సూరహ్ మరియు దీని తరువాత “యాసీన్” సూరహ్ అవతరించబడ్డాయి. “జిన్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ లో ఖుర్ఆన్ ను వినే ఒక “జిన్” సంఘటన ఉండడం. ఈ సూరహ్ లో చెప్పబడిన అంశాలు: 1. తౌహీద్ పట్ల విశ్వాసం మరియు షిర్క్ నిషేధ సూచన. 2. అదృశ్యలోకం పట్ల అల్లాహ్ యొక్క అంతులేని జ్ఞానం యొక్క ప్రస్తావనం. 3. ప్రళయం యొక్క సూచన. 4. దౌత్యం మరియు దైవప్రవక్త[స.అ] ప్రార్ధన ప్రస్థావనం. 5. అల్లాహ్ యొక్క ప్రత్యేక దూతలకు కూడా అల్లాహ్ తరపు నుండి అతీంద్రియ జ్ఞానం ఉంది అన్న విషయాన్ని గుర్తు చేయబడింది. 6. జిన్నాతుల ఖుర్ఆన్ పారాయణాన్ని వినడం మరియు వారి నుండి ఒక సమూహం దైవప్రవక్త[స.అ] పై ఈమాన్ తీసుకు వచ్చిన సంఘటన ఉంది. 7. అల్లాహ్ నుండి ముఖం త్రిప్పుకున్న వారు శిక్షకు గురి అవుతారని, మస్జిద్ లు అల్లాహ్ వి మరియు ఆయనకు తప్ప మరొకరిని ఆరాధించకండి అని చెప్పబడింది. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను “ఎక్కువగా “జిన్” సూరహ్ ను పఠించే వ్యక్తి జిన్నాతుల బారి నుండి సురక్షితంగా ఉంటాడు. మరియు హజ్రత్ ముహమ్మద్[స.అ]తో పాటు ప్రళయదినాన లెపబడతాడు.[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ140].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ140.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12