నమాజ్

గురు, 08/25/2022 - 17:49

నమాజ్ యొక్క అవసరాన్ని మరియు దాని ప్రాముఖ్యతను వివరిస్తున్న కొన్ని హదీసుల తెలుగు అనువాదం...

నమాజ్

1. సమయానికి నమాజ్ చదవడం
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: అల్లాహ్ దృష్టిలో అత్యంత ఇష్టమైన చర్చ సమయానికి నమాజ్ చదవడం, ఆ తరువాత (ఇష్టమైనది) తల్లిదండ్రుల పట్ల ఉత్తమ ప్రవర్తన, ఆ తరువాత అల్లాహ్ మార్గంలో పోరాటం.[1]

2. నమాజ్ ను తేలికగా భావించడం
ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) ఉల్లేఖనం.. నమాజ్ ను తేలికగా తీసుకోకు, దైవప్రవక్త(స.అ) చివరి క్షణాలలో ఇలా ఉపదేశించారు: “నమాజ్ ను తేలికగా భావించేవాడు నావాడు కాడు”.[2]

3. జమాఅత్ నమాజ్
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: జమాఅత్ నమాజ్ యొక్క పుణ్యం ఫురాదా (ఒంటరిగా చదివే నమాజ్) కంటే ఐదు రెట్లు ఎక్కువ పుణ్యం గలది.[3]

4. నమాజె షబ్
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: అర్ధరాత్రి చదివే రెండు రక్అత్ల నమాజ్ అల్లాహ్ దృష్టిలో ఆ లోకం మరియు అందులో ఉన్న వాటన్నీంటి కన్న ఇష్టమైనది.[4]

5. నమాజ్, పాపముల ప్రాయశ్చితం
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: ప్రతి రోజు చదివే నమాజులు మరియు జుమా నమాజ్, వచ్చే జుమా నమాజ్ వరకు పెద్ద పాపము (కబీరహ్)లు లేకపోయినట్లైతే (ఆ వారం పాటి నమాజులు అతడి) పాపముల పరిహారము.[5]

6. నమాజ్, అల్లాహ్ యొక్క దృఢమైన కోట
హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: నమాజ్, కరుణామయుడైన అల్లాహ్ యొక్క దృఢమైన కోట మరియు షైతాన్ ను తరిమికొట్టే పరికరం.[6]

7. నమాజీ పై అల్లాహ్ కారుణ్యం
హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: ఒకవేళ నమాజ్ చదివేవాడికి అతడు అల్లాహ్ యొక్క ఎలాంటి కారుణ్యానికి అర్హుడో తెలిస్తే, ఎప్పటికీ తన తలను సజ్దా నుండి పైకి ఎత్తడు.[7]

8. నమాజ్ చదివేవాడి దృష్టి హలాల్ మరియు హరామ్ పై
హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: గమనించండి! దేన్ని (ధరించి) మరియు దేనిపై నువ్వు నమాజ్ చదువుతున్నావు, ఒకవేళ అవి సరైన మరియు హలాల్ కాకపోతే, (నీ నమాజ్) స్వీకరించబడదు.[8]

9. నమాజ్ సమయంలో అత్తరు పూసుకోవడం
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: మంచి సుగంధం ద్వార చదివే ఒక నమాజు సుగంధం లేకుండా చదివే 70 నమాజులకు మించినది.[9]

10. అల్లాహ్ కు ఇష్టమైన దాసుడు
 ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: అల్లాహ్ కు ఇష్టమైన దాసుడు నిత్యం నిజం చెప్పేవాడు మరియు నమాజ్ విషయంలో జాగ్రత్త వహించేవాడు.[10]

11. ప్రళయదినం మొదటి ప్రశ్న
ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) ఉల్లేఖనం: ప్రళయదినాన ప్రశ్నించబడే మొదటి ప్రశ్న నమాజ్ గురించి అయి ఉంటుంది, అయితే అది స్వీకరించబడితేనే ఇతర చర్యలు(ఆమాల్) స్వీకరించబడతాయి.[11]

12. ఆలిమ్ మరియు జాహిల్ యొక్క నమాజ్
హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: ఆలిమ్ యొక్క రెండు రక్అత్ నమాజులు, మూర్ఖుడి 70 నమాజులకు మించినవి.[12]

13. ఉద్దేశపూర్వకంగా నమాజ్ ను చదవకపోవడం
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: ఉద్దేశపూర్వకంగా నమాజ్ ను చదవనివాడు, బహిరంగంగా అవిశ్వాసానికి పాల్పనివాడు. [13]

14. నమాజ్, అల్లాహ్ సామిప్యానికి కారణం
ఇమామ్ అలీ రిజా(అ.స) ఉల్లేఖనం: నమాజ్, ధర్మనిష్ట గల వ్యక్తి యొక్క మహోత్వం మరియు అల్లాహ్ సామిప్యానికి కారణం.[14]

15. నమాజ్, స్వర్గం యొక్క తాళం చెవి
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం.. దుఆ కారుణ్యం యొక్క తాళం చెవి, ఉజూ నమాజ్ యొక్క తాళం చెవి, నమాజ్ స్వర్గం యొక్క తాళం చెవి.[15]

రిఫరెన్స్
1. నెహ్జుల్ ఫసాహహ్, హదీస్70.
2. కాఫీ, భాగం3, పేజీ269.
3. ఖిసాలె సదూఖ్, పేజీ521, హదీస్9.
4. బిహారుల్ అన్వార్, భాగం87, పేజీ148, హదీస్23.
5. సునన్ అల్ తిర్మిజీ, భాగం1, పేజీ138, హదీస్214.
6. గురరుల్ హికమ్, హదీస్2213.
7. గురరుల్ హికమ్, హదీస్7592.
8. తొహ్ఫుల్ ఉఖూల్, పేజీ174.
9. కాఫీ, భాగం6, పేజీ511, హదీస్7.
10. అమాలీ అల్ సదూఖ్, పేజీ371, హదీస్467.
11. కాఫీ, భాగం3, పేజీ268.
12. ఎఖ్తెసాస్, పేజీ245.
13. అల్ మొఅజముల్ ఔసత్, భాగం3, పేజీ343.
14. కాఫీ, భాగం3, పేజీ265.
15. నెహ్జుల్ ఫసాహహ్, హదీస్1588.
 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18