ముస్లిం ఇబ్నె అఖీల్ ముగ్గురు ఇమాముల కాలాన్ని చూశారు.
ముస్లిం ముగ్గురు ఇమాముల కాలాన్ని చూశారు.
1. ఇమామ్ అలీ[అ.స] కాలం: ముస్లిం ఈ కాలంలో హజ్రత్ అలీ[అ.స] యొక్క అల్లుడు అయ్యే భాగ్యాన్ని పొందారు. ఇమామ్ అలీ[అ.స] కుమార్తె రుఖయ్యాహ్ తో వివాహమాడి అలవీ శిక్షణకు దగ్గరయ్యారు.
చరిత్ర కారుల వచనానుసారం హజ్రత్ అలీ[అ.స] కాలంలో(అనగా 36వ హిజ్రీ నుండి 40వ హిజ్రీ వరకు) ఇమామ్ తరపు నుండి సైన్యానికి సంబంధించిన కొన్ని ముఖ్య బాధ్యతలు అప్పగించబడ్డాయి. సిఫ్పీన్ యుద్ధంలో సైన్యం యొక్క ఒక భాగం పై అబ్దుల్లాహ్ ఇబ్నె జాఫర్ తో పాటు ముస్లిం ఇబ్నె అఖీల్ ను కూడా అధిపత్యాన్ని ఇచ్చారు.
2. ఇమామ్ హసన్[అ.స] కాలం: ఈ కాలంలో కూడా ఇమమ్ పట్ల విశ్వాసంగా ఉన్నారు. మరియు ఇమామ్ యొక్క ముఖ్య సహాబీయులలో ఒకరుగా ఉండేవారు.
3. ఇమామ్ హుసైన్[అ.స] కాలం: ముస్లిం ఇబ్నె అఖీల్ తన ఇమామ్ పట్ల ప్రేమా, గౌరవం వ్యక్తం చేసుకొనే కాలం. కుఫా వాసులు ఇమామ్ హుసైన్[అ.స]కు కుఫాకు ఆహ్వానిస్తూ పపింన సందేశాలకు జవాబుగా ముందు తన రాయబారిగా ముస్లిం ఇబ్నె అఖీల్ కు కుఫా పట్టణానికి పంపారు. కాని అక్కడ ఇబ్నె జియాద్ జిత్తుల వల్ల ఎవ్వరూ ముస్లింకు సహయపడలేదు. చివరికి ఇబ్నె జియాద్ అదేశమెరకు అతిదారుణంగా చంపబడ్డారు.[ముంతహల్ ఆమాల్, భాగం1, పేజీ416]
రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాస్ ఖుమ్మి, ముంతహల్ ఆమాల్, భాగం1, పేజీ416
వ్యాఖ్యానించండి